సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలోని రవీంద్రభవన్లో ఎగ్జిబిషన్లను ప్రారంభించనున్న ప్రముఖ ఆర్టిస్ట్ జతిన్ దాస్
Posted On:
07 NOV 2023 5:44PM by PIB Hyderabad
లలిత కళా అకాడమీ, భారత ప్రభుత్వ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతస్థాయి సంస్థ. ఈ సంస్థ రెండు ఎగ్జిబిషన్లను న్యూఢల్లీిలోని రవీంద్రభవన్‌లోని ఎల్.కె.ఎ గ్యాలరీలలో నవంబర్ 8వ తేదీ 2023 న నిర్వహిస్తోంది. ఈ రెండు ఎగ్జిబిషన్ల పేర్లు ‘ఇమేజింగ్ ది ఇమిడియెట్`క్యూరేటింగ్ ఫ్రం నేషనల్ కలక్షన్ , మరొకటి, ఆఫ్ఘన్ జర్నల్. ఈ రెండిరటినీ అకాడమీ అసిస్టెంట్ ఎడిటర్ ప్రముఖ క్యూరేటర్, కళా చరిత్రకారుడు, జానీ ఎం.ఎల్ క్యూరేటింగ్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్లను ప్రముఖ ఆర్టిస్ట్ శ్రీ జతిన్ దాస్ ఆవిష్కరిస్తారు. అకాడమీ ఛైర్మన్ ప్రొఫెసర్‌వి. నాగదాసన్ సమక్షంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.
ఇమేజింగ్ ది ఇమిడియెట్, క్యూరేటింగ్ ఫ్రం ఎ నేషనల్ కలక్షన్‌అనే ఈ శీర్షికను బట్టి, లలితకళా అకాడమీకి చెందిన 7000కు పైగా ఆర్ట్ వర్క్‌ల నుంచి ఎంపిక చేసిన కలక్షన్‌ను ఇక్కడ ప్రదర్శనకుపెడుతున్నారు.
క్యూరేటర్ ఎంపిక చేసిన 70 ఆర్ట్‌వర్క్‌లు , ఆధునిక, అత్యాధునిక కళాకారులకు సంబంధించిన కళారూపాలు ఇందులో ఉన్నాయి. ఈ ఆర్ట్‌వర్క్‌లలో ఉన్న ప్రత్యేకతలను బట్టి వీటిని ఎంపిక చేశారు. వారి పేరును బట్టి కాక ఆ కళారూపాలలో ని వైవిధ్యతను ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని వీటిని ఎంపిక చేశారు. జాతీయస్థాయి కలెక్షన్ ప్రాధాన్యతను ఈ ఎగ్జిబిషన్ తెలియజేస్తోంది.
ఇక ఆఫ్ఘన్‌జర్నల్‌లో పదహారు పెయింటింగ్స్ ఉన్నాయి. వీటిని యువ మారిషస్ ఆర్టిస్ట్ అక్షయ్ సీబాలుక్ రూపొందించినవి. వీరు ప్రపంచమంతా తిరుగుతూ పెయింటింగ్స్ వేస్తారు. వీరు ఆఫ్ఘనిస్థాన్ వెళ్లినపుడు వేసిన పెయింటింగ్స్ ఇవి. ప్రజల ఆకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా ఒకే రీతిన ఉంటాయని, సామాన్య ప్రజల మధ్య అనుబంధాలు ఒకే రీతిన ఉంటాయని, వీరికి అధికారం, ఆధిక్యత వంటివి ఏమీ తెలియవని ఆయన పెయింటింగ్స్ తెలియజేస్తాయి. ఆఫ్ఘనిస్థాన్ గురించి మనకు తెలియని కోణాన్ని ఈ పెయింటింగ్స్ సరికొత్తగా ఆవిష్కరిస్తాయి.
లలిత కళా అకాడమీ ఛైర్మన్ ప్రొఫెసర్ వి.నాగదాస్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ, ఇలాంటి ప్రాజెక్టులను అకాడమీ చేపపట్టడానికి కారణం, ఆర్ట్‌వర్క్‌లకు సంబంధించి నూతన దృక్కోణాన్ని, నూతన అర్థాలను తెలియజేయడం తమ బాధ్యతగా భావించడమే నని తెలిపారు. జాతీయ స్థాయిలో సేకరించిన కళాఖండాలను ఎప్పటికప్పుడు పున: సమీక్ష చేయవలసి ఉందని తెలిపారు. ఆర్ట్‌వర్క్‌లు ఏవీ స్థిరమైనవి కావని, ఇవి ఎప్పటికప్పుడు కాలగమనంలో కొత్త ఆలోచనలను, కొత్త అర్థాలను ఇస్తాయని ఆయన తెలిపారు. వివిధ విభాగాల క్యూరేటర్లతో సంప్రదింపులు జరిపే దీర్ఘకాలిక ఆలోచన తమకు ఉన్నదని ఆయనతెలిపారు. ఈ ఎగ్జిబిషన్లు 2023 నవంబర్ 28 వరకు కొనసాగుతాయి.
***
(Release ID: 1975768)
Visitor Counter : 69