బొగ్గు మంత్రిత్వ శాఖ
నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం టీఎన్‌ఎస్‌డీసీ & ఎన్‌టీటీఎఫ్‌తో ఎన్‌ఐసీఐఎల్ ఒప్పందం
प्रविष्टि तिथि:
01 DEC 2023 4:10PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే నవరత్న హోదా సంస్థ అయిన ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఐసీఐఎల్), నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం మరో ప్రధాన కార్యక్రమం చేపట్టింది. తమిళనాడు ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన తమిళనాడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో (టీఎన్‌ఎస్‌డీసీ), బెంగళూరులోని నెట్టూర్ టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్‌తో (ఎన్‌టీటీఎఫ్) అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. పరిశ్రమ ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు ఈ సంస్థలు అభ్యర్థులకు శిక్షణ ఇస్తాయి.
టీఎన్‌ఎస్‌డీసీ & ఎన్‌టీటీఎఫ్ సహకారం వల్ల, నైవేలిలో ఉన్న ఎన్‌ఐసీఐఎల్ గని ప్రాంతాల్లోని ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల్లోని 540 మందికి ఉద్యోగ ఆధారిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందుతుంది. పునరావాసం & పునర్నిర్మాణం బడ్జెట్ కింద ఈ ఉచిత వసతి కార్యక్రమం ఉంటుంది. దీనికోసం ఒక్కో అభ్యర్థిపై ఎన్‌ఐసీఐఎల్ రూ. 1.12 లక్షలు ఖర్చు చేస్తుంది. అభ్యర్థులు సాంకేతిక నైపుణ్యం పెరగడానికి, ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడానికి ఈ కార్యక్రమం సాయపడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ప్రభు కిషోర్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికార్లు, ఎన్‌ఎల్‌సీఐఎల్ అధికార్లు ఎంవోయూపై సంతకాలు చేశారు. తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి, ప్రత్యేక కార్యక్రమాల అమలు శాఖ మంత్రి శ్రీ ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
ప్రాజెక్టు అభివృద్ధి కోసం భూములు, ఇళ్లను ఇచ్చిన ప్రజలకు తగిన అవకాశాలను అందించేందుకు ఎన్‌ఎల్‌సీఐఎల్ నిబద్ధతతో ఉంది. ఆ నిబద్ధతలో భాగంగా చేపట్టిన మరో ప్రధాన కార్యక్రమం ఇది.
***
(रिलीज़ आईडी: 1981688)
आगंतुक पटल : 146