శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశం కోసం "బయో-విజన్" ని నిర్వచించాల్సిన సమయం ఆసన్నమయింది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
జీవ సాంకేతిక పరిశోధన, ఆవిష్కరణలను పెంపొందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ, ఆహారం, శక్తి అవసరాలు వంటి రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలను సాకారం చేయడానికి ఉద్దేశించిన బ్రిక్ సొసైటీ మొట్టమొదటి సమావేశంలో ప్రసంగించిన - డాక్టర్ జితేంద్ర సింగ్
"సబ్-కా-ప్రయాస్" స్ఫూర్తిని పెంపొందించడం ద్వారా, ప్రభుత్వం 14 పెద్ద సైన్స్ స్వయంప్రతిపత్తి సంస్థలను కలిపి బ్రిక్ (బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్) సొసైటీ అనే ఏకీకృత వేదికపైకి చేర్చుతోంది: కేంద్ర మంత్రి
బ్రిక్ మరియు దాని సంస్థలు ప్రభుత్వ-ప్రైవేట్ పరిశోధన భాగస్వామ్యాల్లో పాల్గొనవచ్చు, పరిశోధన సంబంధిత కార్యకలాపాల కోసం ప్రభుత్వేతర వనరుల నుండి నిధులతో సహా ఎండోమెంట్‌లను పొందవచ్చు: డాక్టర్ జితేంద్ర సింగ్
బ్రిక్ లో భాగమైన 14 సంస్థల్లో ప్రతి ఒక్కటి బ్రిక్ గవర్నింగ్ బాడీ కేటాయించే విభిన్న పరిశోధన ఆదేశాలను నిర్వహిస్తాయి: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
గత పదేళ్లలో భారతీయ బయో ఎకానమీ 13 రెట్లు పెరిగింది: డాక్టర్ జితేంద్ర సింగ్
బ్రిక్ సొసైటీ మొదటి సమావేశం సందర్భంగా ఈరోజు సిటిజన్ సెంట్రిక్
Posted On:
02 DEC 2023 2:02PM by PIB Hyderabad
2023 నవంబర్, 10వ తేదీన క్యాబినెట్ ఆమోదం పొందిన "బ్రిక్" సొసైటీ రిజిస్ట్రేషన్ తర్వాత ఈరోజు జరిగిన మొట్టమొదటి సమావేశంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, భారతదేశం కోసం "బయో-విజన్" ని నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
జీవ సాంకేతిక పరిశోధన, ఆవిష్కరణలను పెంపొందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ, ఆహారం, శక్తి అవసరాలు వంటి రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలను, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (బ్రిక్) అనే కొత్త అత్యున్నత స్వయంప్రతిపత్తి సంస్థ సాకారం చేస్తుందని, డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
గత పదేళ్లలో భారతీయ జీవ-ఆర్థిక వ్యవస్థ 13 రెట్లు పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు.
"బయో-టెక్ గ్లోబల్ ఎకోసిస్టమ్‌లో మొదటి 10 దేశాల కూటమిలో చేరుకోవడానికి భారతదేశం ఎంతో దూరంలో లేదు", అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను కేంద్ర మంత్రి ఉటంకిస్తూ, 'బ్రిక్' దీనికి సాక్ష్యంగా ఉండనుందని, "సబ్-కా-ప్రయాస్" స్ఫూర్తిని మళ్లీ పెంపొందించడం ద్వారా ప్రభుత్వం ఉత్తమమైన ఆలోచనలను ఏకీకృత వేదికపైకి తీసుకు వస్తోందని పేర్కొన్నారు.
దేశంలో బయో-టెక్నాలజీని ప్రోత్సహించడానికి నోడల్ ఏజెన్సీగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి) పనిచేస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (బ్రిక్) దేశవ్యాప్తంగా జీవ-సాంకేతిక పరిశోధనల ప్రభావాన్ని పెంచి, కేంద్రీకృత, ఏకీకృత పాలన కోసం, 14 స్వయంప్రతిపత్తి సంస్థ (ఏ.ఐ) లను ఒక అత్యున్నత స్వయం ప్రతిపత్తి సొసైటీ కింద విలీనం చేయడం ద్వారా వాటిని హేతుబద్ధీకరించడానికి కేబినెట్ ఆమోదం తీసుకోవడం జరిగింది.
ఈ ఉన్నత సంస్థలు జీవ సాంకేతిక పరిశోధన, అభివృద్ధి, పర్యావరణ వ్యవస్థల పై ప్రభావం చూపేందుకు తమ ప్రయత్నాలను ఏకీకృతం చేస్తున్నాయని, డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొంటూ, ఈ బ్రిక్ సమావేశాన్ని భారతదేశ బయోటెక్ ఎకోసిస్టమ్ లో ఒక చారిత్రాత్మక సంఘటనగా, అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థ, ఉపాధితో సహా ప్రతి రంగంలోనూ భారతదేశ పురోగతిని 'బ్రిక్' సంస్థ సుసంపన్నం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిష్ణాతులైన ఈ సంస్థల నిర్మాతలుగా, ఈ మహత్తరమైన మిషన్ కు వారు అద్భుతమైన విలువను తీసుకురావాలని భావిస్తున్నందున, ఈ ముఖ్యమైన సమావేశంలో భారతదేశం కోసం బయో-విజన్ ను నిర్వచించడం కోసం వారి అభిప్రాయాలను కోరాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.
స్వయంప్రతిపత్త సంస్థల ప్రక్రియ, పనితీరు మెరుగుదల కోసం "స్వయంప్రతిపత్తి సంస్థల హేతుబద్ధీకరణ"ను విజయవంతంగా అమలు చేసిన భారత ప్రభుత్వంలోని మొదటి శాఖలలో ఇది ఒకటి అని డాక్టర్ జితేంద్ర సింగ్, పేర్కొన్నారు. బ్రిక్ లో భాగమైన 14 సంస్థల్లో ప్రతి ఒక్కటి బ్రిక్ గవర్నింగ్ బాడీ కేటాయించే
***
(Release ID: 1982297)
Visitor Counter : 138