పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

సీ జీ డి నెట్‌వర్క్ వేగవంతమైన అభివృద్ధి కోసం 12వ సీ జీ డి బిడ్డింగ్ రౌండ్ కోసం ప్రారంభ రోడ్ షోను పీ ఎన్ జీ ఆర్ బీ నిర్వహించింది.

Posted On: 30 NOV 2023 6:14PM by PIB Hyderabad

సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీ జీ డి) నెట్‌వర్క్ ను దేశం లో 100% కవరేజీ సాధించే దిశగా అభివృద్ధి కోసం  గణనీయమైన పురోగతిలో బాగంగా పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (పీ ఎన్ జీ ఆర్ బీ) 12వ సీ జీ డి బిడ్డింగ్ రౌండ్ కోసం తన మొదటి రోడ్ షోను నిర్వహించింది. ఈ కార్యక్రమం నవంబర్ 30, 2023న న్యూఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్‌లో జరిగింది.

 

ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి చెందిన ముఖ్య వాటాదారుల ప్రతినిధుల సమక్షంలో ఎం ఓ పీ ఎన్ జీ  కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్, మరియు పీ ఎన్ జీ ఆర్ బీ చైర్‌పర్సన్ డాక్టర్ అనిల్ కుమార్ జైన్, బోర్డు సభ్యులు మరియు సెక్రటరీతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

12వ సీ జీ డి బిడ్డింగ్ రౌండ్ ఆరు ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్ యూ టి  8 భౌగోళిక ప్రాంతాలకు కవరేజ్ అందించడం ద్వారా సహజ వాయువు పరిధిని విస్తరించడం దేశం వ్యాప్తంగా 100% కవరేజీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

12వ సీ జీ డి బిడ్డింగ్ రౌండ్ పూర్తయిన తర్వాత, దాదాపు దేశం మొత్తం (దీవులు మినహా) సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పరిధిలోకి వస్తుంది. గృహాలకు పరిశుభ్రమైన వంట ఇంధనం, పారిశ్రామిక మరియు వాణిజ్య సౌకర్యాలు మరియు ఇంధన రవాణాకు ఇంధన సరఫరా మైలురాయి ని సాధించడానికి పీ ఎన్ జీ ఆర్ బీ మద్దతునిస్తుంది.  ఇది గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను సాధించే దిశగా భారీ పురోగతిని సూచిస్తుంది.

 

శ్రీ పంకజ్ జైన్  సీ జీ డి గత 11 రౌండ్లలో చేపట్టిన కార్యక్రమాల ద్వారా పీ ఎన్ జీ ఆర్ బీ సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రశంసించారు. ఈ రాష్ట్రాల్లో పీ ఎన్ జీ యొక్క సామర్థ్యాన్ని కూడా ఆయన హైలైట్ చేశారు. అంతేకాకుండా, శ్రీ పంకజ్ జైన్ ఈ ప్రాంతాలలో సహజ వాయువు సరఫరా లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని నొక్కిచెప్పారు. గ్యాస్ అవస్థాపన మరియు లభ్యత పెంపొందించడంలో ఆవిష్కరణ మరియు పురోగతిలో సాంకేతిక పరిజ్ఞానాల అద్భుతమైన సామర్థ్యాన్ని గుర్తించారు.

 

సభను ఉద్దేశించి డాక్టర్ అనిల్ కుమార్ జైన్, చైర్‌పర్సన్, మాట్లాడుతూ దేశం మొత్తం మీద శక్తివంతమైన మరియు స్థిరమైన గ్యాస్ మౌలిక సదుపాయాల కల్పనలో పీ ఎన్ జీ ఆర్ బీ ప్రస్తుత ప్రత్యేక దృష్టిని స్పష్టంగా వివరించారు. ఈ రాష్ట్రాలు/యూ టీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ బిడ్డింగ్ రౌండ్ ప్రారంభం ఈ ప్రాంతాలలోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థలలో పరిశుభ్రమైన ఇంధనాన్ని అందించడానికి సంస్థ యొక్క వ్యూహాత్మక చర్యను ప్రతిబింబిస్తుంది.  ఆయన మాట్లాడుతూ ఈశాన్య భారతదేశం ప్రధాన భూభాగం మరియు ఆగ్నేయాసియా మధ్య కీలకమైన గొలుసు గా అభిర్ణిస్తూ దాని సామర్థ్యాన్ని హైలైట్ చేశారు. ఈ రాష్ట్రాల్లో సిఎన్‌జికి చాలా సామర్థ్యం ఉందని డాక్టర్ జైన్ పేర్కొన్నారు.

 

కార్యక్రమంలో విశిష్ట వక్తలుగా శ్రీ అనీష్ డే (పార్టనర్ మరియు గ్లోబల్ హెడ్), కే పీ ఎం జీ, శ్రీ సుఖ్మల్ జైన్, డైరెక్టర్ (మార్కెటింగ్), బీ పీ సీ ఎల్  మరియు శ్రీ జినాల్ మెహతా, డైరెక్టర్, టోరెంట్ గ్యాస్ పాల్గొన్నారు, శ్రీమతి వందనా శర్మ, పీ ఎన్ జీ ఆర్ బీ సెక్రటరీ, సీ జీ డి రంగంలో  ప్రస్తుత స్థితి మరియు అవకాశాలపై వివరణాత్మక ప్రదర్శనను అందించారు, 9 నుండి 11వ సీ జీ డి బిడ్డింగ్ రౌండ్‌ల విజయగాథను ప్రదర్శిస్తూ మరియు 12వ సీ జీ డి బిడ్డింగ్ రౌండ్‌కు సంబంధించిన ముఖ్యమైన టైమ్‌లైన్‌లను వివరిస్తారు.

 

అక్టోబర్ 13, 2023 నుండి ఎలక్ట్రానిక్ బిడ్‌లు ఆహ్వానించబడ్డాయి,  12వ సీ జీ డి బిడ్డింగ్ రౌండ్‌లో జనవరి 11, 2024, 7 జీ ఏ ల బిడ్‌లను సమర్పించడానికి చివరి తేదీ మరియు ఫిబ్రవరి 23, 2024 మిజోరాం జీ ఏ కోసం బిడ్‌లను సమర్పించడానికి చివరి తేదీ. పీ ఎన్ జీ ఆర్ బీ ఫిబ్రవరి/మార్చి 2024 నాటికి అవార్డును ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

***



(Release ID: 1981375) Visitor Counter : 61


Read this release in: Urdu , English , Hindi