ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో జరుగుతున్న 42వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ లో "సిబిఐసి-యూనిటింగ్ మార్కెట్స్, బ్రిడ్జింగ్ బోర్డర్స్" అనే థీమ్ తో జిఎస్ టి అండ్ కస్టమ్స్ పెవిలియన్ ను ప్రారంభించిన సిబిఐసి చైర్మన్ శ్రీ సంజయ్ అగర్వాల్


నిబంధనలు /ప్రక్రియలకు సంబంధించి పన్ను చెల్లింపుదారులకు, ప్రజలకు సలహా సహాయాలు అందించేందుకు జి ఎస్ టి , కస్టమ్స్, జి ఎస్ టి ఎన్, ఐ సి ఇ జి ఎ టి ఇ , సీబీఐసీ మిత్రలపై ఆరు ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసిన సి బి ఐ సి

సందర్శకులను నిమగ్నం చేయడానికి, వినోదాన్ని అందించడానికి, జి ఎస్ టి అండ్ కస్టమ్స్ పెవిలియన్ నుక్కడ్ నాటక్, వెంట్రిలోక్విస్ట్ షోలు, జి ఎస్ టి, కస్టమ్స్ పై క్విజ్ షోలు , పిల్లలను ఆకర్షించే కార్యకలాపాల ద్వారా అవగాహనను పెంచుతుంది.

Posted On: 15 NOV 2023 7:09PM by PIB Hyderabad

కేంద్ర పరోక్ష పన్నులు , కస్టమ్స్ బోర్డు (సిబిఐసి) చైర్మన్ శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్ న్యూఢిల్లీ లో జరుగుతున్న 42 వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ లో ఈరోజు "సిబిఐసి-యూనిటింగ్ మార్కెట్స్, బ్రిడ్జింగ్ బోర్డర్స్" అనే థీమ్ తో "జిఎస్ టి అండ్ కస్టమ్స్ పెవిలియన్"ను ప్రారంభించారు.  సిబిఐసి మెంబర్ (ఐటి అండ్ ట్యాక్స్ పేయర్ సర్వీసెస్) శ్రీమతి వి.రమా మాథ్యూ, డి.జి.ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ , శ్రీమతి రేణు కె.జగ్దేవ్, ఇతర సీనియర్ అధికారులు, పన్ను చెల్లింపుదారులు, సాధారణ ప్రజల సమక్షంలో ఈ పెవిలియన్ ను ప్రారంభించారు.

 

వసుదైక కుటుంబం - - యునైటెడ్ బై ట్రేడ్' అనే ఐ టి పి ఒ -2023 థీమ్ కు అనుగుణంగా ' సి బి ఐ సి - యూనిటింగ్ మార్కెట్స్, బ్రిడ్జింగ్ బోర్డర్స్' థీమ్ వీడియో పెవిలియన్  కు లక్ష్యం నిర్దేశించింది. జిఎస్ టి రిజిస్ట్రేషన్ అండ్ కంపోజిషన్ లెవీపై 10 ప్రాంతీయ భాషల్లో పన్ను చెల్లింపుదారుల అవగాహన కోసం డిజిటిఎస్ రూపొందించిన ట్యుటోరియల్ వీడియోలను, భారతదేశ ఎఇఒ ప్రోగ్రామ్ పై ట్యుటోరియల్ వీడియోను కూడా ఈ కార్యక్రమంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా సిబిఐసి చైర్మన్ శ్రీ సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం , సులభ వ్యాపారం కోసం సరళీకృత పన్ను విధానం , జి ఎస్ టి,  కస్టమ్స్ ప్రక్రియల డిజిటలైజేషన్ కోసం సిబిఐసి తీసుకున్న వివిధ చర్యలను వివరించారు. జిఎస్ టి భారతదేశాన్ని నిజంగా ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ గా ఏకీకృతం చేసిందని, భారతీయ కస్టమ్స్ ఆర్థిక సరిహద్దుల సంరక్షకులుగా ఉండటమే కాకుండా, సరిహద్దులను అనుసంధానం చేయడంలో, అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో , ప్రధాన మంత్రి గతి శక్తి, మేక్ ఇన్ ఇండియా , ఆత్మనిర్భర్ భారత్ వంటి భారత ప్రభుత్వ కార్యక్రమాల కోసం పనిచేయడానికి కూడా దోహదం చేసిందని శ్రీ అగర్వాల్ చెప్పారు.

పన్ను చెల్లింపుదారులు , ప్రజలకు నియమాలు / ప్రక్రియలకు సంబంధించి మార్గనిర్దేశం చేయడానికి ,  వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి జిఎస్ టి , కస్టమ్స్, జిఎస్ టి ఎన్, ఐసిఇగేట్ , సిబిఐసి మిత్రాపై 6 ప్రత్యేక హెల్ప్ లైన్ డెస్క్ లను పెవిలియన్ లో ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ వద్ద నియమించిన అధికారులతో సంభాషించిన సందర్భంగా, శ్రీ అగర్వాల్ పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించడం అత్యంత ప్రాధాన్యతగా చెప్పారు. హెల్ప్ డెస్క్ లు , ఇన్ఫర్మేటివ్ డిజిటల్ కంటెంట్ లో జిఎస్ టి అండ్ కస్టమ్స్ పెవిలియన్ లో సిబిఐసి బహుముఖ పాత్రను విజయవంతంగా ప్రదర్శించడంలో చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు, వీటిలో వినూత్న విఆర్ గేమ్ "స్టాప్ ది స్మగ్లర్" కూడా ఉంది. ఒక సమాచారాత్మక , ఆకర్షణీయమైన  ‘జి ఎస్ టి అండ్  కస్టమ్స్ పెవిలియన్'ను నిర్వహించినందుకు పన్ను చెల్లింపుదారుల సేవల బృందాన్ని శ్రీ అగర్వాల్ అభినందించారు. ప్రదర్శనలోని విషయాలు,  ఇతర కార్యకలాపాలు జిఎస్ టి , కస్టమ్స్ ప్రక్రియల గురించి పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించడంలో సహాయపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 జిఎస్ టి ,కస్టమ్స్ పై  వివిధ ముఖ్యమైన అంశాలపై అనేక థీమ్ ఆధారిత నిపుణుల చర్చా సెషన్లు ఉంటాయి. సందర్శకులను నిమగ్నం చేయడానికి , వినోదాన్ని అందించడానికి, జి ఎస్ టి అండ్  కస్టమ్స్ పెవిలియన్ నుక్కడ్ నాటక్, వెంట్రిలోక్విస్ట్ ప్రదర్శనలు, జి ఎస్ టి , కస్టమ్స్ పై క్విజ్ షోలు, పిల్లల కార్యకలాపాలు వంటి అనేక ఆసక్తికరమైన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. కస్టమ్స్ అండ్ జి ఎస్ టి  డిపార్ట్ మెంట్ లో ఉద్యోగావకాశాలపై యువతకు దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు.  వివిధ అంశాలపై సిబిఐసి ప్రచురణలు , బ్రోచర్లు కూడా ఉచిత సర్క్యులేషన్ , డౌన్ లోడ్ కోసం అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ధరోహర్ (నేషనల్ మ్యూజియం ఆఫ్ కస్టమ్స్ అండ్ జి ఎస్ టి , గోవా) స్మారక చిహ్నాల ప్రదర్శనకు సి బి ఐ సి  పెవిలియన్ లో ప్రత్యేక కౌంటర్ కూడా అందుబాటులో ఉంది.

యునైటింగ్  మార్కెట్స్, బ్రిడ్జింగ్ బోర్డర్స్' నిబద్ధతతో, సిబిఐసి పెవిలియన్ నవంబర్ 14 నుండి 27 వరకు, ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్, 2023 లో, న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లోని హాల్ నంబర్ 5 లో సందర్శకుల కోసం తెరిచి ఉంది.

***


(Release ID: 1977262) Visitor Counter : 81


Read this release in: English , Urdu , Hindi