రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
స్వచ్ఛత ప్రచారం కార్యక్రమం 3.0లో ఔషధశాఖ సాధించిన విజయాలు
Posted On:
08 NOV 2023 4:22PM by PIB Hyderabad
ఔషధశాఖ 2 అక్టోబర్, 2023 నుండి 31 అక్టోబర్, 2023 వరకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక స్వచ్ఛత ప్రచారం కార్యక్రమం 3.0లో విజయవంతంగా పాల్గొంది.
అహ్మదాబాద్, ఎస్ఏఎస్ నగర్, రాయ్ బరేలీ, హాజీపూర్, కోల్‌కతా, గౌహతి మరియు హైదరాబాద్‌లోని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ - (ఎన్ఐపీఈఆర్) వంటి డిపార్ట్‌మెంట్ సంస్థలు ఫార్మాస్యూటికల్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబీఐ); మరియు మూడు పి.ఎస్.యు సంస్థలు, అంటే బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (బీసీపీఎల్), కోల్‌కతా, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), బెంగళూరుకు చెందిన పూణె మరియు కర్ణాటక యాంటీబయాటిక్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్(కేఏపీఎల్) ప్రచార కార్యక్రమం కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు; 31 అక్టోబర్, 2023 నాటికి ప్రచారం ముగింపు సమయానికి ప్రారంభంలో ముందుగా నిర్వచించికున్న 8 లక్ష్యాలలో ఎంపీ రిఫరెన్స్లలో ఏడింటికి ప్రతిస్పందనలు లభించాయి. మొత్తం 62 పబ్లిక్ గ్రీవెన్స్లు పరిష్కరించబడ్డాయి. ప్రత్యేక ప్రచారం కింద పర్యవేక్షించబడే ఇతర పారామితులపై ఎలాంటి పెండెన్సీ లేదు. దేశ వ్యాప్తంగా మొత్తం 9648 గుర్తించబడిన అవుట్డోర్ సైట్లు శుభ్రం చేయబడ్డాయి.
-
- పీఎంబీఐ చొరవ మరియు మద్దతుతో శుభ్రపరచబడిన 9600 జన ఔషధి కేంద్రాలు సాధారణ ప్రజలలో సుదూర ప్రభావాన్ని సృష్టించడం అందరిలో పరిశుభ్రమైన మరియు పరిశుభ్ర పర్యావరణం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించింది.
- 24 రాష్ట్రాల్లో పి.ఎం.ఆర్.యు. ద్వాచార శుభ్రం చేయబడిన 68 ప్రాంగణాలలో (25 మాత్రమే 'అవుట్డోర్ సైట్లు'గా వర్గీకరించబడ్డాయి), పి.ఎం.ఆర్.యు.లు 1341 గంటల కంటే ఎక్కువ సమయం గడిపే 803 మంది వ్యక్తుల భాగస్వామ్యాన్ని నిర్ధారించాయి.
- మొత్తం 5823 భౌతిక ఫైల్లు సమీక్షించబడ్డాయి మరియు 1400 ఫైల్లు తొలగించబడ్డాయి.
- ఈ-క్లీనింగ్ కింద, 3261 ఇటీవల `పార్క్ చేసిన’ ఈ-ఫైళ్లు సమీక్షించబడ్డాయి మరియు భవిష్యత్తు సూచన కోసం ఉంచడానికి నిర్ణయం తీసుకోబడింది.
-
- ప్రచార సమయంలో, మూడు నైపర్లతో పాటు డిపార్ట్మెంట్ స్క్రాప్ పారవేయడం ద్వారా రూ.3,41,387/- ఆదాయాన్ని ఆర్జించింది.
- డిపార్ట్మెంట్ ఎనిమిది బెస్ట్ ప్రాక్టీసెస్ (నైపర్-అహ్మదాబాద్ నుండి 3, నైపర్ -గువాహటి నుండి 1, హెచ్.ఎ.ఎల్, పూణే నుండి 1, నైపర్-హాజీపూర్ నుండి 1 మరియు ఎన్.పి.పి.ఎ/ఎం.ఎం.ఆర్.యులు నుండి ఒక్కొక్కటి) జీవన సౌలభ్యం, కార్యాలయానికి స్థలాన్ని తిరిగి పొందడంపై దృష్టి సారించింది. తగిన మేటి జీవన వాతావరణాన్ని మెరుగుపరచడానికి పౌరుల భాగస్వామ్యపు చర్యలు చేపట్టింది.
- మన పర్యావరణాన్ని పరిరక్షించడానికి గడువు ముగిసి/ గడువు ముగిసిన మందులను సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా పారవేసేందుకు ఎన్.పి.పి.ఎ మరియు పి.ఎం.ఆర్.యు.ల వద్ద ఔషధాల నిల్వ మరియు పారవేయడం గురించి ఎన్పీపీఏ 31.10.2023న వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది.
***
(Release ID: 1975810)
Visitor Counter : 73