రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
"రసాయన పరిశ్రమ సుస్థిర అభివృద్ధి, సమగ్ర వ్యాపార వ్యూహం- సవాళ్లు, అవకాశాలు " అనే అంశంపై రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం ఆధ్వర్యంలో సదస్సు
प्रविष्टि तिथि:
02 NOV 2023 4:47PM by PIB Hyderabad
"రసాయన పరిశ్రమ సుస్థిర అభివృద్ధి, సమగ్ర వ్యాపార వ్యూహం- సవాళ్లు, అవకాశాలు " అనే అంశంపై రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల సదస్సు ప్రారంభమయింది. ఇండియన్ కెమికల్ కౌన్సిల్ సహకారంతో రసాయనాలు , పెట్రోకెమికల్స్ శాఖ నిర్వహించిన సదస్సులో కేంద్ర రసాయనాలు,ఎరువులు, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా, ఒడిశా పరిశ్రమలు, ఇంధనం,ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి శ్రీ ప్రతాప్ కేశరీ దేబ్, రసాయనాలు, పెట్రోకెమికల్స్ శాఖ కార్యదర్శి శ్రీమతి నివేదిత శుక్లా వర్మ, ఇండియన్ కెమికల్ కౌన్సిల్ అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.
సదస్సులో ప్రసంగించిన శ్రీ భగవంత్ ఖూబా దేశ ఆర్థిక వ్యవస్థలో రసాయన, పెట్రో కెమికల్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.వివిధ రంగాలకు అవసరమైన 80000 పైగా వాణిజ్య ఉత్పత్తులు రసాయన, పెట్రో కెమికల్ రంగం నుంచి అందుతున్నాయని అన్నారు. దిగుమతులు తగ్గించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, వ్యాపార అవకాశాలు ఎక్కువ చేయడానికి ప్రభుత్వం చర్యలు అమలు చేస్తోందని మంత్రి అన్నారు. సుస్థిర అభివృద్ధి సాధించే అంశంపై రసాయన, పెట్రో కెమికల్ రంగం దృష్టి సారించాలని ఆయన అన్నారు. రసాయన, పెట్రో కెమికల్ రంగం సాగిస్తున్న కార్యకలాపాల ప్రస్తుత విలువ సుమారు USD 215 బిలియన్ల వరకు ఉందని తెలిపిన మంత్రి 2025 నాటికి వ్యాపారం USD 300 బిలియన్లకు చేరుతుందని భావిస్తున్నామని అన్నారు.సుస్థిర అభివృద్ధి సాధించే విధంగా పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు.
రసాయన రంగం నిలకడగా వృద్ధి చెందాలని, కర్బన ఉద్గారాలను తగ్గించాలని,పర్యావరణ పరిరక్షణకు సహకారం అందించాలని శ్రీ ఖుబా అన్నారు. పరిశ్రమ వృద్ధిని కొనసాగించి భారత ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కెమికల్స్, పెట్రోకెమికల్స్ శాఖ కార్యదర్శి శ్రీమతి నివేదిత శుక్లా వర్మ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ లక్ష్యంతో ప్రభుత్వం 'హోల్ ఆఫ్ గవర్నమెంట్' విధానంతో రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగాన్ని అభివృద్ధి కోసం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. రసాయన పరిశ్రమలో సులభతర వ్యాపార నిర్వహణకు చర్యలు అమలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. ప్రపంచంలో సురక్షితమైన,విశ్వసనీయమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దేశంలో రసాయన రంగం విస్తరణకు అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. రసాయన, పెట్రోకెమికల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం సరైన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. 2021-22లో రసాయన రంగంలో ఎఫ్‌డిఐలో 90% వృద్ధి నమోదు చేసిందని అన్నారు.
రసాయన పరిశ్రమ సమగ్ర అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా సదస్సు ఏర్పాటు చేశారు. పెట్రోకెమికల్స్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఎన్విరాన్‌మెంట్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (ERM)సదస్సు నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తోంది.
వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించడానికి, కార్బన పాదముద్రలను తగ్గించడానికి, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ఎక్కువ చేసి స్థిరమైన కార్పొరేట్ విధానాలు అమలు చేసి అంతర్జాతీయ ప్రమాణాలు సాధించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి సాధన లక్ష్యంగా జరుగుతున్న ఐసీసీ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల సదస్సులో అభివృద్ధి వ్యూహాలు, డీ-అర్బనైజేషన్, నెట్-జీరో ట్రాన్సిషన్, డిజిటల్ వంటి సమస్యలు, అభివృద్ధి అవకాశాలపై సదస్సులో చర్చలు జరుగుతాయి. జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలు, ప్రభుత్వ అధికారులు, బహుపాక్షిక సంస్థలు, నిపుణులు సదస్సులో పాల్గొంటారు.
***
(रिलीज़ आईडी: 1974337)
आगंतुक पटल : 113