నీతి ఆయోగ్
సుస్థిర భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి అనే అంశంపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో వర్క్‌షాప్
హరిత అభివృద్ధిపై ఢిల్లీలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశం ఆమోదించిన తీర్మానం అమలు చేయడానికి అమలు చేయాల్సిన చర్యలు, ప్రణాళికపై వర్క్‌షాప్
Posted On:
08 NOV 2023 4:54PM by PIB Hyderabad
సుస్థిర భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి అనే అంశంపై నీతి ఆయోగ్ 2023 నవంబర్ 9న వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ మరియు వాటర్ సహకారంతో నీతి ఆయోగ్ నిర్వహించే వర్క్‌షాప్ లో హరిత అభివృద్ధిపై ఢిల్లీలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశం ఆమోదించిన తీర్మానం అమలు చేయడానికి అమలు చేయాల్సిన చర్యలు, ప్రణాళికపై వర్క్‌షాప్ లో చర్చలు జరుగుతాయి. ఢిల్లీలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశం ఆమోదించిన తీర్మానాలు కార్యరూపం దాల్చేందుకు నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా నీతి ఆయోగ్ ఈ వర్క్‌షాప్ ను ఏర్పాటు చేసింది.
భారతదేశం అధ్యక్షతన జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశం పలు అంశాలపై చర్చలు జరిపి ఢిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపింది. హరిత అభివృద్ధి సాధించే అంశంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించి లక్ష్యం సాధించడానికి దేశాల మధ్య సహకారం అవసరమని ఢిల్లీ డిక్లరేషన్ లో పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగే వర్క్‌షాప్ ఢిల్లీ డిక్లరేషన్ అమలు, ఇంధన పరివర్తన, పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ, విపత్తులు తట్టుకుని నిలబడే తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించి చర్చలు జరిపి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తుంది.ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి సాధించడానికి వర్క్‌షాప్ రూపొందించే ప్రణాళిక ఒక బ్లూప్రింట్ గా ఉపయోగపడుతుంది.
ఢిల్లీ డిక్లరేషన్ లో పొందుపరచిన వివిధ అంశాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం లక్ష్యంగా ఏర్పాటైన వర్క్‌షాప్ మూడు రంగాలపై దృష్టి సారించి చర్చలు జరుపుతుంది. ఢిల్లీ డిక్లరేషన్ అమలు కావడానికి ఈ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నీతి ఆయోగ్ గుర్తించింది.
1) అందుబాటులో ఉండే విధంగా పరిశుద్ధ, సుస్థిర ఇంధన పరివర్తన- ఇంధన భద్రత కల్పించడానికి సాంకేతిక అంశాలు అందుబాటులోకి తెచ్చి ఆవిష్కరణలను ప్రోత్సహించి,స్వచ్ఛమైన, స్థిరమైన ఇంధన వనరులను గుర్తించాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఆర్థిక వనరులను అందుబాటులోకి తెచ్చి పటిష్ట సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. వర్క్‌షాప్ లో భద్రత, అందుబాటు, స్థోమత, సుస్థిరత, సమ న్యాయం అంశాలపై చర్చలు జరుగుతాయి.
2) పర్యావరణ వ్యవస్థలన పునరుద్ధరణ, పరిరక్షణ, సుస్థిర వినియోగం- వాతావరణ మార్పు, జీవవైవిద్య నష్టం, విస్తరిస్తున్న ఎడారులు , కరువు, క్షీణిస్తున్న భూసారం, కాలుష్యం, ఆహార భద్రత లోపం, నీటి కొరత అలంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని జీ-20 దేశాలు ఢిల్లీ డిక్లరేషన్ లో పేర్కొన్నాయి. ఈ లక్ష్యాలు సాధించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి పర్యావరణహిత జీవన శైలి, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టడం అంశాలపై వర్క్‌షాప్ లో చర్చలు జరుగుతాయి.
3) విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల అభివృద్ధి అమలు - మహిళలు, బాలికలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ బలహీన వర్గాలపై వాతావరణ మార్పు, జీవవైవిద్య నష్టం, విస్తరిస్తున్న ఎడారులు, పెరుగుతున్న కాలుష్యం వల్ల కలుగుతున్న ప్రభావాన్ని ఢిల్లీ డిక్లరేషన్ గుర్తించి తగిన చర్యలు అమలు చేయాలని పేర్కొంది. భారతదేశం అధ్యక్షతన జరిగిన జీ-20 సదస్సు విపత్తు ప్రమాదాలు తగ్గించడానికి, జాతీయ, సమాజ పునరుద్ధరణను పెంపొందించడానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఈ అంశాలను చర్చించి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి వర్క్‌షాప్ లో వాతావరణ సూచన, ప్రధాన స్రవంతి విపత్తు ప్రమాదం,స్థితిస్థాపకత, తీరప్రాంత రాష్ట్రాలు/నగర స్థాయిలో ప్రణాళిక రూపకల్పన, వాతావరణ స్థితిస్థాపకత సాధించడానికి ఆర్థిక వనరుల సమీకరణ వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి.
ఈ వర్క్‌షాప్‌లో నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, విద్యావేత్తలు, ఇంధనం, పర్యావరణం, వాతావరణం మరియు విపత్తు స్థితిస్థాపకతపై పని చేస్తున్న సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
****
(Release ID: 1975811)
Visitor Counter : 79