ఆయుష్

మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా లో అదనపు యోగా చికిత్స గదుల ప్రారంభోత్సవంతో తన వైద్య సేవలను విస్తరించింది


యోగా చికిత్స ప్రయోజనాలను కోరుకునే వ్యక్తులకు అందుబాటులో ఉండే విధంగా మరియు సంపూర్ణమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం ఆయుష్ మంత్రిత్వ శాఖ లక్ష్యం.

Posted On: 07 NOV 2023 5:13PM by PIB Hyderabad

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో యోగా చికిత్సని ఏకీకృతం చేయడంలో గణనీయమైన సేవలందిస్తున్న  న్యూ ఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎం డీ ఎన్ ఐ వై) ప్రాంగణంలో కేంద్ర ఆయుష్ మరియు ఓడరేవులు, షిప్పింగ్, & జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు అదనపు యోగా చికిత్స గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం యోగా  ప్రచారం  మరియు సంపూర్ణ శ్రేయస్సు కోసం ఇన్స్టిట్యూట్ యొక్క అంకితభావాన్ని సూచిస్తుంది.

 

ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, స్వీయ-అవగాహన, స్వీయ-చైతన్యం మరియు మొత్తం సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించే సాధనంగా రోజువారీ జీవనశైలిలో యోగా చికిత్స ని తప్పనిసరిగా చేర్చడాన్ని శ్రీ సోనోవాల్ హైలైట్ చేశారు. వెయ్యి సంవత్సరాల క్రితం భారతదేశం అభివృద్ధి చేసిన ఈ ప్రాచీన జ్ఞానాన్ని ప్రపంచంలోని అందరితో పంచుకోవాలని, ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.

 

“మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. ఈ సంస్థను సందర్శించే వ్యక్తుల సంఖ్య దాని విశ్వసనీయత, శిక్షణ, చికిత్స, పరిశోధన మరియు శ్రేష్ఠతకు నిదర్శనం. ‘భారతదేశంలో వైద్యం’ అనేది ప్రమాణంగా మారే భవిష్యత్తును నేను ఊహించాను, మరియు భారతదేశం తన వనరులను మరియు నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా విస్తరింపజేస్తుంది,” అన్నారాయన.

 

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ రవీంద్ర కుమార్ నుండి భారత మాజీ ప్రధాని శ్రీ మొరార్జీ భాయ్ దేశాయ్ చేతితో రాసిన లేఖలను మంత్రి అందుకున్నప్పుడు ఈ సంఘటన చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆయన మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్, మొరార్జీ దేశాయ్‌తో చాలా కాలం పాటు అనుబంధం కలిగి ఉన్నారు.

 

మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగాలో అదనపు యోగా చికిత్స గదుల ఏర్పాటు, యోగా చికిత్స ప్రయోజనాలను కోరుకునే వ్యక్తులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలను తక్షణమే అందుబాటులో ఉంచే దిశగా ఒక ముందడుగును సూచిస్తుంది. ఈ సంస్థ చాలా కాలంగా యోగా ఆధారిత చికిత్సా విద్య, శిక్షణ మరియు పరిశోధన రంగంలో దీపధారి గా ఉంది మరియు చికిత్స గదుల జోడింపు యోగా చికిత్స కి మరో కోణాన్ని జోడిస్తుందని భావిస్తున్నారు.

 

మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా డైరెక్టర్ శ్రీ విక్రమ్ సింగ్, యోగా ఆరోగ్య శ్రేయస్సు రంగంలో ఎం డీ ఎన్ ఐ వై  ఇటీవల సంస్థ చేపడుతున్న   వివిధ కార్యక్రమాలను వివరించారు. యోగాకు ఆయన ఇస్తున్న అచంచలమైన  మద్దతుకు మరియు ఎం డీ ఎన్ ఐ వై విద్యార్థుల పట్ల ఆయన చూపిన దృక్పథానికి గౌరవ మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ ఎం డీ ఎన్ ఐ వై, గౌరవ భారత మాజీ ప్రధాని మొరార్జీ భాయ్ దేశాయ్ లేఖల నిధిని ఎం డీ ఎన్ ఐ వై కి పంచుకున్నందుకు డాక్టర్ రవీంద్ర కుమార్ పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

 

ముగింపులో, మంత్రి ఎం డీ ఎన్ ఐ వై విద్యార్థులతో సంభాషించారు మరియు వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

 

***



(Release ID: 1975528) Visitor Counter : 46


Read this release in: English , Urdu , Hindi , Tamil