రైల్వే మంత్రిత్వ శాఖ

నవంబర్ 2023 నాటికి 1015.6 ఎంటీల సరుకు రవాణా చేపట్టిన భారతీయ రైల్వే

Posted On: 01 DEC 2023 4:42PM by PIB Hyderabad

• గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే సరుకు రవాణా లోడింగ్ 36.9 ఎంటీలు పెరిగింది

• సరుకు లోడింగ్ ద్వారా ఏప్రిల్-నవంబర్ 2023లో రూ. 110007.5 కోట్లు ఆర్జించిన రైల్వేలు

• గతంతో పోల్చితే రూ.4102.4 కోట్లు పెరిగిన సరుకు రవాణా ఆదాయం

• రైల్వేలు నవంబర్ 2023లో 128.4 ఎంటీల సరుకు రవాణాను సాధించింది

• గత సంవత్సరం అదే సమయం సరుకు రవాణా లోడింగ్ కంటే ఇది 4.3% ఎక్కువ

ఏప్రిల్ - నవంబర్ 2023 వరకు సంచిత ప్రాతిపదికన భారతీయ రైల్వేలు 1015.669 ఎంటీల సరుకు రవాణాను చేపట్టాయి. గత సంవత్సరం ఇది 978.724 ఎంటీలుగా ఉంది. అంటే గత సంవత్సరం లోడింగ్ కంటే ఇది సుమారుగా 36.945 ఎంటీలు మెరుగుపడిందిరైల్వేలు గత సంవత్సరంలో రూ. 105905.1 కోట్ల ఆదాయం సాధించగా.. ఈ ఏడాది రూ.110007.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందిఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే.. సుమారు రూ. 4102.445 కోట్ల ఎక్కువ. నవంబరు 2022లో 123.088 ఎంటీల లోడింగ్కు వ్యతిరేకంగా నవంబర్ 2023 నెలలో 128.419 ఎంటీల యొక్క ఆరిజినేటింగ్ ఫ్రైట్ లోడింగ్ సాధించబడిందిఇది గత సంవత్సరం కంటే దాదాపు 4.33% ఎక్కువ. సరకు ఆదాయం నవంబర్ 2022లో రూ.13559.83 కోట్లగా ఉండగా నవంబర్ 2023లో ఇది రూ.14077.94 కోట్లకు చేరుకుంది. తద్వారా ఈ ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 3.82శాతం పెరిగింది. భారతీయ రైల్వేలు 65.48 ఎంటీల బొగ్గు,  14.99 ఎంటీల ఐరన్ ఓర్‌, 5.25 ఎంటీలపిగ్ ఐరన్ మరియు ఫినిష్డ్ స్టీల్‌, 5.58 ఎంటీల సిమెంట్‌ (క్లింకర్ మినహా), 4.61 ఎంటీల క్లింకర్‌, 3.82 ఎంటీల ఆహార ధాన్యాలు, 5.9 ఎంటీల ఫెర్టిలైజర్లు, 4.176 ఎంటీల మినరల్ ఆయిల్స్, 6.91 ఎంటీల కంటైనర్లు, 8.59 ఎంటీల ఇతర వస్తువుల రవాణాను నమోదు చేసింది. "హంగ్రీ ఫర్ కార్గో" అనే మంత్రాన్ని అనుసరించి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి అలాగే పోటీ ధరలకు సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి భారతీయ రైల్వే నిరంతర ప్రయత్నాలు చేసింది. చురుకైన పాలసీ మేకింగ్ ద్వారా బ్యాకప్ చేయబడిన కస్టమర్ సెంట్రిక్ విధానం మరియు బిజినెస్ డెవలప్‌మెంట్ యూనిట్ల పని ఈ కీలక విజయాన్ని సాధించడంలో రైల్వేకి సహాయపడింది.

 

***



(Release ID: 1981798) Visitor Counter : 77


Read this release in: English , Urdu , Hindi , Tamil