కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్ర‌సార‌, కేబుల్ సేవ‌ల నిబంధ‌నా చట్ర స‌మీక్షపై సంప్ర‌దింపుల ప‌త్రంపై ప్ర‌తివ్యాఖ్య‌ల‌ను అందుకునేందుకు ఆఖ‌రు తేదీ పొడిగింపు

Posted On: 30 OCT 2023 2:46PM by PIB Hyderabad

 ప్ర‌సార‌, కేబుల్ సేవ‌ల నిబంధ‌నా చట్ర స‌మీక్షపై సంప్ర‌దింపుల ప‌త్రాన్ని టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (టిఆర్ఎఐ - ట్రాయ్‌)  08 ఆగ‌స్టు 2023న విడుద‌ల చేసింది.  ఈ సంప్ర‌దింపుల ప‌త్రంలో లేవ‌నెత్తిన అంశాల‌పై భాగ‌స్వాముల నుంచి వ్యాఖ్య‌ల‌ను, అభిప్రాయాల‌ను పంపేందుకు ఆఖ‌రు తేదీని తొలుత 05 సెప్టెంబ‌ర్ 2023గా, ప్ర‌తి వ్యాఖ్య‌ల‌కు చివ‌రి తేదీని19 సెప్టెంబ‌ర్ 2023గా నిర్ణ‌యించింది. 
అభిప్రాయాల‌ను స‌మ‌ర్పించేందుకు స‌మ‌యాన్ని పొడిగించ‌వ‌ల‌సిందిగా అప్పుడ‌ప్పుడు భాగ‌స్వాముల నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల‌ను దృష్టిలో ఉంచుకొని లిఖితపూర్వ‌క వ్యాఖ్య‌ల‌ను, ప్ర‌తివ్యాఖ్య‌ల‌ను పంపేందుకు ఆఖ‌రు తేదీని 10 అక్టోబ‌ర్ 2023 & 25 అక్టోబ‌ర్ 2023కు పొడిగించింది. 
పైన పేర్కొన్న సంప్ర‌దింపుల ప‌త్రంపై ప్ర‌తి వ్యాఖ్య‌ల‌కు ఆఖ‌రు తేదీని పొడిగించ‌వ‌ల‌సిందిగా  ప్ర‌స్తుతం భాగ‌స్వాముల నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల మేర‌కు, ప్ర‌తి వ్యాఖ్య‌లు స‌మ‌ర్పించేందుకు ఆఖ‌రు తేదీని 1 న‌వంబ‌ర్ 2023 వ‌ర‌కు పొడిగించాల‌ని నిర్ణ‌యించారు.  ప్ర‌తివ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్పించేందుకు మ‌రొక‌సారి పొడిగించేందుకు ఎటువంటి విజ్ఞ‌ప్తుల‌ను, అభ్య‌ర్ధ‌ల‌ను స్వీక‌రించ‌రు, అంగీక‌రించ‌రు. 
ప్ర‌తివ్యాఖ్య‌ల‌ను ప్ర‌ధానంగా ఎల‌క్ట్రానిక్ రూపంలో ఇమెయిల్ ఐడి ఎడివిబిసిఎస్‌-2@టిఆర్ఎఐ. జి ఒవి. ఐఎన్ (advbcs-2[at]trai[dot]gov[dot)కు ,  jtadvbcs-1[at]trai[dot]gov[dot]inకు పంప‌వ‌చ్చు. మ‌రింత స్ప‌ష్టీక‌ర‌ణ‌/  స‌మాచారం కోసం ట్రాయ్ సిఎస్ఆర్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ & బి& సిఎస్ స‌ల‌హాదారు శ్రీ అనిల్ కుమార్ భ‌ర‌ద్వాజ్‌ను టెలిఫోన్‌. నెం. +91-11-23237922పై సంప్ర‌దించ‌వ‌చ్చు. 

 

***


(Release ID: 1973225) Visitor Counter : 59