బొగ్గు మంత్రిత్వ శాఖ
జమునా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్, ఎస్ఇసిఎల్ వద్ద విజయవంతమైన విజయవంతమైన పరిహారక అటవీకరణ
Posted On:
04 DEC 2023 1:49PM by PIB Hyderabad
బొగ్గు తవ్వకాల పర్యావరణ పాదముద్రలను తగ్గించే లక్ష్యంతో బొగ్గు మంత్రిత్వ శాఖ నిలకడైన పునరుద్ధరణ, అటవుల పెంపకం చొరవలతో పర్యావరణ సారథ్యం దిశగా మార్గదర్శక అడుగులు వేసింది. తన కార్యకలాపాలను 30 నవంబర్ 1973న మధ్యప్రదేశ్‌లోని అనుప్పుర జిల్లాలో ప్రారంభించిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ ఇ సిఎల్)లోని జమునా ఒపెన్ కాస్ట్ ప్రాజెక్టు విజయం ద్వారా ఈ చొరవ ఆదర్శం, ఉదాహరణ అయింది.
తన ప్రయోజనాన్ని నెరవేర్చిన జమునా ఒసిపి, జూన్ 2014లో వనరులు లుప్తం కావడంతో తన మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేసింది. దీని అనంతరం, సూక్ష్మ ప్రణాళికతో గనిని మూసివేశారు. ఇటీవలి శాటిలైట్ డాటా ప్రకారం, క్వారీ ప్రాంతంలోని 88.07 శాతంను విజయవంతంగా పునరుద్ధరించి, సుస్థిరమైన బొగ్గు తవ్వకాల ఆచారణలకు తాము కట్టుబడి ఉంటామని మంత్రిత్వ శాఖ తన నిబద్ధతను ప్రదర్శించింది.
పునరుద్ధరించిన భూమిలో దాదాపు 672 హెకా్టర్లను అటవీకరణకు అంకితం చేశారు. ఇందులో 131 హెక్టార్ల మొక్కలు నాటిన భూమి భూగర్భజలాల రీఛార్జికి దోహదం చేయడం ద్వారా జలసంరక్షణ అన్న విస్త్రత లక్ష్యానికి దోహదం చేసే విధంగా వ్యూహాత్మంగా ఎంపిక చేశారు.
అక్రెడిటెడ్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ (ఎసిఎ) కార్యక్రమం కింద 579 హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ముందు చూపు కలిగిన ఈ వైఖరి ఒకనాడు బొగ్గు తవ్వకాల కోసం ఉపయోగించిన భూమిని జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడమే కాక పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో సమలేఖనం అయ్యేలా దానిని ఒక పచ్చటి ఆవరణగా పరివర్తన చేయాలని సంకల్పించారు.
నిలకడైన వృద్ధి, బాధ్యత కలిగిన వనరుల నిర్వహణకు బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందనేందుకు ఈ చొరవ ఒక చిహ్నం. అటువంటి సమగ్ర చర్యలను అనుసరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో బొగ్గు తవ్వకం వంటి ఆర్ధిక కార్యకలాపాలు సహజీవనం చేయవచ్చని పరిశ్రమకు మంత్రిత్వ శాఖ ఒక ప్రమాణాన్నిఅందించింది.
***
(Release ID: 1982435)
Visitor Counter : 104