కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

"పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్యం" అనే అంశం పై ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన 23వ ప్రపంచ కాంగ్రెస్‌ లో "ఐ.ఎస్.ఎస్.ఏ. విజన్ జీరో 2023" అవార్డును అందుకున్న - కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈ.ఎస్.ఐ.సి)

Posted On: 04 DEC 2023 3:59PM by PIB Hyderabad

"పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్యం" అనే అంశంపై ఇటీవల ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహించిన 23వ ప్రపంచ కాంగ్రెస్‌ లో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈ.ఎస్.ఐ.సి) "ఐ.ఎస్.ఎస్.ఏ. విజన్ జీరో-2023" అవార్డును అందుకుంది.  "విజన్-జీరో" అనేది పని ప్రదేశాల్లో జరిగే ప్రమాదాల నివారణకు అన్ని స్థాయిల్లో భద్రత, ఆరోగ్యం, శ్రేయస్సు అనే మూడు కోణాలను ఏకీకృతం చేసే పరివర్తన విధానం.

 

 

కార్మికులు, వారిపై ఆధారపడిన వారికి వైద్య సంరక్షణ, నగదు ప్రయోజనాల కోసం ప్రమాదానంతర సహాయం అందించే విధానం తో పాటు నివారణ వ్యూహాన్ని కూడా సమాంతరంగా అమలు చేయడం ద్వారా పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్య రంగాల్లో కార్మిక రాజ్య బీమా సంస్థ సాధించిన గొప్ప విజయానికి గుర్తింపుగా, ఈ.ఎస్.ఐ.సి. కి ఈ "ఐ.ఎస్.ఎస్.ఏ. విజన్ జీరో-2023" అవార్డు లభించింది.  మెరుగైన సేవలు అందించడం తో పాటు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయంతో ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్ పరిపాలన, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించినందుకు గుర్తింపుగా కూడా ఈ అవార్డు లభించినట్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 

 

 

"పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్యం" అనే అంశంపై ప్రపంచ కాంగ్రెస్‌ లో కార్మిక రాజ్య బీమా సంస్థ కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ.ఎస్.ఐ.సి. డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర కుమార్ ఈ అవార్డును అందుకున్నారు.

 

 

అంతర్జాతీయ సామాజిక భద్రతా సంస్థ (.ఎస్.ఎస్.)

 

 

అంతర్జాతీయ సామాజిక భద్రతా సంస్థ (ఐ.ఎస్.ఎస్.ఏ) అనేది ప్రపంచంలోని సామాజిక భద్రతా సంస్థలు, సంఘాలను ఒకచోట చేర్చే ప్రధాన అంతర్జాతీయ సంస్థ.  సామాజిక భద్రతా పరిపాలనలో శ్రేష్ఠతకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రపంచీకరణలో భాగంగా సామాజిక కోణంలో క్రియాశీల సామాజిక భద్రతను ప్రోత్సహించడం - ఐ.ఎస్.ఎస్.ఏ. లక్ష్యం.   1927లో స్థాపించబడిన ఐ.ఎస్.ఎస్.ఏ. జెనీవాలోని అంతర్జాతీయ కార్మిక కార్యాలయంలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది.  ప్రపంచవ్యాప్తంగా క్రియాశీల సామాజిక భద్రతా వ్యవస్థలను రూపొందించడానికి, ప్రోత్సహించడానికి సభ్య సంస్థలకు అవసరమైన సమాచారం, నిపుణుల సలహాలు, వ్యాపార ప్రమాణాలు, ఆచరణాత్మక మార్గదర్శకాలతో పాటు ఐ.ఎస్.ఎస్.ఏ. వాటికి  సరైన వేదికలను అందుబాటులో ఉంచుతుంది.  క్రియాశీల సామాజిక భద్రత అందించాలనే ఆశయం ఐ.ఎస్.ఎస్.ఏ. చర్యలకు ఒక కార్యాచరణ ప్రణాళికను అందిస్తుంది.

 

 

ఐ.ఎస్.ఎస్.ఏ. దక్షిణాసియా అనుసంధాన కార్యాలయం ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుండి పని చేస్తోంది.  పరిశోధనతో పాటు, సామాజిక భద్రతకు సంబంధించిన అంశాలపై ఏకాభిప్రాయం కోసం భూటాన్, ఇరాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్‌ వంటి సభ్య దేశాలతో ఈ అనుసంధాన కార్యాలయం సన్నిహితంగా సమన్వయం చేస్తూ ఉంటుంది. 

 

 

*****



(Release ID: 1982550) Visitor Counter : 97


Read this release in: English , Hindi , Punjabi