కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐ ఐ సీ ఏ ) మరియు ఎఫ్ ఎస్ ఆర్ గ్లోబల్ విద్యారంగంలో సహకారాన్ని మరియు విద్యుత్ రంగానికి సంబంధించిన నియంత్రణ సమస్యలపై పరిశోధనను ప్రోత్సహించడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి

Posted On: 08 NOV 2023 3:03PM by PIB Hyderabad

గురుగ్రామ్‌లోని మనేసర్‌లోని ఐఐసిఎ క్యాంపస్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసిఎ) మరియు ఎఫ్‌ఎస్‌ఆర్ గ్లోబల్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఒయు) నిన్న సంతకం చేయబడింది. ఎంఒయుపై ఐఐసిఎకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొఫెసర్ (డా.) నవీన్ సిరోహి మరియు ఎఫ్‌ఎస్‌ఆర్ గ్లోబల్ తరపున శ్రీమతి శ్వేత రవి కుమార్ సంతకాలు చేశారు.

 

ఐఐసిఎ మరియు ఎఫ్ఎస్ఆర్  గ్లోబల్ పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాలను స్థాపించడానికి సహకార ప్రయత్నాలను ప్రోత్సహించడం మరియు ఆచరణాత్మక విధానాలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ భాగస్వామ్యం యొక్క ప్రాథమిక దృష్టి భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగం యొక్క నియంత్రణ కోసం కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరచడం.

 

ఈ ఎంఓయు ఐఐసిఎ మరియు ఎఫ్ఎస్ఆర్  గ్లోబల్ మధ్య సహకారాన్ని పటిష్టం చేస్తుంది, విద్యుత్ రంగ నియంత్రణ మరియు విద్యుత్ నిర్వహణ రంగంలో వినూత్న వ్యూహాల అన్వేషణకు వారి అధికారిక అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. సానుకూల మార్పు మరియు సుస్థిర ప్రగతి లక్ష్యంతో విద్యుత్ రంగం మరియు దాని నియంత్రణపై లోతైన అవగాహనను సులభతరం చేయడానికి మరియు ప్రోత్సహించడానికి ఇది రూపొందించబడింది.

 

ఎంఒయు నిబంధనల ప్రకారం, ఐఐసిఎ మరియు ఎఫ్‌ఎస్‌ఆర్ గ్లోబల్ సంయుక్తంగా విద్యుత్ రంగంలోని వివిధ కోణాల్లో సామర్థ్య-నిర్మాణం, పరిశోధన మరియు సలహా సేవలను అందిస్తాయి.

 

ఐఐసిఎ గురించి

 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసిఎ) అనేది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం సీ ఏ), భారత ప్రభుత్వం ద్వారా స్థాపించబడిన ఒక స్వయంప్రతిపత్త సంస్థగా మేధో వేదిక భారతదేశంలో సమగ్ర మరియు బహుళవిధానం ద్వారా కార్పొరేట్ రంగం వృద్ధికి తోడ్పాటునిచ్చే అత్యుత్తమ కేంద్రం.

 

ఎఫ్ ఎస్ ఆర్  గ్లోబల్ గురించి

 

ఎఫ్ ఎస్ ఆర్  గ్లోబల్ అనేది దక్షిణాది ప్రపంచం పై దృష్టి సారించిన ఒక స్వతంత్ర మరియు తటస్థ రెగ్యులేటరీ వేదిక. ఎఫ్ ఎస్ ఆర్  గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఇంధన వాటాదారులతో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది, ఇది మౌలిక సదపాయాల అవస్థాపన నియంత్రణ నాణ్యత విధానాన్ని అందుబాటు మరియు వినియోగించగల జ్ఞానాన్ని సహ-సృష్టించడం ద్వారా మెరుగుపరుస్తుంది.

 

***



(Release ID: 1975770) Visitor Counter : 42