వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
భారత్ అధ్యక్షతన 'జీ20 స్టాండర్డ్స్ డైలాగ్' ప్రారంభం
మెరుగైన భవిష్యత్తు కోసం ప్రపంచానికి మార్గనిర్దేశం చేయడానికి 'జీ 20 స్టాండర్డ్స్ డైలాగ్' : అశ్విని కుమార్ చౌబే
Posted On:
02 NOV 2023 8:27PM by PIB Hyderabad
భారత జీ20 అధ్యక్షతన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ( బి ఐఎస్) జి 20 స్టాండర్డ్స్ డైలాగ్ 2023కు ఆతిథ్యం ఇస్తోంది. న్యూఢిల్లీలోని ప్రఖ్యాత భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో జి 20 స్టాండర్డ్స్ డైలాగ్ 2023 ను నిర్వహిస్తున్నారు.
మంత్రి అశ్విని కుమార్ చౌబే ప్రారంభోపన్యాసం చేస్తూ, "ఈ జి 20 స్టాండర్డ్స్ డైలాగ్ థీమ్ 'జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్'. ఇది ప్రపంచ సమాజానికి అత్యంత సముచితమైన అత్యంత క్లిష్టమైన ప్రాంతం అని నేను భావిస్తున్నాను. ఇది వినియోగదారుల కేంద్రీకృత కార్యక్రమం కాబట్టి ప్రపంచం నలుమూలల నుండి మాకు భాగస్వామ్యం ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను .మన సుస్థిర భవిష్యత్తు కోసం వనరులను ఉత్తమంగా ఉపయోగించడానికి ఈ సంభాషణ ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తుంది” అన్నారు.
“నేటి ప్రపంచానికి ప్రమాణాలు చాలా కీలకం. అంతర్జాతీయ భాగస్వాముల మధ్య చర్చలు ప్రామాణికీకరణ భవిష్యత్తును నిర్వచిస్తాయి. మంత్రి అన్నారు. బిఐఎస్ ను చూసి గర్విస్తున్నాం ముఖ్యంగా బి ఐ ఎస్ ను భవిష్యత్ ఆధారిత సంస్థగా తీర్చిదిద్దినందుకు కష్టపడి పని చేసిన డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీని చూసి గర్విస్తున్నాం” అన్నారు.
భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ కీలకోపన్యాసం చేస్తూ, మన జీవితాల్లో ప్రమాణాలు పోషించే ముఖ్యమైన పాత్ర, నాణ్యతను నిర్ధారించడం , ప్రపంచ వాణిజ్యాన్ని సులభతరం చేయడం గురించి ప్రస్తావించారు. అంతేకాక, ప్రమాణాలు మన సమిష్టి భవిష్యత్తు కోసం సృజనాత్మకత, సుస్థిరత , సమ్మిళితతకు మార్గనిర్దేశం చేస్తాయని కార్యదర్శి పేర్కొన్నారు.
భారత వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ బర్త్వాల్, ప్రమాణాల ప్రాముఖ్యతను , వివిధ దేశాలు తమ స్వంత ప్రమాణాలను ఎలా ఏర్పాటు చేసుకుంటాయో వివరించారు. నాణ్యత, విశ్వసనీయతను నిర్ధారించడానికి సంకల్పం , స్థిరమైన ప్రయత్నాల ద్వారా ప్రమాణాలను సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) సెక్రటరీ జనరల్ సెర్గియో ముజికా వర్చువల్ మోడ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రామాణీకరణ ప్రాముఖ్యతను, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ప్రపంచ సామర్థ్యాలను వివరించారు. ప్రమాణాలు ప్రపంచ సమాజానికి, వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు.
ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ (ఐఇసి) సెక్రటరీ జనరల్ , సిఇఒ ఫిలిప్ మెట్జ్గర్ ఐఇసి పాత్రను , ప్రమాణాలను నెలకొల్పడం, నిలబెట్టడంలో ఐఇసి పాత్రను, అవిశ్రాంత కృషిని వివరించారు. ఈ ప్రామాణిక కొలమానాలు మన దైనందిన జీవితంలోని వివిధ అంశాలను రూపొందించడంలో, నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
బిఐఎస్ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రమోద్ కుమార్ తివారీ, జి 20 స్టాండర్డ్స్ డైలాగ్ కాన్సెప్ట్ గురించి వివరించారు. నిర్మాణాత్మక చర్చలను సులభతరం చేయడంలో, విలువైన అంతర్దృష్టులను పొందడంలో , భవిష్యత్తు సవాళ్లను పరిష్కరించడంలో ప్రామాణికీకరణ సామర్థ్యాన్ని వివరించారు.
'జీరో డిఫెక్ట్ అండ్ జీరో ఎఫెక్ట్' అనే విస్తృత దార్శనికతకు అనుగుణంగా మరింత సుస్థిర, సమ్మిళిత, నియంత్రిత భవిష్యత్తు దిశగా మార్గాన్ని రూపొందించడానికి ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ (ఐఇసి), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఒ), ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటియు) లతో కూడిన ప్రపంచ ప్రమాణాల సహకారంతో జి 20 సభ్య దేశాలను ఈ చర్చలు భాగస్వాములను చేస్తున్నాయి.”
బిఐఎస్ ప్రకారం, పరిశ్రమ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రమాణాల నిపుణులు, నియంత్రణదారులు , విధాన రూపకర్తలకు ప్రామాణికీకరణ , ప్రపంచ నియంత్రణ వాతావరణంలో పురోగతిని పెంపొందించడానికి ఈ సంభాషణ ఒక వేదికను అందిస్తుంది. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే జీ20 విజన్ కు అనుగుణంగా, ఈ విజన్ ను సాకారం చేయడానికి ప్రమాణాల పునాదిని ఏర్పాటు చేయడానికి ఇది ప్రయత్నిస్తుంది. సుస్థిరత, రెగ్యులేటరీ ఎక్సలెన్స్ , వాటాదారుల భాగస్వామ్యం పై బలమైన దృష్టితో, ఈ కార్యక్రమం రేపటి ప్రమాణాలను రూపొందించడానికి సిద్ధంగా ఉంది.
చర్చల ప్రారంభ రోజున భారత ప్రభుత్వం, వరల్డ్ స్టాండర్డ్స్ కోఆపరేషన్ కు చెందిన ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. తరువాత సుస్థిరత కోసం ప్రమాణాలపై సెషన్ జరిగింది. నవంబర్ 3, శుక్రవారం, సాంకేతిక నిబంధనలు , మంచి నియంత్రణ పద్ధతులు, అలాగే స్టాండర్డైజేషన్ కోసం వాటాదారుల భాగస్వామ్యం పై సెషన్లు ఉంటాయి, ఇవన్నీ ప్రామాణికీకరణ ప్రక్రియలో స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం , సమ్మిళిత సహకారాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించినవి.
నవంబర్ 3న గౌరవ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, జౌళి శాఖ మంత్రి, జీ20 నేషనల్ స్టాండర్డ్స్ బాడీస్ సభ్యులు, ఆహ్వానిత ప్రతినిధుల ప్రసంగాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
***
(Release ID: 1974323)
Visitor Counter : 100