రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
నెదర్లాండ్స్‌లో జరుగుతున్న రెండవ ప్రపంచ స్థానిక ఉత్పత్తి వేదికలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా నేతృత్వంలో పాల్గొన్న భారత ప్రతినిధి బృందం
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ అందించడంలో నాణ్యమైన, నమ్మదగిన ఔషధాలు సరఫరా చేస్తూ
భారతీయ ఫార్మాస్యూటికల్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.. శ్రీ భగవంత్ ఖూబా
Posted On:
07 NOV 2023 12:10PM by PIB Hyderabad
నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఈరోజుజరిగిన రెండవ ప్రపంచ స్థానిక ఉత్పత్తి వేదిక సమావేశంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం పాల్గొంది. .నవంబర్ 6న ప్రారంభమైన సమావేశం 8 వరకు జరుగుతుంది. ఔషధాలు ఇతర ఆరోగ్య సాంకేతికత అంశాలకు తగిన ప్రచారం కల్పించడానికి . ప్రపంచ స్థానిక ఉత్పత్తి వేదికని ప్రపంచ ఆరోగ్య సంస్థ నెలకొల్పింది.
రోగ నిర్ధారణ చర్యల అభివృద్ధి , తయారీలో అనుభవాలు, సవాళ్లు, విజయాలు పంచుకోవడానికి ఈ సమావేశం కీలకమైన అవకాశాన్ని కల్పిస్తుందని శ్రీ ఖూబా తన ప్రసంగంలో తెలిపారు. సంక్లిష్ట పరికరాల తయారీ అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా వినూత్న విధానాలను గుర్తించడానికి ప్రపంచ దేశాల మధ్య మరింతసహకారం అవసరమని ఆయన అన్నారు.
21వ శతాబ్దంలో తరచుగా అంటువ్యాధులు, కోవిడ్-19 వంటి మహమ్మారి వ్యాపిస్తున్నాయని శ్రీ భగవంత్ ఖుబా అన్నారు. పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ అందుబాటులో లేకపోవడం, సరఫరా వ్యవస్థలో ఉన్న లోపల వల్ల అంటువ్యాధులు, కోవిడ్-19 వంటి మహమ్మారి లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆయన పేర్కొన్నారు.వ్యాధులు ప్రబలినప్పుడు తగిన వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు లేకపోవడం కూడా సమస్యగా మారిందన్నారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రపంచవ్యాప్తంగా రోగ నిర్ధారణ సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి దేశాల మధ్య సహకారం అవసరమని మంత్రి స్పష్టం చేశారు. వినూత్న విధానాల ద్వారా రోగ నిర్ధారణ సౌకర్యాలు అభివృద్ధి చేసేందుకు బహుళ రంగాల మధ్య సహకారం అవసరమని ప్రపంచ దేశాలు గ్రహించాయని ఆయన అన్నారు.
భారతదేశ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ సాధించిన అభివృద్ధిని శ్రీ భగవంత్ ఖూబా సమావేశానికి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఫార్మా రంగంగా భారత ఫార్మాస్యూటికల్ రంగం గుర్తింపు పొందిందని శ్రీ ఖుబా తెలియజేసారు, భారతదేశానికి 'ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్' గా గుర్తింపు లభించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ అందించడంలో నాణ్యమైన, నమ్మదగిన ఔషధాలు సరఫరా చేస్తూ భారతీయ ఫార్మాస్యూటికల్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి వివరించారు.
ప్రపంచ వ్యాక్సిన్ అవసరాల్లో దాదాపు 60% అవసరాలను భారతదేశం తీరుస్తున్నదని అన్నారు.దాదాపు 200 దేశాలకు భారతదేశం ఔషదాలు ఎగుమతి చేస్తోంది అని తెలిపిన మంత్రి జెనరిక్ ఎగుమతుల రంగంగంలో భారత్ వాటా 20నుంచి 22% వరకు ఉందన్నారు.వినూత్న విధానాల్లో పని చేస్తున్న అనేక భారత సంస్థలు నూతన ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తూ ఆరోగ్య రంగం అభివృద్ధికి సహకారం అందిస్తున్నాయని మంత్రి తెలిపారు.
ఫార్మా రంగం అభివృద్ధికి అవసరమైన నిధులు,మార్గదర్శకత్వం, ఇంక్యుబేషన్ స్పేస్ మొదలైన సౌకర్యాలను ప్రభుత్వం అందజేస్తోంది అని అన్నారు.ఆవిష్కరణలు వాణిజ్యపరంగా విజయం సాధించేందుకు చారలు అమలు చేస్తున్న ప్రభుత్వం విద్యాసంస్థలు పరిశ్రమల మధ్య వారధిగా పనిచేస్తుందని మంత్రి చెప్పారు.
“ పరిశోధనలు కార్యరూపం దాల్చి ఉత్పత్తి ప్రారంభించే అంశంలో ప్రస్తుతం స్థానిక ఉత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటోంది, సాంకేతిక బదిలీ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. . ధృవీకరణ, ఉత్పత్తి, పంపిణీ అంశాలలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. వినూత్న ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సమర్థవంతమైన సమన్వయం అవసరం. నియంత్రణ వ్యవస్థ సామర్థ్య పెంపుదల, నైపుణ్యం కలిగిన సాంకేతిక మానవ వనరులు అవసరం అవుతాయి. మార్కెటింగ్, ప్రాంతీయ తయారీని పెంచడం, సమర్ధవంతమైన సేకరణ సరఫరా, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతమైన సమన్వయం కోసం ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే అంశంపై దృష్టి పెట్టాలి. ఆవిష్కరణల ప్రయోజనాలు అవసరమైన వారికి చేరేలా చూసి అవసరమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రపంచ స్థానిక ఉత్పత్తి వేదిక ద్వారా కృషి జరగాలి" అని మంత్రి అన్నారు.
తన పర్యటనలో భాగంగా శ్రీ ఖుబా సురినామ్ ప్రజారోగ్య శాఖ మంత్రి డాక్టర్ అమర్ ఎన్. రామధిన్‌తో సమావేశమై నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అంశంపై చర్చించారు. ఐండ్‌హోవెన్ లో జరుగుతున్న శ్రీగంధ హాలండ్ కన్నడ బలగా కన్నడ రాజ్యోత్సవ 2023 వేడుకల్లో శ్రీ భగవంత్ ఖూబా పాల్గొన్నారు.
***
(Release ID: 1975523)
Visitor Counter : 59