విద్యుత్తు మంత్రిత్వ శాఖ
'ది ఎకనామిక్ టైమ్స్ హెచ్‌ఆర్ వరల్డ్ ఎక్సెప్షనల్ ఎంప్లాయీ ఎక్స్‌పీరియన్స్ అవార్డ్ 2023' గెలుచుకున్న ఎన్‌హెచ్‌పీసీ
प्रविष्टि तिथि:
24 NOV 2023 6:39PM by PIB Hyderabad
ప్రతిష్టాత్మకమైన 'ది ఎకనామిక్ టైమ్స్ హెచ్‌ఆర్ వరల్డ్ ఎక్సెప్షనల్ ఎంప్లాయీ ఎక్స్‌పీరియన్స్ అవార్డ్ 2023'ను (ఈటీ హెచ్‌ఆర్ వరల్డ్ ఎక్స్ అవార్డులు) 'లార్జ్ స్కేల్ ఎంటర్‌ప్రైజ్’ విభాగంలో ఎన్‌హెచ్‌పీసీ గెలుచుకుంది. 22 నవంబర్ 2023న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఎన్‌హెచ్‌పీసీకి అందించారు.
సంస్థ ఉద్యోగులకు మాత్రమే పరిమితం కాకుండా, వారి కుటుంబాలకు కూడా విస్తృత శ్రేణి ఉద్యోగుల-కేంద్రీకృత హెచ్‌ఆర్ కార్యక్రమాలను వర్తింపజేయడానికి వచ్చిన గుర్తింపు ఈ పురస్కారం. కఠినమైన భౌగోళిక ప్రాంతాలు, వాతావరణ సవాళ్ల మధ్య పని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలబడడమే కాకుండా, పదవి విరమణ తర్వాత కూడా సంరక్షణ, మద్దతును ఈ హెచ్‌ఆర్ కార్యక్రమాలు అందిస్తాయి.

తీవ్రమైన పోటీ వ్యాపార వాతావరణంలో ఎన్‌హెచ్‌పీసీ రాణిస్తోంది. విశ్వసనీయత & అనుబంధంతో కలగలిసిన ఉద్యోగుల అనుభవం, బలమైన ఉద్యోగి-కేంద్రీకృత విభాగాలు, ఉద్యోగులు & వారి కుటుంబ సభ్యుల కోసం బహు ముఖ పారితోషిక పథకాలు, సమాన అవకాశాలు అందేలా చూడడానికి వైవిధ్యం & సమీకృత కార్యక్రమాలు, నైపుణ్యాల పెంపు, అభ్యాసం & అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఎన్‌హెచ్‌పీసీ ఈ ఘనతను సాధించింది.
***
(रिलीज़ आईडी: 1979871)
आगंतुक पटल : 103