మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
మంగళవారం ముంబైలో ప్రారంభమైన హిందూ మహాసముద్రం ట్యూనా కమిషన్ డేటా సేకరణ, గణాంకాలపై 19వ వర్కింగ్ పార్టీ
2018లో 41 బిలియన్ల వాణిజ్య అంచనా వార్షిక విలువలకు మాత్రమే దోహదం చేస్తున్న ట్యూనా
Posted On:
28 NOV 2023 3:15PM by PIB Hyderabad
ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ (ఐఒటిసి _ హిందూ మహాసముద్ర ట్యూనా కమిషన్) డాటా సేకరణ & గణాంకాలు (డబ్ల్యుపిడిసిఎస్19)పై 19 వర్కింగ్ పార్టీని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక & పాడడి శాఖ, మత్స్య విభాగం 28 నవంబర్ నుంచి 2 డిసెంబర్ 2023వరకు నిర్వహిస్తోంది. సమావేశాన్ని మంగళవారం మహారాష్ట్ర, ముంబైలోని హోటల్ సెయింట్ రెగీస్‌లో ప్రారంభమైంది.
ఐఒటిసి నిర్వహిస్తున్న ముఖ్యమైన సమావే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్యూనా మత్స్య శాఖ రంగంలో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, నిపుణులను ఒకచోట చేరుస్తుంది. దీనికి కేంద్ర మత్స్య విభాగం ఆతిథ్యమిస్తోంది. కేంద్ర మత్య్స విభాగం సంయుక్త కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్, మహారాష్ట్ర మత్స్యవిభాగం కమిషనర్ శ్రీ అతుల్ పాట్నే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ట్యూనాలు, బిల్‌ఫిష్‌లు, సొరచేపలు, రేలు వంటి భారీ సముద్ర జీవులకు అత్యంత ఆర్ధిక ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాక ఇందులో ట్యూనాలు ఒక్కటే యుఎస్ 41 బిలియన్ డాలర్లు (2018లో) వార్షిక వాణిజ్య విలువను కలిగి ఉంటాయని అంచనా. ఈ జాతుల అంతర్జాతీయ పరిధికి బహుళజాతి చేపల పెంపకం ద్వారా మితిమీరి చేపలు పట్టే అవకాశం ఉన్నందున మెరుగైన నిర్వహణ, పరిరక్షణలో సహకార యత్నాలు అవసరం.
సమావేశంలో ఇండొనేషియా, ఫ్రాన్స్, స్పెయిన్, ఐరోపా యూనియన్ (ఇయు) కు చెందిన ఇతర దేశాలు, సీషెల్స్, టాంజేనియా, ఇరాన్, థాయ్‌లాండ్, జపాన్, శ్రీలంక, ఒమన్, భారత్ కు చెందిన భాగస్వాములు స్వయంగా పాల్గొన్నారు. ఇతర దేశాల నుంచి పలువురు భాగస్వాములే కాకుండా, ఐఒటిసి, శాస్త్రీయ సంస్థలు కూడా దృశ్యమాధ్యమం ద్వారా సమావేశానికి హాజరవుతున్నారు.
వివిధ దేశాలు అనుసరిస్తున్న డేటా సేకరణ, సంకలనం చేయడం వంటి వాటిలో అనుసరిస్తున్న ప్రస్తుత శాస్త్రీయ పద్ధతులను, వనరుల అంచనాల కోసం ఐఒటిసికి నివేదించడం శాస్త్రవేత్తలు విశ్లేషించి, మేధో మథనం చేసి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో డాటా సేకరణ, గణాంకాల కోసం ఆధునిక, సరళీకరించిన పద్ధతులను రూపొందిస్తారు. ఈ సమావేశానంతరం ఐఒటిసి ప్రధాన శాస్త్రీయ సమావేశంలో అక్కడే 4-8 డిసెంబర్, 2023వరకు నిర్వహిస్తారు. ఇది మహాసముద్రంలో ట్యూనా, ట్యూనావంటి జాతుల స్థిరమైన నిర్వహణకు సంబంధించిన శాస్త్రీయ సిఫార్సుల కోసం డబ్లుపిడిసిఎస్, అనేక ఇతర వర్కింగ్ పార్టీల సిఫార్సులను పరిశీలిస్తుంది.
***
(Release ID: 1980618)
Visitor Counter : 87