రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

బాలికల సైనిక పాఠశాలలు

Posted On: 04 DEC 2023 2:07PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, ఝాన్సీ, మైన్‌పురిలో ఉన్న మూడు సైనిక్ పాఠశాలలు సహా, గత పద్ధతి ప్రకారం దేశంలో ఏర్పాటు చేసిన మొత్తం 33 సైనిక్ పాఠశాలలు కో-ఎడ్యుకేషన్‌ విధానంలో ఉన్నాయి. గత పద్ధతి ప్రకారం పూర్తిగా బాలికల సైనిక పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో లేదు.

అన్ని రాష్ట్రాలు/యూటీల్లో ఎన్‌జీవోలు/ప్రైవేటు/రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల భాగస్వామ్యంతో 100 కొత్త సైనిక పాఠశాలలు ఏర్పాటు చేసే కార్యక్రమం కింద, పూర్తిగా బాలికల సైనిక పాఠశాలల ఏర్పాటుకు ఎలాంటి పరిమితి లేదు. దీనికి సంబంధించి, ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని సంవిద్ గురుకులం సీనియర్ సెకండరీ పాఠశాల పూర్తి బాలికల సైనిక పాఠశాలగా ఆమోదం పొందింది.

రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్, లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని ఈ రోజు రాజ్యసభలో శ్రీమతి సంగీత యాదవ్‌కు అందించారు.

 

 ***



(Release ID: 1982393) Visitor Counter : 109