గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పారిశుధ్య రంగంలో ఆరోగ్యం మరియు క్షేమం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం నిర్వహించిన - 7వ విడత వెబినార్ చర్చల పరంపర
Posted On:
07 NOV 2023 5:30PM by PIB Hyderabad
పండుగ సందడి నెలకొనడంతో వాతావరణం ఉత్సాహం, వేడుకలతో నిండిపోయింది. తమ తమ ఇళ్లను, వీధులను, పరిసరాలను, మార్కెట్లను శుభ్రం చేసి అందంగా దీప కాంతులతో అలంకరించుకున్న వారందరూ దీపావళి ని ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా స్వాగతిస్తున్నారు. సంవత్సరంలో ఈ సమయం కూడా స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఇది కేవలం గృహాలలో మాత్రమే కాకుండా, ఎక్కువ జన సంచారానికి అవకాశమున్న బహిరంగ ప్రదేశాల్లో కూడా. పౌరులు తమ పరిసరాల్లో పరిశుభ్రత తో పాటు, పారిశుద్ధ్యాన్ని కాపాడుకోవడంలో పాల్గొంటున్నారు, పండుగను మరింత ప్రత్యేకంగా, అర్థవంతంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం; వ్యర్థాలను భారీగా తొలగించడం, పారిశుద్ధ్యం, వ్యర్థాల రంగాన్ని సమర్ధంగా నిర్వహించడం వంటి బాధ్యతలు ఫ్రంట్-లైనర్లపై కూడా ఉంటాయి.
స్వచ్ఛత కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకు వెళుతూ, స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూలమైన దీపావళిని జరుపుకునే సామూహిక బాధ్యత యొక్క భావాన్ని కలిగించడానికి, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.హెచ్.యు.ఏ) స్వచ్ఛ దీపావళి శుభ దీపావళి ప్రచారాన్ని ప్రారంభించింది, స్థానిక ఉత్పత్తులను ఉపయోగించడం తో పాటు, ఆర్.ఆర్.ఆర్. కేంద్రాల్లో పాత వస్తువులు, ఉపయోగించని వస్తువులను ఇతరులకు దానం చేయాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. పండుగ సీజన్ లో పారిశుధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో ఆరోగ్యం, భద్రత అంశాలను పరిష్కరించడం కూడా దీని లక్ష్యం. వీధులను శుభ్రపరిచే సమయాలను తెల్లవారుజామునకు మార్చేలా పౌరులు, స్థానిక సంస్థలు, ఆర్.డబ్ల్యూ.ఏ. లు, వర్తక సంఘాలు, స్వయం సహాయక బృందాలు, ప్రభుత్వేతర స్వచ్చంధ సంస్థలు, కార్యాలయ సముదాయాలు, పాఠశాలలు, సంస్థలు చూడాలి. ఎప్పుడూ కాలుష్యం తో పాటు రద్దీగా ఉండే మార్కెట్లు, వీధుల్లో ఆ సమయంలో కాలుష్యం తో పాటు, రాకపోకల రద్దీ కూడా తక్కువగా ఉంటుంది. ధూళిని అరికట్టడానికి నీటిని పొగమంచు, తుంపర్లు గా చిలకరించే కార్యకలాపాలు తరచుగా చేయాలి. ముఖానికి తగిన మాస్క్‌లు, కళ్ళకు రక్షణ కల్పించే అద్దాలతో పాటు, ఇతర భద్రతా పరికరాలు, సామాగ్రిని స్థానిక సంస్థల ద్వారా పంపిణీ చేయాలి.
ఈ ప్రచారంలో భాగంగా, అదేవిధంగా, రాబోయే పండుగ సీజన్ లో భాగంగా, ఎం.ఓ.హెచ్.యు.ఏ. స్వచ్ఛ చర్చల వెబినార్ సిరీస్ యొక్క 7వ ఎడిషన్ ను 'పారిశుధ్యం, వ్యర్ధాల నిర్వహణ రంగంలో ఆరోగ్యం మరియు సంరక్షణ' అనే అంశంపై నిర్వహించడం జరిగింది. ఎం.ఓ.హెచ్.యు.ఏ. కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి; ఎస్.బి.ఎం-యు, జె.ఎస్. & ఎం.డి. శ్రీమతి రూపా మిశ్రా అధ్యక్షతన జరిగిన 7వ విడత చర్చా కార్యక్రమం పారిశుద్ధ్య రంగంలో ఆరోగ్యం, సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను ప్రముఖంగా పేర్కొంది. ఈ కార్యక్రమంలో మెడంటలోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ & రెస్పిరేటరీ & స్లీప్ మెడిసిన్ చైర్మన్, పద్మశ్రీ డా.రణ్‌దీప్ గులేరియా ప్రసంగించారు. వాయు కాలుష్యానికి గురైనప్పుడు శ్రామికశక్తి అనుసరించి, ఆచరించడానికి అవసరమైన ఎస్.ఓ.పి. లు మరియు ప్రోటో కాల్ ను రూపొందించాలని డాక్టర్ గులేరియా సూచించారు.
ఈ సదస్సులో పద్మశ్రీ అవార్డు గ్రహీత మాట్లాడుతూ, ఉపశమన చర్యల ఆవశ్యకత, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయవలసిన అవసరంపై దృష్టి సారించారు. తక్షణ చర్యల అవసరాన్ని ఎత్తిచూపుతూ, బాణసంచా వాడకాన్ని అరికట్టడం, కళ్ళకు రక్షణనిచ్చే అద్దాలు, ఇతర భద్రతా పరికరాలు, ఎన్95 మాస్కులు, టోపీలు ధరించడం, నేరుగా కాలుష్యానికి గురయ్యే పరిస్థితులను తగ్గించడం, మనుషులతో ఊడ్పించడానికి బదులుగా కనిపించే వ్యర్థాలను సేకరించడం, పారిశుద్ధ్యం / బయట పనిచేసే కార్మికుల కోసం కాలుష్య నివారణ వంటి వృత్తి పరమైన ఆరోగ్య, భద్రతా చర్యల గురించి డాక్టర్ గలేరియా నొక్కి చెప్పారు. చింతన్ పర్యావరణ పరిశోధన, కార్యాచరణ బృందం వ్యవస్థాపకులు, డైరెక్టర్ శ్రీమతి భారతీ చతుర్వేది "నాణ్యత లేని - మూడు వృత్తులపై వాయు కాలుష్యం యొక్క ప్రభావం' అనే అధ్యయనం యొక్క ఫలితాలను తెలియజేశారు. చెత్త ఏరుకునే వారు, సఫాయిమిత్రలు, సెక్యూరిటీ గార్డ్ లపై పేలవమైన గాలి నాణ్యత వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలను ఆమె ప్రముఖంగా తెలియజేస్తూ, అనుసరించాల్సిన ప్రోటోకాల్ గురించి చర్చించారు. ఆహారానికీ, ఆరోగ్యానికి, శుభ్రం చేసుకోడాన్ని అనుసంధానం చేయడం ఎంత క్లిష్టమైనదో అనే విషయమై, ప్రజారోగ్య నిపుణురాలు, పర్యావరణ వేత్త పద్మశ్రీ డాక్టర్ ఇందిరా చక్రవర్తి, తన పరిశీలనలను విశదపరిచారు. వీధుల్లో లభించే ఆహారం వల్ల కలిగే కాలుష్యం గురించి కూడా ఆమె వివరంగా తెలియజేశారు. ఆహార రంగంలో చెత్త నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం తో పాటు, ఆరోగ్యం, పరిశుభ్రతను క్రమబద్ధీకరించడం కూడా ఎంత ముఖ్యమో ఆమె ప్రముఖంగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎం.ఓ.హెచ్.యు.ఏ. కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి మాట్లాడుతూ, ప్రమాదకర వాయు కాలుష్యం సమయంలో పాటించాల్సిన ఎస్.ఓ.పి. లు మరియు ప్రోటోకాల్ పై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికులు, ముఖ్యంగా వ్యర్థ పదార్థాల నిర్వహణ విభాగంలో భద్రత, రక్షణ పరికరాలను ఉపయోగించడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. కలుషిత గాలికి గురైన టాస్క్‌ఫోర్స్ నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు నగరాలు నిర్ధారించు కోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర, నగర అధికారులు, ఈ రంగానికి చెందిన భాగస్వాములు, ఈ రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలతో పాటు, పారిశుద్ధ్య కార్మికుల ప్రతినిధులు పాల్గొన్నారు. నగరాలతో ఒక పరస్పర సంభాషణలతో ఈ స్వచ్ఛ చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా వారు ఆరోగ్యం, సంరక్షణ కు సంబంధించిన తమ అనుభవాలు, సవాళ్లను పంచుకున్నారు.
***
(Release ID: 1975532)
Visitor Counter : 54