వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారతదేశం యొక్క రవాణా పనితీరు సూచిక (LPI) ర్యాంకింగ్‌ను మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలు మరియు కార్యాచరణ ప్రణాళికపై 11 వాటాదారుల మంత్రిత్వ శాఖలు/విభాగాలు సమావేశమయ్యాయి.

Posted On: 18 NOV 2023 5:46PM by PIB Hyderabad

భారతదేశం యొక్క రవాణా పనితీరు సూచిక (LPI) ర్యాంకింగ్‌ను మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలు మరియు కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక కార్యదర్శి (రవాణా), డి పీ ఐ ఐ టీ, ఎం ఓ సీ ఐ అధ్యక్షతన శుక్రవారం పదకొండు వాటాదారుల మంత్రిత్వ శాఖలలో ఏర్పడిన ఎల్ పీ ఐ అంకిత విభాగం నోడల్ అధికారులతో సమావేశం జరిగింది.

 

(i) కస్టమ్స్, (ii) మౌలిక సదుపాయాలు (iii) షిప్‌మెంట్‌లను ఏర్పాటు చేయడంలో సౌలభ్యం (iv) రవాణా సేవల నాణ్యత (v) ట్రాకింగ్ మరియు ట్రేసింగ్ మరియు (vi) సమయపాలన సహా ఎల్ పీ ఐ యొక్క ఆరు పారామితులలో పనితీరును మెరుగుపరచడంలో తీసుకున్న చర్యలు మరియు ఫలితాలను అంచనా వేయడానికి అంకితమైన సెల్ ప్రతి పక్షం రోజులకు ఒకసారి సమావేశమవుతుంది. 

 

డి పీ ఐ ఐ టీ ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) శ్రీమతి సుమిత్ర దావ్రా  మాట్లాడుతూ దేశం యొక్క రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు తద్వారా ప్రపంచ బ్యాంక్ ఎల్ పీ ఐ లో భారతదేశం యొక్క ర్యాంక్‌ను మెరుగుపరచడానికి లక్ష్య కార్యాచరణ ప్రణాళిక ముఖ్యమని తెలిపారు. వాటాదారుల మంత్రిత్వ శాఖలు/విభాగాలు తీసుకున్న చర్యలు ప్రపంచ బ్యాంక్ ఎల్ పీ ఐ బృందానికి ప్రదర్శిస్తారని  తెలిపారు.

 

సమావేశంలో, మంత్రిత్వ శాఖలు/విభాగాలు కార్యాచరణ ప్రణాళికను సమర్పించాయి మరియు ఉత్తమ పద్ధతులు ప్రదర్శించారు.

 

ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎల్ పీ ఏ ఐ) సెక్రటరీ, వివేక్ వర్మ, ఎల్ పీ ఏ ఐ, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ల  వద్ద వాటాదారుల మధ్య సమాచారాన్ని సురక్షిత ఎలక్ట్రానిక్ సమాచార ప్రవాహాన్ని సులభతరం చేయడానికి మరియు డిజిటలైజ్ చేయడానికి ల్యాండ్ పోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ని అమలు చేసిందని చెప్పారు. ఈ వ్యవస్థ సరిహద్దు రవాణా లో (వాణిజ్యం మరియు ప్రయాణీకుల) వేచివుండే సమయాన్ని తగ్గిస్తుంది, కస్టమ్స్ మరియు సరిహద్దు నిర్వహణ ఆమోదం యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు సరుకుల సకాలంలో డెలివరీని మెరుగుపరుస్తుంది. ఎల్ పీ ఏ ఐ రవాణా లో వేచివుండే  సమయాన్ని 57 రోజుల నుండి 24 గంటల కంటే తక్కువకు తగ్గించడంలో విజయవంతమైందని ఆయన తెలిపారు.

 

శ్రీ మనోజ్ గంగేయ, ఈ డి (ప్లానింగ్), రైల్వే మంత్రిత్వ శాఖ, ఎల్‌పిఐ యొక్క ఆరు పారామితులలో ఎం ఓ ఆర్ ప్రణాళిక చేస్తున్నట్లు వివిధ కార్యక్రమాల గురించి తెలిపారు. ఇందులో రైల్వే ట్రాక్‌ల 100% విద్యుదీకరణ, దేశంలో సరకు రవాణా వేగం మరియు పరిమాణాన్ని మెరుగుపరచడానికి ఎఫ్ వై 24లో కేపెక్స్ ని 2.6 లక్షల కోట్ల రూపాయలకు పెంచడం మరియు తూర్పు మరియు పశ్చిమ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్‌ల అమలు ద్వారా సరుకు రవాణా సగటు వేగాన్ని పెంచే అవకాశం ఉంది. రైళ్లు, తద్వారా వినియోగదారులకు రవాణా సమయం మరియు జాబితా ధరను తగ్గించడం, అదనంగా, రైల్ కంటైనర్లు మరియు సరకు రవాణా టెర్మినల్‌ల అభివృద్ధి ద్వారా గత సంవత్సరం నమోదైన 80 మిలియన్ ఎం టీ నుండి ఎఫ్ వై 31 నాటికి 3 రెట్లు రైలు కంటైనర్ లోడింగ్‌ పెరుగుతుందని భావిస్తున్నారు. మల్టీ-మోడల్ కనెక్టివిటీని ప్రోత్సహించడానికి ల్యాండ్ పోర్ట్‌లలో రైల్వే సైడింగ్ యొక్క సాధ్యాసాధ్యాలను కూడా ఎం ఓ ఆర్ తనిఖీ చేస్తోంది.

 

ఏ ఏ ఐ సి ఎల్ ఏ ఎస్ సీ ఈ ఓ  శ్రీ. అజయ్ కుమార్, డిసెంబర్ 2025 నాటికి అప్‌గ్రేడ్/కొత్త సౌకర్యాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కోల్‌కతాలో చేపట్టబడుతున్న విమానాశ్రయ సామర్థ్య భవనం గురించి వివరించారు.  ఢిల్లీలో (జేవార్ విమానాశ్రయం) లో కూడా 1200 కోట్ల పెట్టుబడితో సుమారు 37 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్ కార్గో గ్రామం ప్రణాళిక చేయబడింది, ఇది డిసెంబర్ 2024 నాటికి ప్రారంభించబడుతుంది. రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన వివిధ కార్యక్రమాలను డిప్యూటీ సెక్రటరీ (పోర్ట్స్) శ్రీ రితురాజ్ మిశ్రా సమర్పించారు. వాటిలో తూనికలు ఆటోమేషన్, పోర్టులలో స్కానింగ్ సౌకర్యాలను మెరుగుపరచడం, రైలు ద్వారా డి పీ డి/ డి పీ ఈ వాటాను 80%కి పెంచడం మరియు అన్ని పోర్ట్‌లలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని రూపొందించడం ద్వారా ప్రక్రియలను క్రమబద్ధీకరించడం మరియు సులభతరం చేయడం వంటివి ఉన్నాయి. డిసెంబరు 23 నాటికి గౌహతిలో కస్టమ్ రెవెన్యూ కంట్రోల్ లాబొరేటరీస్  ప్రారంభించబడుతుందని సీ బీ ఐ సి డైరెక్టర్ ఆర్. అనంత్ హైలైట్ చేశారు, ఇది వివిధ వాణిజ్య వస్తువుల నమూనాల రసాయన విశ్లేషణలో ఫీల్డ్ ఫార్మేషన్‌లో సహాయపడుతుంది. లక్ష్య జోక్యంతో ఈ కార్యక్రమాలు దేశంలో రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని ప్రత్యేక కార్యదర్శి తన ముగింపు వ్యాఖ్యలలో పేర్కొన్నారు. ఇంకా ఎల్ పీ ఐ గణనలో ప్రపంచ బ్యాంకు ఆలోచనను ప్రభావితం చేయడంలో మంత్రిత్వ శాఖల ఉత్తమ పద్ధతులు సహాయపడతాయని ఆమె సూచించారు. సీ బీ ఐ సి, ఎం ఓ సి ఏ, ఎం ఓ ఆర్ టీ హెచ్, ఎం ఓ ఆర్ , మరియు ఎం ఓ పీ ఎస్ డబ్యూ తో సహా మంత్రిత్వ శాఖలు/విభాగాలు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంతరం/సమస్యలను పరిష్కరించడానికి  బొగ్గు, ఉక్కు, డీ జీ ఎఫ్ టీ మరియు ఎన్ ఐ సీ డీ సి ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు, ఉత్తమ పద్ధతులు మరియు జోక్యాలను వినియోగదారు మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో నిర్ణీత కాల వ్యవధితో  భాగస్వామ్య కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి 

 

భారతదేశంలో రవాణా రంగ అవగాహనను మెరుగుపరిచడానికి వాటాదారులకు మంత్రిత్వ శాఖలు/విభాగాల చొరవలు మరియు ఉత్తమ పద్ధతులను తెలియజేయడానికి ఒక క్రమబద్ధమైన విధానాన్ని అనుసరించాలి. 

 

రవాణా రంగంలో ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎల్ పీ ఏ ఐ), ఎం ఓ సివిల్ ఏవియేషన్, ఎం ఓ రైల్వేస్, ఎం ఓ పోర్ట్ షిప్పింగ్ మరియు వాటర్‌వేస్,  బొగ్గు మంత్రిత్వ శాఖ  సీ బీ ఐ సి,  స్టీల్ మంత్రిత్వ శాఖమరియు, డీ ఓ కామర్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ మరియు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ల వంటి పదకొండు వాటాదారుల మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఉన్నాయి.

 

***



(Release ID: 1978067) Visitor Counter : 42


Read this release in: English , Urdu , Hindi , Tamil