ఆర్థిక మంత్రిత్వ శాఖ
"ఆపరేషన్ క్లీన్ స్వీప్"లో భాగంగా చట్టవిరుద్ధంగా ఐటీసీ రూపంలో 199 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలకు పాల్పడిన 48 నకిలీ సంస్థల సిండికేట్‌ను ఛేదించి ముగ్గురుని అరెస్టు చేసిన సిజీఎస్టీ ఢిల్లీ ఈస్ట్
Posted On:
21 NOV 2023 5:23PM by PIB Hyderabad
సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (CGST) ఢిల్లీ ఈస్ట్ కమిషనరేట్ "ఆపరేషన్ క్లీన్ స్వీప్" పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐటీసీ రూపంలో చట్టవిరుద్ధంగా 199 కోట్ల రూపాయలకు పైగా స్వాహా చేసిన 48 నకిలీ సంస్థల సిండికేట్‌ను ఛేదించింది.నకిలీ బిల్లులు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించడానికి సిజీఎస్టీ ఢిల్లీ ఈస్ట్ “ఆపరేషన్ క్లీన్ స్వీప్” చేపట్టింది. సేకరించిన సమాచారాన్ని వివిధ కోణాలు క్షేత్ర స్థాయి సమాచారం ఆధారంగా సిజీఎస్టీ ఢిల్లీ ఈస్ట్ “ఆపరేషన్ క్లీన్ స్వీప్” అమలు చేసింది. తొలిసారి చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” లో నకిలీ ఇన్ వాయిస్ లతో 48 సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ సంస్థలు మనుగడలో లేని/నకిలీ /బోగస్ లేదా కాగితాలకు పరిమితం అయ్యాయని అధికారులు గుర్తించారు. వస్తువులు లేదా సేవల వాస్తవ సరఫరా లేకుండా ఈ సంస్థలు ఇన్వాయిస్ లు సిద్ధం చేశాయి. ఇది జీఎస్టీ చట్టం ప్రకారం నేరం. అక్రమాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను సిజీఎస్టీ ఢిల్లీ ఈస్ట్ అరెస్ట్ చేసింది. పాటియాలా హౌస్ చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి వీరికి రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.
సిజీఎస్టీ ఢిల్లీ ఈస్ట్ అరెస్టు చేసిన మెస్సర్స్ ఎం.కే. ట్రేడర్స్ అధిపతి చట్టవిరుద్ధంగా 5 కోట్లకు పైగా ఐటీసీ లావాదేవీలు నిర్వహించినట్టు అధికారులు గుర్తించారు. చట్టవిరుద్ధంగా ఆర్జించిన ఆదాయాన్ని ఇతర మార్గాల ద్వారా తరలించినట్టు అధికారులు గుర్తించారు. సిండికేటే నిర్వహణకు సహకరిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి వివిధ సంస్థల పేరిట ఉన్న స్టాంపులు, అనేక సిమ్ కార్డులు, ఆధార్ కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఇతర సంస్థలకు చెందిన విధ్యుత్ బిల్లులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వివిధ ప్రాంతాల్లో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఢిల్లీలో ఇరుకు సందులు, సున్నిత ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న సంస్థ గుట్టుని ఢిల్లీ పోలీసుల సహకారంతో సీజీఎస్టీ ఢిల్లీ ఈస్ట్ రట్టు చేశారు. సీజీఎస్టీ ఢిల్లీ ఈస్ట్ అధికారులకు పూర్తి సహకారం అందించిన ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేసులో సీజీఎస్టీ ఢిల్లీ ఈస్ట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
***
(Release ID: 1978926)
Visitor Counter : 69