జల శక్తి మంత్రిత్వ శాఖ

భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ స్థాయిని తగ్గించడం కోసం కార్యక్రమం

Posted On: 04 DEC 2023 6:10PM by PIB Hyderabad

సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్  భూగర్భ జల నాణ్యత పర్యవేక్షణ కార్యక్రమం మరియు వివిధ శాస్త్రీయ అధ్యయనాలలో భాగంగా ప్రాంతీయ స్థాయిలో తమిళనాడుతో సహా దేశంలోని భూగర్భ జల నాణ్యత డేటాను రూపొందిస్తుంది. తమిళనాడుతో సహా వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో మానవ వినియోగానికి అనుమతించదగిన పరిమితులకు మించి (బీ ఐ ఎస్ ప్రకారం) భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ఉన్నట్లు ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. 25 రాష్ట్రాల్లోని 230 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో ఆర్సెనిక్ ఉన్నట్టు నివేదించబడింది. తమిళనాడులో, 1208 భూగర్భ జలాల నమూనాలలో, 16 నమూనాలు (1.3%) మాత్రమే బీ ఐ ఎస్ పరిమితికి మించి ఆర్సెనిక్ ఉన్నట్లు కనుగొనబడింది. ఇంకా, ఆర్సెనిక్ కాలుష్యం భౌగోళిక మూలం అని అర్థం చేసుకోవచ్చు, అనుకూలమైన పరిస్థితులలో మట్టి/జలవనరుల నుండి ఆర్సెనిక్ విడుదల అవుతుంది. భూగర్భజలంలో ఆర్సెనిక్ కలుషితం అనేది భూగర్బ మూలం కాబట్టి, భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ స్థాయిని పెద్ద  ఎత్తున తగ్గించడం సాధ్యం కాదు.

 

నీరు రాష్ట్ర అంశం అయినందున, భూగర్భ జలాల నాణ్యతను మెరుగుపరచడానికి మరియు కాలుష్య సమస్యను తగ్గించడానికి చొరవ తీసుకోవడంలో భూగర్భ జల నిర్వహణ బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అయితే, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంది. వాటిలో కొన్ని తదుపరి పేరాలలో ఇవ్వబడ్డాయి.

 

 ఆర్సెనిక్ ప్రభావిత ప్రాంతాలలో కాలుష్య రహిత తాగు నీటి సరఫరా కోసం సిమెంట్ సీలింగ్ సాంకేతికతను ఉపయోగించి ఆర్సెనిక్ రహిత బావులను సీ జీ డబ్ల్యూ ఎస్ విజయవంతంగా నిర్మిస్తోంది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి,రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు/కాలుష్య నియంత్రణ కమిటీల  సహకారంతో నీటి (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం, 1974 మరియు పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986లోని నిబంధనలను అమలు చేస్తోంది. నీటిలో కాలుష్యాన్ని నియంత్రిస్తాయి.

భారత ప్రభుత్వం, రాష్ట్రాల భాగస్వామ్యంతో, దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి నిర్ణీత నాణ్యతతో మరియు క్రమమైన, దీర్ఘకాలిక ప్రాతిపదికన త్రాగడానికి కుళాయి నీటి సరఫరాను అందించడానికి ఆగస్టు, 2019 నుండి జల్ జీవన్ మిషన్ ని అమలు చేస్తోంది. జల్ జీవన్ మిషన్ కింద, గృహాలకు పంపు నీటి సరఫరాను అందించడానికి నీటి సరఫరా పథకాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు, నాణ్యత-ప్రభావిత నివాసాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులను కేటాయిస్తున్నప్పుడు, రసాయన కలుషితాల వల్ల ప్రభావితమైన ఆవాసాలలో నివసించే జనాభాకు 10% ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సురక్షితమైన తాగు నీటి కోసం  పైపుల నీటి సరఫరా పథకాల ప్రణాళిక, అమలు మరియు ప్రారంభించడానికి సమయం పట్టవచ్చు కాబట్టి, పూర్తిగా తాత్కాలిక చర్యగా, రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు అలాంటి ఆవాసాలలో ప్రతి ఇంటికి వారి తాగు మరియు వంట అవసరాలను తీర్చడానికి తలసరి రోజుకు 8-10 లీటర్లు నీటి సరఫరా కోసం కమ్యూనిటీ తాగునీటి పరిశుభ్ర  ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని సూచించబడ్డాయి. 

డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ లో భాగంగా దేశంలోని 27,544 ఆర్సెనిక్/ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామీణ ఆవాసాలు కోసం 22 మార్చి 2017న జాతీయ నీటి నాణ్యత  సబ్ మిషన్ ని ప్రారంభించింది, దీనిని ఇప్పుడు జే జే ఎం కింద చేర్చారు. 

అదేవిధంగా, అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) పథకం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 500 నగరాలు మరియు పట్టణాలలో జూన్ 25, 2015 నుండి అమలు చేయబడుతోంది, ఇది అమృత్ నగరాల్లో నీటి సరఫరా, మురుగునీరు పారిశుధ్యం నిర్వహణ,తుఫాను నీటి పారుదల, హరిత ప్రదేశాలు, పార్కులు మరియు మోటారు లేని పట్టణ రవాణావంటి ప్రాథమిక పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది.  ఇంకా, అమృత్- 2.0 01 అక్టోబర్ 2021న 05 సంవత్సరాల కాలానికి (ఎఫ్ వై 2021-22 నుండి 2025-26 వరకు), దేశం లోని అన్ని చట్టబద్ధమైన పట్టణాలలో  గృహ కుళాయి కనెక్షన్ ద్వారా నీటి సరఫరా యొక్క సార్వత్రిక కవరేజీని అందించే లక్ష్యంతో ప్రారంభించబడింది.

ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***



(Release ID: 1982585) Visitor Counter : 81


Read this release in: English , Urdu