గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పర్యావరణ హిత దీపావళి నిర్వహణకు సిద్ధమవుతున్న ఢిల్లీ

Posted On: 09 NOV 2023 1:27PM by PIB Hyderabad

పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛతకు  ప్రాధాన్యత ఇస్తూ ఈసారి దీపావళి పండుగ జరుపుకోవడానికి ఢిల్లీ ప్రజలు సిద్ధమవుతున్నారు. పండుగలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రజలు పండుగల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు. దీపావళి పండుగ కోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ఏడాది దీపావళి పండుగను బిన్నంగా జరుపుకోవడానికి ఢిల్లీ ప్రజలు సిద్ధమయ్యారు. సంప్రదాయబద్ధంగా దీపావళి జరుపుకుంటూనే స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారు. పర్యావరణహితంగా, స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తూ దీపావళి జరుపుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ' స్వచ్ఛ దీపావళి, శుభ దీపావళి" పేరుతో  స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0, నేషనల్ సర్వీస్ స్కీమ్, కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్ సహకారంతో స్వచ్ఛంద సేవా సంస్థ వై వేస్ట్ వెడ్నెస్డే  ఫౌండేషన్‌ 2 రోజుల జీరో వేస్ట్ ఫెస్టివల్- దీపోత్సవం ని  నిర్వహించింది. దీపోత్సవం తో పాటు స్వచ్ఛ ఉత్సవ్, ఓటరు ఉత్సవ్ కార్యక్రమాలు జరిగాయి. పర్యావరణ హితంగా, స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తూ పండుగలు జరుపుకోవడంపై  ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు.  పాత వస్త్రాలు ఉపయోగించి  అలంకరణ చేయడం, పునర్వినియోగపరచదగిన కాటన్ ఫాబ్రిక్ స్ట్రీమర్‌లు,పనికిరాని అట్ట పెటీలు వుపయోగించి తయారుచేసిన పునర్వినియోగ సెల్ఫీ ఫ్రేమ్‌లు, వ్యర్థ ఐస్‌క్రీమ్ స్టిక్‌లతో చేసిన పునర్వినియోగ హేంగింగ్ కళాఖండాలు, చెరకు పిప్పితో చేసిన  ప్లేట్లు, ఆహారం అందించడానికి గిన్నెలు, ఇళ్లలో సేంద్రియ ఎరువుల తయారీ లాంటి అంశాలపై ప్రదర్శన నిర్వహించారు.  వ్యర్థాల నిర్వహణ, మొక్కల పెంపకం  గుడ్డ సంచుల వినియోగం తదితర అంశలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా   క్యాంపస్ లోపల తడి చెత్త అంతా కంపోస్ట్ గా మార్చారు

ఢిల్లీకి చెందిన షాహదారా సంస్థ  ఏక్తా గార్డెన్‌లో స్వచ్ఛ దీపావళి ప్రాముఖ్యత వివరిస్తూ  గోడ సుందరీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానిక ప్రజలు, చిన్న పిల్లలు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమాలతో చైతన్యం పొందిన ఢిల్లీ ప్రజలు పర్యావరణ హిత దీపావళి జరుపుకోవడానికి సన్నాహాలు ప్రారంభించారు. 

 

***



(Release ID: 1976026) Visitor Counter : 53


Read this release in: English , Urdu , Hindi , Tamil