సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav
iffi banner

'హాఫ్‌మన్స్ ఫెయిరీ టేల్స్' గృహ హింసతో నిండిన ప్రపంచంలో ఆశను చిగురింపజేసే ప్రయత్నం: టీనా బర్కలయా


54వ ఇఫీ లో గోల్డెన్ పీకాక్ కోసం పోటీ పడుతున్న రష్యన్ చిత్రం 'హాఫ్‌మాన్స్ ఫెయిరీ టేల్స్'

గోవా: హాఫ్‌మన్స్ ఫెయిరీ టేల్స్, టీనా బర్కలయా దర్శకత్వం వహించి, స్క్రిప్ట్ అందించిన రష్యన్ చలనచిత్రం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత రష్యాలో అల్లకల్లోలంగా ఉన్న సమయంలో, ఒక అమ్మాయి నదేజ్దా జీవితాన్ని వర్ణిస్తుంది. గోవాలో జరుగుతున్న 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డు కోసం ఈ చిత్రం పోటీపడుతోంది.

తన భర్త, వేధింపులకు గురిచేయడంతో రెండు చేతులు నరికివేయబడిన రష్యన్ మహిళ - మార్గరీటా గ్రాచెవాపై జరిగిన క్రూరమైన దాడి ఘటనను ఈ చిత్రంలో టీనా బర్కలయా 21వ శతాబ్దంలో కూడా భారతదేశం, జార్జియా లేదా రష్యా ఇలా ప్రతి దేశంలో గృహ హింస ప్రబలంగా ఉందని ఎత్తిచూపారు. "ఈ కథ ఒక అద్భుత కథగా ఉండాలని నేను కోరుకున్నాను. అద్భుత కథలు ఎల్లప్పుడూ సంతోషకరమైన ముగింపులను కలిగి ఉంటాయి" అని ఆమె చెప్పింది. చిత్రం ఆలోచన, లక్ష్యంపై మాట్లాడుతూ, గృహ హింసతో నిండిన ప్రపంచంలో, తన చిత్రం ఆశను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని టీనా బర్కలయా అన్నారు. “ఈ చిత్రంలో కథానాయిక పేరు నదేజ్దా,  రష్యన్ భాషలో ఈ పదానికి ‘ఆశ’ అని అర్ధం కావడం యాదృచ్చికం కాదు. ఈ చిత్రంలో, కథానాయిక లైబ్రేరియన్ కస్టమర్‌లకు ఇచ్చే ప్రతి పుస్తకంలో ఎల్లప్పుడూ బుక్‌మార్క్‌ను ఉంచుతుంది. బుక్‌మార్క్ శీర్షిక కూడా- 'ఆశను తిరిగి పొందండి అని ఉంటుంది”, అని ఆమె అన్నారు. 

ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా మారడంపై టీనా బర్కలయా మాట్లాడుతూ, షార్ట్ ఫిల్మ్‌లు, మ్యూజికల్ వీడియోలలో తన అనుభవం ఫీచర్ ఫిల్మ్ నిర్మాణంలో త్వరగా, సమర్థవంతంగా ఎలా పని చేయాలో నేర్పిందని అన్నారు. “నాకు విజువల్ అంశం చాలా ముఖ్యం. అడ్వర్టైజింగ్‌లో నా పని కూడా నాకు సహాయపడింది. సినిమా ఎంబ్రాయిడరీ లాంటిదని నేను నమ్ముతాను” అని ఆమె అన్నారు. సినిమాల్లో సంగీతం,  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ముఖ్యమైనది, అయినప్పటికీ, కొన్నిసార్లు నిశ్శబ్దం మరింత ప్రభావవంతంగా ఉంటుంది అని ఆమె తెలిపారు.

 

సారాంశం:
 

2000వ దశకం ప్రారంభంలో, సోవియట్ శకం పాశ్చాత్యీకరించబడిన అనుకరణగా మారడంతో, ఈ చిత్రం నదేజ్డా అనే పిరికి మహిళ విటాలీతో వివాహ బంధంలో చిక్కుకుంటుంది.  ఆమెను అపార్ట్‌మెంట్ కోసం వేధిస్తుంటాడు. నదేజ్డా, రెండు ఉద్యోగాలు చేస్తూ, కోటు లు తయారుచేసే యజమాని తన అందమైన, వ్యక్తీకరణ చేతులను గుర్తించినప్పుడు రూపాంతరం చెందుతుంది. ఆమె తన జీవితాన్ని నాటకీయంగా పునర్నిర్మించుకుంటూ, మోడల్‌గా మారుతుంది.

 

 

 

* * *

iffi reel

(Release ID: 1979879)
Read this release in: English , Urdu , Marathi , Hindi