పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పీఎంయూవై ప్రయోజనాలు పొడిగింపు
Posted On:
04 DEC 2023 4:27PM by PIB Hyderabad
దేశంలోని పేద కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి ఉజ్వల యోజనను (పీఎంయూవై) 2016 మే నెలలో ప్రారంభించారు. ఈ పథకం కింద, పేద కుటుంబాల్లోని మహిళలకు డిపాజిట్ లేని ఎల్‌పీజీ కనెక్షన్ అందిస్తారు. 31.10.2023 నాటికి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 9.67 కోట్ల క్రియాశీల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో రాజస్థాన్‌లో 69.26 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. 2022 మే నెల నుంచి, పీఎంయూవై వినియోగదార్లకు, 14.2 కిలోల సిలిండర్‌కు 200/- చొప్పున రాయితీని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. 2023 అక్టోబర్‌లో, ఈ రాయితీని 300/-కు పెంచింది. సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు ఇది వర్తిస్తుంది. 5 కిలోల కనెక్షన్లకు దామాషా ప్రకారం రాయితీ వర్తిస్తుంది.
దీంతోపాటు, 2020 ఏప్రిల్ నుంచి 2020 డిసెంబర్ వరకు, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద పీఎంయూవై లబ్ధిదార్లకు కేంద్ర ప్రభుత్వం 3 ఉచిత సిలిండర్ల వరకు అందించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 14.17 కోట్ల ఉచిత సిలిండర్లను అందించారు.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1982547)