ప్రధాన మంత్రి కార్యాలయం
అయోధ్య దీపోత్సవంయొక్క శక్తి కి ప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
Posted On:
12 NOV 2023 8:14PM by PIB Hyderabad
అయోధ్య దీపోత్సవం యొక్క శక్తి దేశం లో ఒక క్రొత్త చైతన్యాన్ని నింపుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అన్నారు. భగవాన్ శ్రీ రాముడు దేశ ప్రజలందరి కి ఆశీర్వాదాన్ని అందించి మరి అందరి కి ప్రేరణమూర్తి గా నిలవాలి అంటూ శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ అద్భుతం, అలౌకికం మరియు అవిస్మరణీయం.
లక్షల కొద్దీ దీపాల ధగధగలు నిండిన అయోధ్య నగరం లోని భవ్యమైనటువంటి దీపోత్సవం తో యావత్తు దేశం ప్రకాశవంతం అవుతున్నది. అక్కడ నుండి ప్రసరిస్తున్నటువంటి శక్తి సంపూర్ణ భారతవర్షం లో ఒక క్రొత్త అభినివేశాన్ని మరియు ఉత్సాహాన్ని అందిస్తున్నది. భగవాన్ శ్రీ రాముడు సమస్త దేశవాసుల కు కుశలాన్ని అందించడం తో పాటు గా నా కుటుంబ సభ్యులందరి కి ప్రేరణాత్మకమైన శక్తి గా మారాలి అని నేను కోరుకొంటున్నాను.
జయ్ సియారామ్.’’ అని పేర్కొన్నారు.
****
DS
(Release ID: 1976582)
Visitor Counter : 130
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam