వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సమర్ధవంతమైన లాజిస్టిక్స్ (ఎస్.పి.ఇ.ఎల్) కోసం వివిధ రంగాల ప్రణాళికకు సంబంధించిన 60 వ నెట్ వర్క్ ప్లానింగ్
Posted On:
17 NOV 2023 3:39PM by PIB Hyderabad
60 వ నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్.పి.జి) సమావేశం ,డిపార్టెమంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) స్పెషల్ సెక్రటరి ,
శ్రీమతి సుమితా దావ్రా అధ్యక్షతన ,2023 నవంబర్ 16న న్యూఢిల్లీలో జరిగింది.
ఈ సమావేశం ప్రధానంగా ఆయా మంత్రిత్వశాఖలు, విభాగాలు, సమర్థ లాజిస్టిక్స్ కోసం వివిధ రంగాల వారీగా ప్రణాళికల రూపకల్పనపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి పెట్టింది.
నేషనల్ లాజిస్టిక్ పాలసీ (ఎన్.ఎల్.పి) కింద సమగ్ర లాజిస్టిక్స్ కార్యాచరణ ప్రణాళిక (సిఎల్ఎపి) కింద దీనిని చేపట్టారు. లాజిస్టికక్ సంబంధిత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయా రంగాల అవసరాలను తీర్చేందుకు తగిన ప్రణాళికలు
రూపొందించడంపై ఈ సమావేశం దృష్టి పెట్టేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
ఇవాళ, స్టీలు మంత్రిత్వశాఖ, బొగ్గు మంత్రిత్వశాఖ లాజిస్టిక్లకు సంబంధించి తమ ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. మౌలిక సదుపాయాలు, ప్రాసెస్లు, డిజిటల్ మెరుగుదలలు,
పాలసీలు, రెగ్యులేటరీ సంస్కరణలు, మెరుగైన పనికి సామర్థ్యాల నిర్మాణం వంటివి ఇందులో ఉన్నాయి. స్టీలు మంత్రిత్వశాఖ తమ ఎస్.పి.ఇ.ఎల్ విధానాన్ని సవివరంగా తెలిపింది. ఇందులో ఇనుప ఖనిజం, స్టీలు కు సంబంధించి
సరఫరా , డిమాండ్ విశ్లేషణ, 2030–31 వరకు , ఆ పైన కాలానికి భవిష్యత్ అంచనాలు, లాజిస్టిక్ ల విషయంలో భవిష్యత్ సన్నద్ధత, వంటివి ఇందులో పేర్కొన్నారు. ప్రాథమిక ఎస్.పి.ఇ.ఎఎల్ ముసాయిదాను స్టీలు మంత్రిత్వశాఖ త్వరలోనే ఖరారు చేయనుంది.2023 బొగ్గు లాజిస్టిక్ పాలసీ కింద, రూపొందించిన సమీకృత బొగ్గు తొలగింపు ప్రణాళిక లో తేల్చిన అంశాలను బొగ్గుమంత్రిత్వశాఖ తెలియజేసింది.
మౌలిక సదుపాయయాల అంతరాల ప్రాజెక్టుకు అవసరమైన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది లాజిస్టిక్ల మెరుగుదలకు, ఖర్చు తగ్గింపు, మల్టీ మోడల్ మిక్స్ ను గరిష్ఠ స్థాయికి తీసుకువెళ్లడానికి అవసరమైన అంశాలను ఇందులో ప్రస్తావించారు.
రైల్వేనెట్ వర్క్ను గరిష్ఠ స్థాయిలో ,బొగ్గు లాజిస్టిక్ లకోసం వినియోగించడం వల్ల రైల్వే లాజిస్టిక్ ల ఖర్చు 14 శాతం వరకు తగ్గనుంది. దీనికితోడు, 2030 ఆర్థిక సంవత్సరం నాటికి లక్ష టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను తగ్గించడానికి ఈ ప్రతిపాదనలు ఉపకరిస్తాయి.
అలాగే రోడ్డు మార్గం ద్వారా బొగ్గు తరలింపు స్థానంలో రైల్వే రవాణాకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది.
బొగ్గు కు సంబంధించిన లాజిస్టిక్ విధానం , ఆయా రంగాల ఆధారిత సమర్థ ప్రణాళికల వినియోగానికి ఉపకరిస్తుంది. ఇది నిర్దీత కాల వ్యవధిలోగా లాజిస్టిక్స్ సమగ్ర వృద్ధికి వీలు కల్పిస్తున్న విషయాన్ని సమావేశం ప్రత్యేకంగా గుర్తించింది.
.స్పెషల్సెక్రటరీ, వివిధ అనుబంధ రంగాల సహకారం, మోడల్ మిక్స్, సమగ్ర ప్రణాళిక వంటి విషయాలను కూడా ఈ సందర్భంగా చర్చించారు.
ఇప్పటివరకు, ఈ కింద చర్యలను ఇతర మంత్రిత్వశాఖలు లాజిస్టిక్సంబంధిత అంశాలపై తీసుకున్నాయి.
• పోర్టుల మంత్రిత్వశాఖ చే సమగ్ర పోర్టు ల ప్రణాళిక రూపకల్పన, షిప్పింగ్ ,వాటర్ వేస్ ల అభివృద్ధి , ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ.
• సిమెంట్ సెక్టరల్ ప్రణాళిక రూపకల్పనకు ప్రయత్నం కొనసాగింపు.
• ఆహారం, ప్రజాపంపిణీ అభివృద్ధి విభాగం, ఆహార ధాన్యాల తరలింపునకు సంబంధించి గరిష్ఠ ప్రయోజనం కలిగించే మార్గాలను గుర్తించేందుకు అధ్యయనం చేపడుతోంది. దీనివల్ల లాజిస్టిక్
ఖర్చులు, రవాణా ఖర్చులు తగ్గుతాయి. సమయం ఆదా అవుతుంది.
• వ్యవసాయం,రైతు సంక్షేమ విభాగం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని అభివృద్ధి చేసింది. ఇది లాజిస్టిక్ సంబంధిత మౌలికసదుపాయాలు, పంట చేతిక వచ్చిన అనంతరం అవసరమైన మౌలికసదుపాయాల కల్పనకు
వీలు కల్పిస్తుంది.
***
(Release ID: 1977779)
Visitor Counter : 93