మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సమాజంలోని అట్టడుగు వర్గాలకు డిజిటల్ ఉపకరణాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు

Posted On: 04 DEC 2023 5:37PM by PIB Hyderabad

డిజిటల్ మౌలిక వసతులు; ఆన్ లైన్ టీచింగ్  వేదికలు, సాధనాలు; ఆన్ లైన్ బోధన, శిక్షణకు అవసరమైన  వర్చువల్  లాబ్  లు, డిజిటల్ రిపోజిటరీలు, ఆన్ లైన్ అసెస్ మెంట్, టెక్నాలజీ, పెడగాజీ వసతుల్లో ఇన్వెస్ట్  చేయాలని జాతీయ విద్యా విధానం 2020 సూచిస్తోంది. బహుభాషా వినియోగానికి ప్రోత్సాహంతో పాటు, విద్యాభ్యాసం, బోధనలో భాషా శక్తిని వినియోగించుకునేందుకు సరికొత్త, ప్రయోగాత్మక విధానాలు అనుసరించాలని కూడా నిర్దేశిస్తోంది. కొన్ని సబ్జెక్ట్  లు, నైపుణ్యాలు, సామర్థ్యాలు  విద్యార్థులందరూ  అలవరచుకోవాలని ఎన్ఇపి (పేరా 4.23) సూచించింది. డిజిటల్ అక్షరాస్యత, కోడింగ్, కంప్యుటేషనల్  ఆలోచనా ధోరణుల వంటివి ఈ నైపుణ్యాల్లో ఉన్నాయి. విభిన్న డిజిటల్  చొరవల ద్వారా వాటన్నింటికీ ప్రోత్సాహం కల్పిస్తారు.

ఆత్మనిర్భర్  భారత్ అభియాన్ లో భాగంగా 2020 మే 17వ తేదీన పిఎం ఇ-విద్య పేరిట ఒక కార్యక్రమం ప్రారంభించారు. బహుముఖీన సాధనాల ద్వారా విద్యను అందుబాటులో ఉంచడం లక్ష్యంగా డిజిటల్/ఆన్ లైన్/ఆన్-ఎయిర్ విద్యా విధానాన్నింటినీ ఏకీకృతం చేయడం దీని లక్ష్యం.

పిఎం ఇ-విద్యా కార్యక్రమాలన్నీ దేశంలోని అన్ని రాష్ర్ర్టాలకు చెందిన విద్యార్థులందరికీ ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.

పిఎం ఇ-విద్యలోని ప్రధానాంశాలు...

·       రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల విద్యార్థులందరికీ నాణ్యమైన ఇ-కంటెంట్ అందించేందుకు అవసరమైన జాతీయ డిజిటల్  మౌలిక వసతుల వేదిక దీక్ష; అన్ని గ్రేడ్  లకు క్యుఆర్  కోడ్ స్కాన్  చేయడం ద్వారా సేకరించుకోదగిన టెక్స్ట్  పుస్తకాలు (ఒక జాతి, ఒక డిజిటల్  వేదిక).

·       1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అన్ని రాష్ర్టాలు విభిన్న భారతీయ భాషల్లో అనుబంధ విద్య అందుబాటులో ఉంచేందుకు వీలుగా 2022-23 కేంద్ర బడ్జెట్  ప్రకటనకు అనుగుణంగా 12 డిటిహెచ్  చానళ్లు 200 పిఎం ఇ-విద్య డిటిహెచ్  టివి చానళ్లుగా విస్తరణ

·       రేడియో, కమ్యూనిటీ రేడియో, సిబిఎస్ఇ పాడ్ కాస్ట్-శిక్షా వాణి విస్తృత వినియోగం

·       అంధులు, బధిరుల కోసం డిజిటల్  గా అందుబాటులో ఉన్న సమాచార వ్యవస్థ (డైసీ) ద్వారా రూపొందించిన ఇ-కంటెంట్; ఎన్ఐఓఎస్ వెబ్  సైట్/యు ట్యూబ్  ద్వారా సంకేత భాషల అందుబాటు

·       విమర్శనాత్మక ఆలోచనా ధోరణితో కూడిన నైపుణ్యాలు అలవరచడం, సృజనాత్మకతకు స్థానం కల్పించడం లక్ష్యంగా 2023లో 750 వర్చువల్ లాబ్ లు, 75 స్కిల్లింగ్ ఇ-లాబ్  ల ఏర్పాటు. 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు సైన్స్,  గణిత శాస్ర్తంలో అభ్యాసానికి వర్చువల్  లాబ్  లు; సిమ్ములేషన్ ఆధారిత అభ్యాస వాతావరణానికి స్కిల్లింగ్  ఇ-లాబ్  లు పని చేస్తాయి. దీక్షా  పోర్టల్  పై ఒక వర్చువల్  లాబ్ కూడా అందుబాటులో ఉంచారు. పిఎం ఇ-విద్య డిటిహెచ్  టివి చానళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ శిక్షకుల కోసం వర్చువల్ లాబ్   పై శిక్షణ కూడా అందుబాటులో ఉంది.

వీటితో పాటుగా కేంద్ర స్పాన్సర్ షిప్  లోని ఐసిటి, డిజిటల్  కార్యక్రమ పథకం సమగ్ర శిక్ష 6  నుంచి 12 తరగతులున్న ప్రభుత్వ, ఎయిడెడ్  పాఠశాలలను కవర్  చేస్తుంది.  ఈ కార్యక్రమం కింద పాఠశాలల్లో ఐసిటి లాబ్  లు,  స్మార్ట్  తరగతి గదుల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తారు.

దేశంలో పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ఐఐటి కాన్పూర్  సహకారంతో సాథీ పోర్టల్ రూపొందించారు. దీనికి సంబంధించిన బెటా వెర్షన్  పై దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థుల నుంచి అభిప్రాయాల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది.

విద్యా శాఖ  సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి లోక్ సభకు సమర్పించిన ఒక లిఖిత పూర్వక సమాచారంలో ఈ వివరాలు వెల్లడించారు.

 

***


(Release ID: 1982638) Visitor Counter : 111


Read this release in: English , Urdu