జల శక్తి మంత్రిత్వ శాఖ
‘జల్ ఇతిహాస్ ఉత్సవ్’ నిర్వహించనున్న జలశక్తి మంత్రిత్వ శాఖ
- ఢిల్లీలోని మెహ్రౌలీలో షమ్సీ తలాబ్- జహాజ్ మహల్ వద్ద నిర్వహణ
Posted On:
30 NOV 2023 5:29PM by PIB Hyderabad
జాతీయ జల్ మిషన్, జలవనరుల శాఖ నదుల అభివృద్ధి విభాగం మరియు జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన గంగా పునరుజ్జీవన శాఖ శుక్రవారం (డిసెంబర్ 1న, 2023) ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉన్న షమ్సీ తలాబ్- జహాజ్ మహల్లో 'జల్ ఇతిహాస్ ఉత్సవ్'ను నిర్వహించనుంది. నీటి వారసత్వ ప్రదేశాలను సంరక్షించడం, ప్రజలలో యాజమాన్య భావనను సృష్టించడంతోపాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు అటువంటి వారసత్వ కట్టడాలను పునరుద్ధరించడం గురించి ప్రజల్లో చైతన్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చపెందిన వివిధ శాఖల సీనియర్ అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ భారీ కార్యక్రమం దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 15 నవంబర్, 2023 నుండి 30 నవంబర్, 2023 వరకు నిర్వహించిన “వాటర్ హెరిటేజ్ పక్షం” ముగింపును సూచిస్తుంది. 75 'సహజ నీటి వారసత్వ నిర్మాణాల' వద్ద మరియు ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్’ 2023 దేశవ్యాప్త ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేయడాన్ని కూడా సూచిస్తుంది. ఈ ఈవెంట్ యొక్క ఉద్దేశ్యం సామాజిక అనుసంధానత నిమిత్తం ప్రతిష్టాత్మకమైన ప్రదేశాలుగా నీటి వనరుల కేంద్రీకరణను హైలైట్ చేయడం. మెహ్రౌలీలోని షమ్సీ తలాబ్, జహాజ్ మహల్ పునరుద్ధరణ పనులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వివిధ శాఖల కలయికను ప్రతిబింబిస్తాయి. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఎంసీడీ సహాయంతో తలాబ్ను శుభ్రపరచడం మరియు పార్క్ని లెవలింగ్/క్లీనింగ్ చేయడం మొదలైనవి చేపట్టారు. ఈవెంట్ సందర్భంగా ప్రారంభించబడే ఇ-బుక్ రూపంలో అదే డాక్యుమెంట్ చేయబడింది. ఇంకా, గుర్తించబడిన 75 వాటర్ హెరిటేజ్ ప్రదేశాలను ప్రదర్శించేలా "జల్ ఇతిహాస్ జర్నీ"పై ఒక చిన్న వీడియో ఈవెంట్ సమయంలో ప్రదర్శించబడుతుంది. అలాగే, ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు శ్రీమతి సునీతా భుయాన్ చేత "ఫ్లోవింగ్ స్ట్రింగ్స్" అనే సంగీత కార్యక్రమం నిర్వహించబడుతుంది. దేశం యొక్క వారసత్వ నీటి నిర్మాణాలను పరిరక్షించడానికి, ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశవ్యాప్తంగా 75 'నేచురల్ వాటర్ హెరిటేజ్ నిర్మాణాలను' గుర్తించడానికి ఎన్ఎంసీడీ మాజీ డీజీ శ్రీ ఆర్. ఆర్. మిశ్రా అధ్యక్షతన ఒక కమిటీని జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. భారతదేశం- డబ్ల్యుఆర్ఐఎస్ పోర్టల్లోని జల్ ఇతిహాస్ సబ్ పోర్టల్లో (https://indiawris.gov.in/ wris/#/jalitihaas) ప్రదర్శించబడిన 75 నీటి వారసత్వ నిర్మాణాలను కమిటీ ఎంపిక చేసింది. జల్ శక్తి మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్’ 2023 (జేఎస్ఏ: సీటీఆర్-2023)ని “తాగునీటికి మూలాధారం” అనే థీమ్తో దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేసింది. జేఎస్ఏ: సీటీఆర్ అటువంటి ప్రచారాల శ్రేణిలో నాలుగోది, ప్రతి ఒక్కరినీ వర్షాల కోసం సన్నద్ధం చేయడంలో పాల్గొనడం, తద్వారా మనం సాధ్యమైనంత ఎక్కువ వర్షపు నీటిని నిల్వ చేయవచ్చు. యు ఉపయోగించుకోవచ్చు. మన భూగర్భ జలాల నిల్వలను తిరిగి నింపుకోవచ్చు. జేఎస్ఏ: సీటీఆర్ ఈ సంవత్సరం 04.03.2023 నుండి 30.11.2023 వరకు అమలు చేయబడింది. జల్ జీవన్ మిషన్ ద్వారా గుర్తించబడిన 150 నీటి ఎద్దడి గల జిల్లాల్లో తాగునీటి వనరులను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. భారతదేశంలో నదులతో సహా నీటి వనరుల పట్ల గౌరవప్రదమైన సంప్రదాయం ఉంది. భారతదేశ నీటి వనరులు అపారమైన మరియు పెరుగుతున్న ఒత్తిడిలో ఉన్నాయి. ఈ పరిస్థితులలో, పౌరులందరూ నీటి విషయంలో మరియు నీటికి సంబంధించిన సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించాలి. ఈ సందర్భంలో మన సుసంపన్నమైన సాంప్రదాయ నీటి వ్యవస్థలు ప్రస్తుత కాలానికి అనేక పాఠాలను కలిగి ఉన్నాయి. ఈ పాఠాలను హైలైట్ చేయడానికి మరియు నీటి వనరులతో కమ్యూనిటీకి కనెక్ట్ అయ్యేలా ప్రోత్సహించడానికి ఈ ఈవెంట్ ఉద్దేశించబడింది.
***
(Release ID: 1981374)
Visitor Counter : 94