సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
యే వతన్ మేరే వతన్ః వీరత్వానికి చలనచిత్ర నీరాజనం
యే వతన్ మేరే వతన్ః నేటి ప్రేక్షకులకు నిమగ్నమయ్యే సినిమా అనుభవాన్ని సృష్టించేందుకు చరిత్ర నుంచి స్ఫూర్తిని పొందడం
మీ హృదయం సరైన చోట ఉంటే, ప్రతీదీ ఎంతో అద్భుతంగా ప్రవహిస్తుందిః డైరెక్టర్ కన్నన్ అయ్యర్
వాస్తవ సంఘటనల స్ఫూర్తితో గుదిగుచ్చిన ఉద్వేగపూరితమైన కథనం యే వతన్ః కరణ్ జోహార్
అపారమైన సినిమా అనుభవాన్ని పొందేందుకు చరిత్ర నుంచి స్ఫూర్తిని పొందే కళపై యే వతన్ మేరే వతన్ నిర్మాతలు గోవాలో జరిగిన 54వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో మనోరంజకమైన చర్చలో లోతుగా పరిశీలించారు. ఈ ప్యానెల్ చిత్ర దర్శకుడు కన్నన్ అయ్యర్, నిర్మాత కరణ్ జోహార్, కథానాయకి సారా ఆలీ ఖాన్, ప్రైమ్ వీడియో హెడ్ ఆఫ్ ఒరిజినల్స్ (భారత్ & ఆగ్నేయ ఆసియా) అధిపతి అపర్ణ పురోహిత్, ధర్మ ప్రొడక్షన్స్ సిఇఒ అపూర్వా మెహతా ఉన్నారు. ఈ చర్చకు ప్రైమ్ వీడియో ఇండియా సహకారంతో రోహిణీ రామనాథన్ నిర్వహించారు.
ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోధురాలు ఉషా మెహెతా (25 మార్చి 1920- 11 ఆగస్టు 2000) క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రేడియో ప్రసారాలను నిర్వహించిన పాత్రకు ప్రసిద్ధురాలయ్యారు. న్యాయం కోసం నిబద్ధత, గాంధేయవాదిగా ఆమె ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఆమెను స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా చేస్తుంది. వలస పాలన నుంచి స్వేచ్ఛను పొందేందుకు ఆమె చేసిన వీరోచిత కృషిని గుర్తిస్తూ భారత రత్న 1998లో ఆమెకు దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను ఇచ్చి సత్కరించింది. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఈ అసాధారణ మహిళ కథకు ఈ చిత్రం జీవం పోసింది.
సెషన్‌లో కిక్కిరిసిన ప్రేక్షకులతో మాట్లాడుతూ, సినిమా నిర్మాతలు సినిమా వెనుక ఉన్నవారి దృక్కోణాలను, స్ఫూర్తిని పంచుకున్నారు. సినిమా తీసేందుకు స్ఫూర్తిని, కల్పనను గురించి వారితో పంచుకుంటూ, మీ హృదయం ఉండాల్సిన చోట ఉంటే... ప్రతీదీ అద్భుతంగా ప్రవహిస్తుంది. ఒక స్క్రిప్ట్ కు సంబంధించి మీ హృదయాన్ని వృద్ధి చేసుకోవడం కీలకం అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో తరచుగా పట్టించుకోని మహిళలకు గుర్తింపుగా ప్రధాన కథానాయిక ఉషా మెహతాను పట్టి చూపడం ఈ చిత్రం ప్రత్యేకత.
సినిమాలో ఉషా మెహతా పాత్ర పోషించిన సారా ఆలీ ఖాన్ మాట్లాడుతూ, పట్టించుకోని స్వాతంత్య్ర సమరయోధారాళ్ళను, వారి సాహసోపేతచర్యలు, త్యాగాలకు సంబంధించిన వెలుగులోకి కథనాలపై వెలుగును ప్రసరించాలన్న చిత్ర నిబద్ధతను పట్టి చూపారు. ముఖ్యంగా భారతదేశ స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో తాను ఇష్టపడే వాటి కోసం పోరాడేందుకు అవసరమైన మానసిక దృఢత్వాన్ని ఆమె నొక్కి చూపారు.
ఐఎఫ్ఎఫ్ఐలో వ్యాపించిన ఉత్సాహపూరితమైన శక్తిని పంచుకుంటూ, ప్రతిఘాతుక ఉషా మెహతా పై దృష్టితో వాస్తవ ఘటనలతో ప్రేరితమైన ఉద్వేగభూరిత కథనం యే వతన్ అంటూ కరణ్ జోహార్ అభివర్ణించారు. వాస్తవ కథనాల వర్ణన అయిన సినిమా గురించి చెప్తూ, దేశం కోసం ఉద్వేగంతో, అంకిత భావంతో పని చేసే వ్యక్తులు ఎదుర్కొనే ఆటంకాలను వివరించారు.
చరిత్రలో వెలుగులోకి రాని కథనాలను, ప్రజలను సమీకరించడంలో మహిళల శక్తిని ప్రదర్శించవలసిన ప్రాముఖ్యతను అపర్ణా పురోహిత్ నొక్కి చెప్పారు. ఒక కాలానికి సంబంధించిన సినిమాను తీసేందుకు ప్రతి ఫ్రేమ్‌లోనూ విశ్వసనీయతను కల్పించడం, ఈ సినిమా కోసం 1940ల నాటి దక్షిణ బాంబేను పునఃసృష్టించడంలో తమ శ్రమను అపూర్వ మెహతా పంచుకున్నారు.
యే వతన్ మేరే వతన్ కేవలం వ్యాపారత్మక సినిమా కాదని, హృదయపూర్వక సృజనాత్మక నిర్ణయమని సినిమా నిర్మాత, దర్శకులు సామూహికంగా సెషన్ ముగింపులో తెలియచేస్తూ, చరిత్రలో కలిసిపోయిన వెలుగులోకి రాని స్వాతంత్య్ర సమరయోధుల గాథలను ముందుకు తెచ్చే శక్తిమంతమైన కథనాన్ని వినవలసిందిగా భారత్‌కు విజ్ఞప్తి చేశారు.
***
(Release ID: 1979363)
Visitor Counter : 94