గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జన్ జాతీయ గౌరవ్ దివస్ వారం రోజుల వేడుకల సందర్భంగా న్యూ ఢిల్లీలోని ఎన్ టి ఆర్ఐలో ఆది-వ్యాఖ్యన్ కార్యక్రమం ప్రారంభించిన శ్రీ అర్జున్ మందా


గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి చొరవలకు జన్ జాతీయ గౌరవ్ దివస్ కొత్త ఊపు ఇచ్చింది : అర్జున్ ముందా

Posted On: 22 NOV 2023 7:20PM by PIB Hyderabad

జాన్ జాతీయ గౌరవ్  దివస్  వారం రోజుల  వేడుకలను పురస్కరించుకుని జాతీయ  గిరిజన  పరిశోధన  సంస్థ (ఎన్ టిఆర్ఐ) ఆది-వ్యాఖ్యన్  సదస్సును నిర్వహించింది.  ఎన్ టిఆర్ఐ  ప్రాంగణంలో నిర్వహించిన ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజన మేథావులు, రచయితలు, నాయకులు పాల్గొన్నారు. 

జాతీయ  గిరిజన  పరిశోధన  సంస్థ (ఎన్ టిఆర్ఐ) ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్  ముందా ఆది-వ్యాఖ్యాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజన పద్మ అవార్డీలు  శ్రీమతి ఉషా బార్లే జీ (పండ్వానీ గాయని) , పద్మశ్రీ ప్రొఫెసర్ జనుమ్ సింగ్ సోయ్, జార్ఖండ్ (భాషా సంరక్షకురాలు-హో), కీలకమైన గిరిజన విజేతలను ఈ కార్యక్రమంలో సత్కరించారు.    

ప్రధానమంత్రి దార్శనికతతోనే గిరిజనుల ఆత్మ గౌరవానికి చిహ్నంగా నవంబర్ 15వ తేదీన జన్ జాతీయ గౌరవ దివస్  నిర్వహించుకుంటున్నామని ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి  శ్రీ అన్నారు. ఇది   గిరిజన సమస్యలకు కొత్త ఉత్తేజం ఇచ్చిన చారిత్రక సందర్భం. ఇది దేశంలో గిరిజన ప్రజల విధికి కొత్త దిశ కల్పిస్తుంది. గిరిజనుల విషయంలో  నవంబర్ 15 ఎల్లప్పుడూ కీలకమైన రోజు అయినప్పటికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి కొత్త ఉత్తేజం ఏర్పడిందని మంత్రి అన్నారు. 

నేడు నిర్వహిస్తున్న ఆది-వ్యాఖ్యాన్ కార్యక్రమం గిరిజనుల జీవితం, సంస్కృతి, భాష, జీవన శైలి వంటి భిన్న కోణాలను గిరిజన మేథావులు, నాయకులు, రచయితల దృష్టి నుంచి ఆవిష్కరిస్తుందని శ్రీ అర్జున్ ముందా అన్నారు. ఒక విధంగా ఇది ఒక అవకాశం అయితే  సవాళ్ళని చర్చించుకుంటూ ముందు నడవాల్సిన దారిని నిర్ణయించడం మరో కోణమని తెలిపారు.

గిరిజన భాషల గురించి మాట్లాడుతూ నూతన విద్యా విధానం రూపొందించినప్పుడు గిరిజన భాషలు, మాండలికాలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుందని నొక్కి చెప్పినట్టు తెలిపారు. ఆ రకంగా నూతన విద్యా విధానం గిరిజన భాషల సంరక్షణ, ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.  

ఇటీవల కాలంలో గిరిజన ప్రజల కోసం అత్యంత కీలకమైన చొరవలు తీసుకోవడం జరిగిందని శ్రీ అర్జున్  ముందా అన్నారు. రూ.24,000 కోట్ల పివిజిటి మిషన్, ఆది ఆదర్శ్  గ్రామ్  యోజన, సికెల్  సెల్ మిషన్, 740 ఏకలవ్య మోడల్ పాఠశాలల ఏర్పాటు వాటిలో కొన్ని అని చెప్పారు. అత్యున్నత స్థాయి సంస్థ అయిన జాతీయ గిరిజన పరిశోధన సంస్థ  క్షేత్ర స్థాయి పరిశోధన ద్వారా ఈ నిర్ణయానికి కొత్త ఉత్తేజం ఇస్తుందని ఆయన తెలిపారు. అంతే  కాకుండా వివిధ రాష్ట్రాల్లోని 27 గిరిజన పరిశోధన సంస్థల పనితీరుకు ఒక సమగ్ర వైఖరిని అందిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొంటున్న ప్రతినిధులు భగవాన్ బిర్సా ముందా పట్ల, అయన చేసిన త్యాగాల పట్ల గర్వపడుతూ  గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాల ప్రయోజనం  చివరి వ్యక్తికి అందేలా చూస్తారన్న విశ్వాసం మంత్రి ప్రకటించారు. మంత్రి శ్రీ అర్జున్ ముందా గిరిజన స్టాల్స్ ను సందర్శించి గిరిజన కళాకారులతో సంభాషించి వారు ప్రదర్శించిన వస్తువుల పట్ల ఆసక్తి ప్రదర్శించారు.

గిరిజన తెగల విశిష్టతలు, వారి చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, కళలఫై అధ్యయనం చేయడంలో ఎన్ టిఆర్ఐ  కృషిని సురేంద్ర నాథ్ త్రిపాఠి (డైరెక్టర్ జనరల్, ఐఐపిఎ) వివరించారు.

గిరిజన వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్ జయ జాతీయ గిరిజన పరిశోధన సంస్థ (ఎన్ టిఆర్ఐ), రాష్ట్ర టిఆర్ఐల పాత్ర గురించి వివరించారు. గిరిజన కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహించడంలో ఎన్ టిఆర్ఐ చొరవల గురించి, గిరిజన ప్రతిభను వెలుగులోకి తేవడంలో  ఆది వ్యాఖ్యాన్ కృషిని  ఆమె ప్రస్తావించారు.   

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అనిల్  కుమార్ ఝా;  ఎంఓటిఎ ఒఎస్ డి శ్రీ విభు నాయర్;  ఎంఓటిఎ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్ జయ; ఎన్ఇఎస్ టి కమిషనర్ శ్రీ అజిత్ గోపాల్. సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన కళాకారులు తమ సజీవ ప్రదర్శనల ద్వారా సభికులను అలరించారు.

 

***


(Release ID: 1980619) Visitor Counter : 83


Read this release in: English , Urdu , Hindi , Punjabi