గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ముంబాయిలో చెత్త నిల్వ ప్రదేశాలు, ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి పరిష్కార మార్గాలపై అధికారులతో చర్చించిన కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్.ఎస్.పూరి.
ఘనవ్యర్థాల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలను చర్చించేందుకు,
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి,
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే తో కలిసి అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో,
మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ్రేటర్ ముంబాయి మునిసిపల్ కార్పొరేషన్, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల
కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు వర్చువల్ గా జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
Posted On:
16 NOV 2023 5:07PM by PIB Hyderabad
ముంబాయి, అత్యంత చైతన్యవంతమైన మహానగరం. రోజుకు సుమారు 7500 టన్నుల వ్యర్థాలు ఇక్కడ వస్తుంటాయి.నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంగణాలు, మురికివాడల నుంచి వచ్చే ఈ వ్యర్థాల నిర్వహణ సవాలుతో కూడుకున్నది.
తడి,పొడి చెత్త నిర్వహణతో ముడిపడిన వివిధ అంశాలతోపాటు, భవన నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు
, వివిధ నిర్మాణ ప్రాంగణాలనుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణ సవాలుతో కూడుకున్నది. వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లతో ముడిపడిన పలు అంశాలను
ఈ సందర్భంగా చర్చించారు.అలాగే ఇప్పటికే అనుమతించిన వివిధ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు
సంబంధించిన పనుల పురోగతిని చర్చించారు.
ములుంద్, దియోనార్లలో గల డంప్సైట్ల బయోరెమిడియేషన్ గురించి చర్చించారు. వ్యర్థాలను బయో, సి.ఎన్.జి
ప్లాంట్లకు తరలించడం గురించికూడా ఈ సమావేశంలో చర్చించారు. ఒఎంసి కొలాబరేషన్తో వ్యర్థాలనుంచి సంపద సృష్టించడం , సర్కులర్ ఎకానమీలో భాగంగా దీనిని చూడడం వంటి అంశాలను ఈ సమావేశంలో సమీక్షించారు. .ముంబాయిలో, ఘన వ్యర్థాల ప్రాసెసింగ్,డంప్ సైట్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం వంటి వాటిపై అత్యవసర కార్యాచరణకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి అధ్యక్షతన ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే బృహన్ ముంబాయి మునిసిపల్ కార్పొరేషన్ (బి.ఎం.సి) కమిషనర్ అధ్యక్షతన మరో ముగ్గురు సభ్యులకమిటీ ని కూడా ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కమిటీల సిఫార్సులను బిఎంసి అమలు చేసేందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తారు.
స్వచ్ఛభారత్ మిషన్ – అర్బన్ 2.0 కింద భారతీయ నగరాలను , చెత్త రహిత నగరాలుగా తీర్చి దిద్దేందుకు , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ,
2021 అక్టోబర్ లో ఒక ప్రణాళికను ప్రకటించారు. లక్ష్య జీరో మిషన్ కింద గల ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం నగరాలను చెత్త రహిత నగరాలుగా తీర్చిదిద్దడం., దాదాపు 15000 ఎకరాల మేరకు నగరాలలో కీలక భూమి 16 కోట్ల టన్నుల చెత్త నిల్వతో పేరుకు పోతున్నది. ఇందుకు పరిష్కారాలను సాధించడం ఈ ప్రణాళిక లక్ష్యం.. ఈ మిషన్ కు అనుగుణంగా ప్రభుత్వం మహారాష్ట్రలో స్వచ్ఛ భారత్ను అమలు చేసేందుకు, రూ 3,400 కోట్ల రూపాయలు కేటాయించింది.
***
(Release ID: 1977554)
Visitor Counter : 73