ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గౌహతిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన - కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొ. ఎస్.పి. సింగ్ బఘేల్
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఇతివృత్తం : సమాజాలను నాయకత్వం వహించనిద్దాం
"భారతదేశం వసుధైవ కుటుంబకాన్ని నమ్ముతుంది, తద్వారా ప్రతి ఒక్కరూ వ్యాధి బారిన పడకుండా ఉంటారు”
Posted On:
01 DEC 2023 5:46PM by PIB Hyderabad
అస్సాం, గౌహతిలోని శ్రీమంత శంకరదేవ అంతర్జాతీయ ఆడిటోరియంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని అస్సాం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కేశబ్ మహంత తో కలిసి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్. పి. సింగ్ బఘేల్ ప్రారంభించారు. “సమాజాలను నాయకత్వం వహించనిద్దాం” అనే ఇతివృత్తం తో ఈ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
2023 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని “సమాజాలను నాయకత్వం వహించనిద్దాం” అనే ఇతివృత్తం తో పాటు, ఈ వ్యాధితో పోరాడ్డంలో భారతదేశం సాధించిన ప్రయాణం గురించి, సమాజాలు భయానక పరిస్థితుల నుంచి క్రమశిక్షణ, స్థితిస్థాపకత దిశగా మార్గం సుగమం చేయడంలో సామాన్య పౌరుడు పోషించిన కీలక పాత్ర గురించి ప్రొఫెసర్ బాగెల్ వివరించారు. ఈ రోజున వ్యాధి పట్ల ప్రజల్లో భయం లేదని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి సూచించారు.
హెచ్.ఐ.వి., ఎయిడ్స్ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకున్న స్థిరమైన, అంకితమైన విధానం గురించి ప్రొఫెసర్ బాఘెల్ ప్రముఖంగా తెలియజేస్తూ, జాతీయ ఎయిడ్స్, ఎస్.టి.డి. నియంత్రణ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న 5వ దశకు ప్రభుత్వం 15,471 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. “పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కోరుకున్న స్వాస్త్ అంత్యోదయ ఇదే" అని ఆయన అన్నారు. హెచ్.ఐ.వి., ఎయిడ్స్ నివారణ, నియంత్రణ చట్టం, 2017 - హెచ్.ఐ.వి. రోగులకు మానవ హక్కులను బలోపేతం చేసే ఆయుధమని, ఇది సమాజంలో వివక్షను అంతం చేయడంలో కీలకమైన ముందడుగని, ఆయన వివరించారు.
యాంటీ-రెట్రోవైరల్ చికిత్స ఖర్చును తగ్గించడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నం గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “భారతదేశం వసుధైవ కుటుంబాన్ని విశ్వసిస్తుంది – తద్వారా ప్రతి ఒక్కరూ వ్యాధి నుండి విముక్తి పొందారు. ఈరోజు ప్రధానమంత్రి మోదీజీ నాయకత్వంలో మనం ఈ తీవ్రమైన వ్యాధిని నియంత్రించడంలో విజయం సాధించాము.” అని వివరించారు.
కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులకు ప్రొఫెసర్ బఘెల్ ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేశారు. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో అత్యధిక సంఖ్యలో ఆయుష్మాన్ కార్డ్‌లను పంపిణీ చేసిన ఘనత అస్సాం రాష్ట్రానికే దక్కింది.
హెచ్.ఐ.వి. ప్రతిస్పందనలో కమ్యూనిటీలు పోషించే కీలక పాత్ర గురించి యు.ఎన్.ఎయిడ్స్, కంట్రీ డైరెక్టర్, డేవిడ్ బ్రిడ్జర్ ప్రత్యేకంగా తెలియజేస్తూ, “కమ్యూనిటీ నేతృత్వంలోని సంస్థలు ఇతర సంస్థలు అందించలేని ఫలితాలను అందిస్తాయి. కమ్యూనిటీ నాయకత్వం యొక్క పూర్తి సామర్థ్యాన్ని ప్రారంభించడం ద్వారా మనం ఎయిడ్స్ ను అంతం చేయవచ్చు.” అని పేర్కొన్నారు. భారతదేశ జాతీయ ఎయిడ్స్ ప్రతిస్పందన కార్యక్రమం గురించి ఆయన వివరిస్తూ, ప్రపంచ స్థాయి అతి పెద్ద విజయవంతమైన కార్యక్రమంలో ఇది ఒకటని అభివర్ణించారు. "జాతీయ నిబద్ధత, వ్యూహాత్మక చర్యకు భారతదేశ ఎయిడ్స్ ప్రతిస్పందన ఒక ఉదాహరణ, ఇక్కడ ప్రభుత్వం మరియు సమాజం మధ్య భాగస్వామ్యం ప్రధానమైనది. ఇది హెచ్.ఐ.వి. ఎయిడ్స్ నియంత్రణ చట్టం, పరీక్ష, చికిత్సా విధానం, మిషన్ సంపర్క్ వంటి మరెన్నో కార్యక్రమాలకు దిక్సూచిగా ఉంటుంది." అని ఆయన వివరించారు.
భారతదేశంలోని డబ్లూ.హెచ్.ఓ. ప్రతినిధి డాక్టర్ రోడ్రికో హెచ్. ఆఫ్రిన్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా హెచ్.ఐ.వి. ప్రతిస్పందన కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడుతూ, బలమైన రాజకీయ నాయకత్వం, తగిన వనరులు, ఫలితం-ఆధారిత చర్యలు, సమ్మిళిత విధానాలతో పాటు, అన్నింటికంటే సమానత్వాన్ని దృఢంగా ప్రోత్సహిస్తూ చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు. ఈ అంశంలో భారతదేశం అద్భుతమైన రికార్డులను సాధించినందుకు ఆయన అభినందనలు తెలిపారు. 2010 నుండి భారతదేశంలో వార్షిక ఎయిడ్స్ సంబంధిత మరణాలలో 76.5 శాతం క్షీణత మరియు వార్షిక కొత్త హెచ్.ఐ.వి. ఇన్‌ఫెక్షన్ల లో 46.3 శాతం తగ్గుదల నమోదైందని ఆయన చెప్పారు. "ఇవి చెప్పుకోదగ్గ ముఖ్యమైన విజయాలు," అని డాక్టర్ ఆఫ్రిన్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కింది పత్రాల విడుదల, ఆవిష్కరణ కూడా జరిగింది:
ఏ) సంకలక్: 5వ ఎడిషన్ - ఎన్.ఏ.సి.పి. కి చెందిన అన్ని భాగాలలో డేటా ఆధారిత సమగ్ర పురోగతిని అందించే ఫ్లాగ్ షిప్ నివేదిక.
బి) భారతదేశ హెచ్.ఐ.వి. అంచనాలు 2022: సాంకేతిక నివేదిక – దేశంలో అంటువ్యాధుల అధ్యయనానికి సంబంధించిన సాక్ష్యాల తాజా సమాచారంతో కూడిన తాజా సంచిక
సి) ఎన్.ఏ.సి.ఓ. క్యాలెండర్ - 2024
డి) జాతీయ కమ్యూనికేషన్ వ్యూహం - దేశవ్యాప్తంగా హెచ్.ఐ.వి/ఎయిడ్స్/ఎస్.టి.ఐ. నివారణ, చికిత్స, సంరక్షణ, మద్దతుకు సంబంధించిన కీలక సమాచారాన్ని సమర్థవంతంగా తెలియజేయడానికి, వ్యాప్తి చేయడానికి వ్యూహాత్మక విధానాన్ని వివరించే సమగ్ర విధానం.
ఇ) హెచ్.ఐ.వి. సోకిన శిశువులకు ప్రారంభ దశలోనే నిర్ధారణపై ప్రయోగశాల సాంకేతిక మార్గదర్శకాలు – జాతీయ కార్యక్రమం, రోగనిరోధక చర్యలు, నమూనా సేకరణ, పరీక్ష, రిపోర్టింగ్ తో సహా ప్రయోగశాల ప్రక్రియల సమగ్ర సమాచారం.
ఎఫ్) నివారణ పురోగతి తాజా సమాచారం 2022-23 – ఎన్.ఎ.సి.పి. కింద హెచ్.ఆర్.జిఐ. లు, మధ్యలో ఉండే జనాభా, జైళ్లలో ఉండే వ్యక్తులు, ఇతర విధాలుగా ప్రమాదంలో ఉన్న వ్యక్తులు, దుర్బలమైన వ్యక్తులకు సేవలను అందించడం కోసం పురోగతిని ఎప్పటికప్పుడు సేకరించి, విశ్లేషించడం, ప్రచారం
****
(Release ID: 1982052)
Visitor Counter : 105