నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

‘ఇండియా-ఏయూ సహకారంతో మెరుగైన సమ్మిళిత ప్రపంచం’పై వర్క్‌షాప్‌ని నిర్వహించిన నీతి ఆయోగ్


సమ్మిళిత వృద్ధి, సుస్థిర మౌలిక సదుపాయాలు మరియు వలస నిర్వహణ వంటి కీలక రంగాలలో సహకారంపై చర్చ

ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ థింక్ ట్యాంక్‌లు, అకాడెమియా మరియు దౌత్యవేత్తల నుండి 50 మంది నిపుణులు పాల్గొన్నారు

Posted On: 01 NOV 2023 8:19PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో నీతి ఆయోగ్ ఈరోజు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) భాగస్వామ్యంతో భారతదేశం-ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) సహకారం కోసం మెరుగైన సమ్మిళిత ప్రపంచంపై వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఇటీవల ముగిసిన జీ20 కాన్ఫరెన్స్‌పై సంతకం చేసిన న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ (ఎన్‌డిఎల్‌డి)లో నిర్దేశించిన కట్టుబాట్లను అమలు చేయడంపై వర్క్‌షాప్ దృష్టి సారించింది.

నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సరస్వత్ ఈ సందర్భంగా భారత్-ఏయూ సహకారం యొక్క వివిధ అంశాలను విశ్లేషించారు. భారతదేశం మరియు ఏయూ విజ్ఞానం, నైపుణ్యాలు మరియు వనరుల పరంగా ఒకదానికొకటి అందించడానికి చాలా ఉన్నాయని అన్నారు. సమ్మిళిత వృద్ధి, స్థిరమైన మౌలిక సదుపాయాలు మరియు వలస నిర్వహణ అనే మూడు కీలక రంగాలలో సహకారం కోసం కాంక్రీట్ ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆయన కోరారు.

నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ వ్యవసాయ వృద్ధి యొక్క ప్రాముఖ్యత మరియు రెండు ప్రాంతాల మధ్య పరస్పర అభ్యాస సంభావ్యత గురించి మాట్లాడారు. వ్యవసాయం మరియు వ్యాపారంలో భారత్  మరియు ఏయూ ఒకరి అనుభవాల నుండి మరొకరు నేర్చుకోవచ్చు అని ఆయన అన్నారు. వ్యవసాయ పరిశోధన, సాంకేతికత బదిలీ, మార్కెట్ యాక్సెస్ వంటి రంగాల్లో సహకారం అవసరాన్ని కూడా ఆయన వివరించారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) కార్యదర్శి శ్రీ దమ్మో రవి మాట్లాడుతూ..వాణిజ్యం, పెట్టుబడులు మరియు అభివృద్ధి వంటి రంగాలలో భారత్-ఏయూ సహకారం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. నీతి ఆయోగ్ సలహాదారు శ్రీ సుధేందు జె. సిన్హా పాల్గొనేవారిని ఉద్దేశించి ఎన్‌డిఎల్‌డి యొక్క లక్ష్యాలను సాధించడానికి భారత్ మరియు ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) కలిసి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

భారతదేశం మరియు ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) నుండి ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ థింక్ ట్యాంక్‌లు, విద్యావేత్తలు మరియు దౌత్యవేత్తల నుండి 50 మంది నిపుణులను ఈ వర్క్‌షాప్ ఒకచోటుకు చేర్చింది. సదస్సులో పాల్గొన్నవారు మూడు కీలక అంశాలపై లోతైన చర్చలు జరిపారు:

 

  • సమ్మిళిత ప్రపంచం కోసం ఇండో-ఏయూ సహకారం: సమ్మిళిత వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి, పేదరికం మరియు అసమానతలను తగ్గించడానికి మరియు ప్రజలందరికీ ఆహారం, నీరు, ఆరోగ్య సంరక్షణ మరియు విద్య వంటి ప్రాథమిక అవసరాలకు ప్రాప్యత ఉండేలా చేసే పద్ధతులపై చర్చించారు.
  • స్థిరమైన మరియు స్థితిస్థాపకమైన మౌలిక సదుపాయాల కోసం ఇండో-ఏయూ సహకారం: ఇంధనం, రవాణా మరియు నీటి నిర్వహణ రంగాలతో సహా స్థిరమైన మరియు స్థితిస్థాపకమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి సహకారం గురించి చర్చించారు. ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధికి ఎలా తోడ్పడాలి మరియు వాతావరణ మార్పు మరియు ఇతర షాక్‌లకు ప్రపంచాన్ని మరింత స్థితిస్థాపకంగా మార్చడం గురించి కూడా చర్చించారు.
  • మైగ్రేషన్ నిర్వహణ: ఇండో-ఏయూ భాగస్వామ్యం పాత్ర: సురక్షితమైన, క్రమబద్ధమైన మరియు మానవీయ పద్ధతిలో వలసలను నిర్వహించడంపై  ఇందులో చర్చించారు. వారు వలసలకు మూల కారణాలను, వలసదారులు మరియు శరణార్థులకు సహాయాన్ని అందించడం మరియు వ్యక్తుల అక్రమ రవాణాను ఎదుర్కోవడాన్ని కూడా చర్చించారు.


వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారు పలు అంశాలపై విలువైన ఇన్‌పుట్‌లను అందించారు. ఎన్‌డిఎల్‌డిలో నిర్దేశించిన హామీలను అమలు చేయడంలో సులభతరం చేసే కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ ఈ ఇన్‌పుట్‌లను ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది.
 

***


(Release ID: 1973995) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Hindi