ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 01 NOV 2023 11:42AM by PIB Hyderabad

   త్తీస్‌గ‌ఢ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌జ‌ల చైతన్యమే చ‌త్తీస్‌గ‌ఢ్‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంద‌ని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ‘‘రాష్ట్ర సంస్కృతిని సుసంపన్నం చేయడంలో మన గిరిజన సమాజాలు కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రంలోని అద్భుత సంప్రదాయం, సాంస్కృతిక వారసత్వం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. ఛత్తీస్‌గఢ్‌కు సహజ, సాంస్కృతిక వైభవంతో కూడిన ఉజ్వల భవిష్యత్తు సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“"ఛత్తీస్‌గఢ్‌లోని నా సోదర సోదరీమణులందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడి ప్రజల నిత్య చైతన్యం దీన్ని ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించాయి. రాష్ట్ర సంస్కృతిని సుసంపన్నం చేయడంలో గిరిజన సమాజాల పాత్ర అనిర్వచనీయం. ఇదొక అద్భుత రాష్ట్రం... ఇక్కడి సంప్రదాయం, సాంస్కృతిక వారసత్వం అందర్నీ ఆకట్టుకుంటాయి. ఛత్తీస్‌గఢ్‌కు సహజ, సాంస్కృతిక శోభసహిత ఉజ్వల భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/SK


(रिलीज़ आईडी: 1973965) आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam