పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ప్రయాణీకుల రక్షణ, భద్రత పౌరవిమానయాన శాఖకు అత్యంత ప్రధానమైనవి - శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింథియా
దేశంలో పనిచేస్తున్న 149 విమానాశ్రయాలు/ హెలికాప్టర్లు/ వాటర్ ఎయిరోడ్రోమ్స్
2030 నాటికి 42 కోట్ల భారతీయులు విమానంలో ప్రయాణిస్తారని అంచనా
Posted On:
05 DEC 2023 1:02PM by PIB Hyderabad
పౌరవిమాన యాన మంత్రిత్వ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది ప్రయాణీకుల రక్షణ, భద్రతకు. ప్రయాణీకుల భద్రత కోసం అన్ని విమానాశ్రయాల వద్ద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసిఎఎస్) కావలిగా ఉండగా, వారి రక్షణను నిర్ధారించేందుకు డిజిసిఎ సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (సిఎఆర్- పౌరవిమాన అవసరాలను) జారీ చేసిందిజ
ఎవరైనా ప్రయాణికునకు సంబంధించి నియమాలను ఉల్లంఘించారనే సమాచారం వచ్చీరాగానే మంత్రిత్వ శాఖ, సంబంధిత వైమానిక సంస్థను లేదా విమానాశ్రయాన్ని స్పందన కోరుతుంది. ఒకవేళ, విమానాశ్రయంలేదా వైమానిక సంస్థ తప్పు చేసినట్టు భావిస్తే మంత్రిత్వ శాఖ వారికి జరిమానా విధిస్తుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర పౌరవిమానయాన, ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింథియా సోమవారం రాజ్యసభలో అనుబంధ ప్రశ్న సందర్భంగా సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.
తొలి 65 సంవత్సరాలలో 74 విమానాశ్రయాలు ఉండేవని, ఇప్పుడు 149 విమానాశ్రయాలు/ హెలికాప్టర్లు/ వాటర్ ఎయిరోడ్రోంలు ఇప్పుడు పని చేస్తున్నాయి. ఉడాన్ ( UDAN) పథకానికి అఅందించిన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వల్ల 1.3 కోట్ల మంది ప్రజలు విమానంలో ప్రయాణించగలిగారని శ్రీ సింథియా చెప్పారు. 2030 నాటికి భారత్‌లో 42 కోట్లమంది విమానాల్లో ప్రయాణించేలా చేయడం ప్రభుత్వం ప్రయత్నమని ఆయన తెలిపారు.
***
(Release ID: 1982827)
Visitor Counter : 75