కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈఎస్‌ఐసీ డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన జరిగిన సువిధ సమాగం

प्रविष्टि तिथि: 30 OCT 2023 7:53PM by PIB Hyderabad

ఈఎస్‌ఐసీ ప్రధాన కార్యాలయంలో ఈఎస్‌ఐసీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు సువిధ సమాగం జరిగింది. బీమా చేయబడిన వ్యక్తులు మరియు లబ్ధిదారులు, యజమానులు మరియు ఉద్యోగుల ప్రతినిధులు దేశవ్యాప్తంగా వివిధ ఈఎస్‌ఐసీ ఫీల్డ్ కార్యాలయాల నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా  వర్చువల్‌గా  సువిధ సమాగంలో పాల్గొన్నారు. సువిధ సమాగం సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఈఎస్‌ఐసీ వాటాదారుల ఫిర్యాదులు మరియు సమస్యలను  విన్నవించారు మరియు సమస్యలపై అక్కడికక్కడే పరిష్కారాన్ని అందించాలని సంబంధిత ఈఎస్‌ఐసీ అధికారులందరికీ సూచించారు. అక్కడికక్కడే పరిష్కరించడం సాధ్యంకాని  ఫిర్యాదులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఈఎస్‌ఐసీ డీజీ  ఆదేశించారు.

 

image.png


ఈ సమావేశంలో డాక్టర్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ సువిధ సమాజం వంటి కార్యక్రమాలు సంస్థ మరియు దాని వాటాదారుల మధ్య నమ్మకాన్ని ఏర్పరచడంలో సహాయపడతాయని అన్నారు. బీమా చేయబడిన వ్యక్తులు మరియు వారి లబ్ధిదారులకు వారి ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక మార్గాన్ని అందించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకుని ఈపీఎఫ్‌ఓ చొరవతో 'నిధి ఆప్కే నికత్' సహకారంతో ఈఎస్‌ఐసీ ప్రతి నెల 27న  లబ్దిదారుల సమస్యలను పరిష్కరించడం కోసం సువిధ సమాగమాలను నిర్వహిస్తోంది. 

image.png


ఈ సమావేశానికి ఫైనాన్షియల్ కమిషనర్, ఇన్సూరెన్స్ కమిషనర్లు, మెడికల్ కమిషనర్లు మరియు ఈఎస్‌ఐసీ ప్రధాన కార్యాలయం, క్షేత్రస్థాయి కార్యాలయాల అధికారులు కూడా హాజరయ్యారు.
 

***


(रिलीज़ आईडी: 1973239) आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi