రక్షణ మంత్రిత్వ శాఖ
నవంబర్ 16, 2023న ఇండొనేషియాలోని జకార్తాలో 10 ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం- ప్లస్‌కు హాజరుకానున్న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
సమావేశాల విరామాలలో పాలుపంచుకుంటున్న రక్షణ మంత్రులతో జరుగనున్న ద్వైపాక్షిక సమావేశం
Posted On:
14 NOV 2023 10:51AM by PIB Hyderabad
10వ ఆసియాన్ (ఎఎస్ఇఎఎన్) రక్షణ మంత్రుల సమావేశం - ప్లస్ (ఎడిఎంఎం- ప్లస్)కు హాజరయ్యేందుకు 16 నుంచి 17వ తేదీ నవంబర్ 2023 వరకు ఇండినేషియా రాజధాని జకార్తాలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధికారిక పర్యటన చేయనున్నారు. నవంబర్ 16న జరుగనున్న సమావేశం సందర్భంగా రక్షణ మంత్రి ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా సమస్యలపై ఫోరం నుంచి ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎడిఎంఎం- ప్లస్ అధ్యక్షత వహిస్తున్నందున ఇండొనేషియా ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఎడిఎంఎం-ప్లస్ సమావేశం సందర్భంగా, ఇందులో పాలుపంచుకుంటున్న దేశాల రక్షణ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించి, పరస్పర లాభదాయకమైన కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం కోసం రక్షణ సహకారం గురించి చర్చిస్తారు.
ఆసియాన్‌లో అత్యున్నత రక్షణ సంప్రదింపుల, సహకార యంత్రాంగం ఎడిఎంఎం. భద్రతను, రక్షణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఆసియాన్ సభ్యదేశాలకు (బ్రూనై, కంబోడియా, ఇండొనేషియా, లావో పిడిఆర్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం), దాని ఎనిమిది చర్చల భాగస్వాములు (భారత్, యుఎస్, చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్)కు ఎడిఎంఎం- ప్లస్ అనేది ఒక వేదిక.
ఆసియాన్ చర్చల భాగస్వామిగా 1992లో భారత్ చేరింది, ఎడిఎంఎం- ప్లస్ ప్రారంభ సమావేశాన్ని 12 అక్టోబర్ 2010 వియత్నాంలోని హనోయ్‌లో నిర్వహించారు. ఆసియాన్, ప్లస్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఎడిఎంఎం- ప్లస్ మంత్రుల సమావేశాలు 2017 నుంచి వార్షికంగా జరుగుతున్నాయి.
ఏడు నిపుణుల వర్కింగ్ గ్రూపులు (ఇడబ్ల్యుజిలు) - సముద్రతీర భద్రత, సైనిక వైద్యం, సైబర్ భద్రత, శాంతి పరిరక్షణ చర్యలు, కౌంటర్ టెర్రరిజం, హ్యుమానిటేరియన్ మైన్ యాక్షన్ & మానవీయ సహాయం & విపత్తు ఉపశమనం (హెచ్ఎడిఆర్) ద్వారా సభ్య దేశాల మధ్య ఆచరణాత్మక సహకారంతో ఎడిఎంఎం- ప్లస్ ముందుకు సాగుతోంది. ఈ 10వ ఎడిఎంఎం- ప్లస్ సందర్భంగా 2024-2027 సంవత్సరానికి తదుపరి కో-చైర్స్‌ను ప్రకటిస్తారు. ప్రస్తుత 2021-2024 కాలపరిమితిలో, ఇండొనేషియాతో కలిసి హెచ్ఎడిఆర్ పై ఇడబ్ల్యుజికి భారత్ సహ అధ్యక్షత వహిస్తోంది.
***
(Release ID: 1977235)
Visitor Counter : 84