రక్షణ మంత్రిత్వ శాఖ
భారతదేశం నికర రక్షణ ఎగుమతిదారుగా మారేందుకు నాణ్యమైన తయారీ సంస్కృతిని సృష్టించాలిః డిఆర్‌డిఒ నాణ్యతా సదస్సులో భారతీయ రక్షణ తయారీదారులకు రక్షణ మంత్రి సూచన
అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేందుకు నాణ్యమైన ఉత్పత్తులు ముందస్తు అవసరం
భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కొనేందుకు సైనిక దళాలకు అత్యున్నత నాణ్యత, విశ్వసనీయత, సురక్షితమైన సైనిక వ్యవస్థలు అవసరమన్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
29 NOV 2023 2:42PM by PIB Hyderabad
భారత రక్షణ ఉత్పత్తి సంస్థలు, తయారీదారులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేందుకు అత్యవసరమైన నాణ్యత అనే సంస్కృతిని పెంపొందించుకోవాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపిచ్చారు. రక్షణ ఉత్పత్తులలో స్వావలంబనకు నాణ్యతా ప్రయాణం (క్వాలిటీ ఒడిస్సీ ఫర్ సెల్ఫ్ రిలయెన్స్ ఇన డిఫెన్స్ ప్రాడక్ట్స్ఆ) అన్న ఇతివృత్తంపై 29 నవంబర్ 2023న జరిగిన డిర్‌డిఒ క్వాలిటీ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే అంతర్జాతీయ డిమాండ్‌ను సృష్టించగలవని, ఇది నికర రక్షణ ఎగుమతిదారుగా, అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా భారత్‌ను తయారు చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనికతను సాకారం చేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు.
నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి, ప్రపంచ నలుమూలల్లోని దేశాలకు తమ పరికరాలను ఎగుమతి చేసే దేశాలను రక్షణ మంత్రి పట్టి చూపారు. మంచి నాణ్యత కారణంగా, ఈ సంస్థల ఉత్పత్తులు కూడా ఖరీదు ఎక్కువగా ఉంటాయని; అత్యాధునిక ఉత్పత్తుల కోసం అత్యంత ఎక్కువ ధరలను చెల్లించేందుకు దిగుమతి చేసుకునే దేశాలు సిద్ధంగా ఉంటాయని ఆయన అన్నారు.
నాణ్యమైన ఉత్పత్తులు దేశీయ రక్షణ పరిశ్రమకు విశ్వసనీయతను తీసుకువస్తాయంటూ, అటువంటి పరికరాలను దేశంలోనే తయారుచేయడం, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడానికి దారి తీయడమే కాక అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ కీర్తిని పెంచుతుందని పేర్కొన్నారు. నాణ్యమైన రక్షణ ఉత్పత్తులను తయారు చేసేటప్పుడు ఖర్చు నియంత్రణ ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
వ్యయ నియంత్రణకు అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వాలి, అయితే నాణ్యతను పణంగా పెట్టి ఆ పని చేయకూడదు. మనం అంతర్జాతీయ వ్యయంలో పోటీగా ఉండాలి, కానీ మనం నాణ్యత రంగంలో అగ్రాన ఉంటూనే చెయ్యాలన్నారు. ఈ భావనతో మనం పురోగమించాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. విశ్వసనీయమైన, సురక్షితమైన, సమర్ధవంతమైన అత్యున్నత నాణ్యత కలిగిన సైనిక వ్యవస్థలను తయారు చేయడం ద్వారా, సైనిక దళాలు తమ మిషన్లను విజయవంతంగా పూర్తి చేసేందుకు వారికి తోడ్పాటునందించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
అర్హత పొందిన పరిశ్రమల ప్రతినిధులకు సిస్టమ్ ఫర్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ అసెస్‌మెంట్ అండ్ ర్యాంకింగ్ (SAMAR - ఆధునిక ఉత్పాదకత అంచనా, ర్యాంకింగ్ వ్యవస్థ) సర్ఠిఫికెట్లను రక్షణ మంత్రి ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రక్షణ రంగం ఆర్&డి విభాగం కార్యదర్శి, డిఆర్‌డిఒ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ, నాణ్యమైన వ్యవస్థలను సరఫరా చేసేందుకు డిఆర్‌డిఒ అంకిత భావాన్ని పునరుద్ఘాటించారు. దేశీయ సైనిక వ్యవస్థలను అత్యంత నాణ్యతతో తయారు చేయడం ద్వారా స్వావలంబన దిశగా మొగ్గు చూపేందుకు దృఢసంకల్పాన్ని కలిగి ఉండవలసిందిగా ఆయన భాగస్వాములందరినీ ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ జక్సయ్ షా కూడా హాజరయ్యారు.
ఈ సదస్సుకు డిఆర్‌డిఒ డైరెక్టర్ జనరళ్ళు, డైరెక్టర్లు, డిఆర్‌డిఒ ప్రయోగశాలల క్వాలిటీ అధిపతులు, పరిశ్రమల నిపుణులు, ఇతర భాగస్వాములు హాజరయ్యారు. ఇది రక్షణ రంగంలోని కీలక వాటాదారులకు వారి దృక్పధాలను పంచుకునేందుకు, స్వావలంబన, ఎగుమతులు అన్న ద్వంద్వ లక్ష్యాన్ని సాధించేందుకు ఒక సామాన్య వేదికను అందించింది.
సదస్సులో రెండు సెషన్లను నిర్వహించారు, అవి - రక్షణ రంగంలో స్వావలంబనను & నాణ్యతా సంస్కృతిని మెరుగుపరచడం, రక్షణ & ఎయిరోస్సేస్ నాణ్యతా హామీ. పరిశ్రమల నుంచి, ప్రభుత్వ నాణ్యతా హామీ ఏజెన్సీలు, యూజర్ సేవల నిపుణులు ఈ సెషన్ల సందర్భంగా తమ ఆలోచనలను పంచుకున్నారు.
అధిక నాణ్యత గల స్వదేశీ వ్యవస్థలను ఉత్పత్తి చేయడం, ప్రమాణాలు, విధానాలు, ప్రపంచ ఉత్తమ కార్యాచరణల అమలు కోసం దేశంలో పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి నిపుణులతో నెట్‌వర్క్‌కు వాటాదారులకు ఈ సమావేశం అవకాశం కల్పించింది. ఆత్మనిర్భర్ భారత్ కోసం భారత్‌లో రక్షణ ఉత్పత్తి విప్లవానికి సంబంధించిన వివిధ నాణ్యతాపరమైన అంశాలపై భాగస్వాములు మేధోమథనం చేశారు.
***
(Release ID: 1980805)
Visitor Counter : 85