సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
0 4

గోవాలో, ఇఫ్ఫి 54లో విజయ్ సేతుపతి, కుష్బు సుందర్‌తో ముఖాముఖి


నటనకు ప్రత్యేక సూత్రమంటూ ఏదీ ఉండదు: నటుడు విజయ్ సేతుపతి

గోవాలోని కళ అకాడమీలో జరుగుతున్న 54వ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' (ఇఫ్ఫి) వేడుకల్లో భాగంగా, ప్రముఖ నటీనటులు విజయ్ సేతుపతి, కుష్బూ సుందర్‌ ఒక ముఖాముఖి కార్యక్రమంలో ('ఇన్-కానర్వేషన్') పాల్గొన్నారు. వారి సినీ ప్రయాణంలోని అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని నైపుణ్యం ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. 50కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన మొదటి సినిమా 'సీను రామసామీస్‌ తెన్మెర్కు పరువుకాట్రు' మూడు జాతీయ పురస్కారాలు గెలుచుకుంది.

తన నటనా కౌశలం, సినీ ప్రయాణం గురించి మాట్లాడిన విజయ్ సేతుపతి "నాకు తెలియదని నాకు తెలుసు" అని అన్నారు. ఎంచుకున్న పాత్రల కోసం తన సన్నద్ధత గురించి వివరిస్తూ, చలనచిత్ర ప్రముఖులతో చర్చలు, వాదనల నుంచి నేర్చుకుంటానని వెల్లడించారు.

వివిధ పాత్రల ద్వారా తనకు వచ్చిన గుర్తింపు గురించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ప్రేక్షకులు సినిమాలోని నటుడి కంటే కథ, పాత్రలకే ఆకర్షితులవుతున్నారని విజయ్‌ సేతుపతి చెప్పారు. నటన గురించి మాట్లాడుతూ, మనస్సుకు స్వేచ్ఛ ఇవ్వాలని అన్నారు. నటనకు ఒక సూత్రమంటూ అంటూ ఏమీ ఉండదని, ఆ పాత్రలో జీవించడం ద్వారా పూర్తిగా లీనమైపోవాలని వివరించారు.

తనకు జాతీయ పురస్కారం తెచ్చిపెట్టిన 'సూపర్ డీలక్స్' చిత్రంలో తాను పోషించిన లింగమార్పిడి పాత్రను వివరిస్తూ, లింగమార్పిడి వ్యక్తులు నిజ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఎలుగెత్తి చాటడానికి మిస్టర్ సేతుపతి ప్రయత్నించాడని చెప్పారు.

నేర్చుకోవాలన్న తపన, స్ఫూర్తిని సజీవంగా కొనసాగించాల్సిన అవసరాన్ని సేతుపతి స్పష్టం చేశారు.

విలన్ పాత్రలు ఎందుకు చేస్తున్నారని అడిగితే, మిస్టర్ సేతుపతి నిర్దిష్ట పాత్రలకే పరిమితం కాకూడదన్న తన కోరికను వ్యక్తం చేశారు. కథను బట్టి వివిధ రకాల పాత్రల్లో నటించాల్సిన ప్రాముఖ్యతను అతను వివరించారు.

ఇఫ్ఫిలో 'ఇన్-కానర్వేషన్', 'మాస్టర్ క్లాస్' కార్యక్రమాలను సత్యజిత్ రే ఫిల్మ్ & టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ) నిర్వహించింది.

 

* * *

iffi reel

(Release ID: 1979368) Visitor Counter : 107