కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2023 లో టెలికాం లైసెన్సుదారులు, పింఛనుదారుల కోసం డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన - కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ కార్యాలయం


"సరస్" పోర్టల్ ద్వారా రెండు లక్షల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది

ప్రతి నెలా నాలుగు లక్షల కంటే ఎక్కువ డి.ఓ.టి. పింఛనుదారులకు "సంపన్" ద్వారా 1,239 కోట్ల రూపాయల మేర పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతోంది.

Posted On: 30 OCT 2023 12:17PM by PIB Hyderabad

టెలికాం శాఖ (డి.ఓ.టి) లోని ఇతర యూనిట్లలో మాదిరిగా, కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అకౌంట్స్ (సి.జి.సి.ఏ) కూడా “సార్స్”, “సంపన్” రూపంలో టెలికాం లైసెన్సుదారులు సులభంగా వ్యాపారం చేయడంతో పాటు, టెలికాం / బి.ఎస్.ఎన్.ఎల్. / ఎం.టి.ఎన్.ఎల్. కు చెందిన పింఛన్ దారులకు నాణ్యమైన సేవలు అందించడానికి వీలుగా దాని డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ప్రదర్శించడానికి ఐ.ఎం.సి-2023 లో ఒక స్టాల్‌ ను ఏర్పాటు చేసింది.  

ఈ స్టాల్స్ వద్ద పలువురు విశిష్ట అతిధులకు, సందర్శకులకు "సంపన్", "సరస్" బృందాలు స్వాగతం పలికి, ఆతిధ్యమిచ్చాయి. 

ఏ)     కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ చౌహాన్ స్టాల్‌ను సందర్శించి, వ్యవస్థలను అభినందించారు.  పింఛనుదారుల జీవితాలను మెరుగుపరిచేందుకు వ్యవస్థలను మరింత మెరుగుపరచాలని సూచించారు. 

బి)     డి.ఓ.టి. కార్యదర్శి వ్యవస్థల విస్తృతిని అర్థం చేసుకుని, వ్యవస్థల పని తీరుని అభినందించారు.

సి)      "సంపన్" పని చేస్తున్న విధానాన్ని డి.ఏ.ఆర్.పి.జి. కార్యదర్శి కి వివరించడంతో, ఈ వ్యవస్థ పింఛనుదారులకు నేరుగా పింఛన్లు పంపిణీ చేస్తోందన్న విషయాన్ని వారు తెలుసుకున్నారు. 

డి)     భారత ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన చెందిన పలువురు సీనియర్ అధికారులు, అనేక టి.ఎస్.పి. ల అధికారులు ఈ స్టాల్‌ ను సందర్శించారు. ముఖ గుర్తింపు విధానాన్ని ఉపయోగించి లైఫ్ సర్టిఫికెట్ల జారీని ఈ స్టాల్ సులభతరం చేసింది.

ఇ)     బి.ఎస్.ఎన్.ఎల్. కు చెందిన మాజీ చైర్మన్, మానేజింగ్ డైరెక్టర్ తో పాటు, సేవల విభాగానికి చెందిన మాజీ సభ్యుడు  "ఫేస్-అథెంటికేషన్-జీవన్-ప్రమాణ్-యాప్‌" ని ఉపయోగించి వారి జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించారు.

ఈ స్టాల్ వద్ద, వికేంద్రీకృత లైసెన్సుల కోసం ఎల్.ఎఫ్. హ్యాండ్‌ బుక్కు, ఐ.ఎస్.పి. ల లైసెన్స్ ఒప్పందాల సరళీకృత ఆర్థిక సమ్మతితో పాటు, ఆదాయ సంబంధిత ఆర్డర్లు, సి.జి.సి.ఏ. వెబ్‌-సైట్ లింక్ కోసం "క్యూ.ఆర్.-కోడ్" లను ప్రదర్శించడం జరిగింది.  ఐ.ఎం.సి-2023 సందర్భంగా స్టాల్‌ ని సందర్శించే టెలికాం లైసెన్సుదారులు తమ అభిప్రాయాన్ని సమర్పించడం కోసం స్టాల్ వద్ద "క్యూ.ఆర్. కోడ్" ను అందుబాటులో ఉంచారు.    "సార్స్" లక్షణాలు, ఫలితాలను ప్రదర్శించే సంక్షిప్త వీడియోలను కూడా ఈ స్టాల్‌ లో ప్రదర్శించడం జరిగింది. 

లైసెన్స్ ఒప్పందాల ఆర్థిక పరిస్థితుల సౌలభ్యం కోసం లైసెన్సుదారుల కోసం "సార్స్" అనే ఒక పోర్టల్ ను 2021  జనవరి 15వ తేదీన డి.ఓ.టి. ప్రారంభించింది.  ఈ "సార్స్" పోర్టల్ ద్వారా లైసెన్స్‌ దారులు ఎల్.ఎఫ్., ఎస్.యు.సి., స్పెక్ట్రమ్ వేలం చెల్లింపులు, సి.ఏ.ఎఫ్.. / ఈ.ఎం.ఆర్. పెనాల్టీ, టెస్టింగ్ ఫీజుతో పాటు ఇతర పెనాల్టీల కోసం ఆన్‌-లైన్ పేపర్‌-లెస్ చెల్లింపులు చేసే సౌకర్యాన్ని పొందగలరు. 

త్రైమాసిక ప్రాతిపదికన రెవెన్యూ మరియు లైసెన్స్ ఫీజు కు సంబంధించిన స్టేట్‌మెంట్,  వార్షిక ప్రాతిపదికన ఆడిట్ చేసిన పత్రంతో పాటు వార్షిక ఆర్థిక పత్రాలు పూర్తిగా డిజిటల్ మరియు పేపర్‌-లెస్ సమర్పణకు "సార్స్" వీలు కల్పించింది.  ఆన్‌-లైన్‌ లో డిడక్షన్ డాక్యుమెంట్, ఆన్‌-లైన్ అసెస్‌మెంట్, ఎల్.డి. మరియు మరియు ఎస్.యు.సి. కోసం డిమాండ్ నోటీసులతో పాటు, కు యాక్సెస్, ఇతర బకాయిల కోసం డిమాండ్ నోటీసులను ఈ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు.  అదేవిధంగా "నో-డ్యూస్-సర్టిఫికేట్" జారీ చేయడానికి, నిర్వహణ నుంచి నిష్క్రమించడానికి కూడా ఈ పోర్టల్ "సింగిల్-విండో" గా పనిచేస్తుంది. ఇప్పటికే 2,659 మంది లైసెన్స్‌దారులు "సార్స్" పోర్టల్ లో నమోదు చేసుకున్నారు. 

"సార్స్" పోర్టల్ ద్వారా ఇప్పటికే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.  డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కు చెందిన పింఛనుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేని ఆన్‌-లైన్ పెన్షన్ ప్రాసెసింగ్ మరియు చెల్లింపు వ్యవస్థగా ఈ 'సిస్టమ్ ఫర్ అకౌంటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పెన్షన్' ప్రాజెక్టు - "సంపన్" పోర్టల్ పనిచేస్తుంది.   గౌరవనీయులైన ప్రధానమంత్రి ఈ పోర్టల్ ను 2018 డిసెంబర్, 29వ తేదీన జాతికి అంకితం చేశారు.

ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఉన్న డి.ఓ.టి. / బి.ఎస్.ఎన్.ఎల్. / ఎం.టి.ఎన్.ఎల్. కి చెందిన సుమారు  నాలుగు లక్షల మందికి పైగా పింఛనుదారులు సంపన్ విధానాన్ని ఉపయోగించి సి.సి.ఏ. యూనిట్ల ద్వారా సేవలు పొందుతున్నారు.  కింది ప్రయోజనాలకు భరోసా ఇచ్చే ఏక గవాక్ష ఏర్పాటును నెలకొల్పడం ద్వారా పింఛనుదారులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతోంది:

*     సకాలంలో పింఛను కేసుల పరిష్కారం

*     ఇ-పెన్షన్ చెల్లింపు ఆర్డర్ యొక్క సదుపాయం

*     లాగిన్ ద్వారా ప్రతి పింఛనుదారులు చెల్లింపు చరిత్ర వంటి కీలక సమాచారాన్ని తెలుసుకునే అవకాశం 

*     ఫిర్యాదుల ఆన్‌-లైన్ సమర్పణతో పాటు, సకాలంలో ఎస్.ఎం.ఎస్. ల ద్వారా తాజా సమాచారం. 

సంపన్ ద్వారా సుమారు 1,239 కోట్ల రూపాయల మేర నెలవారీ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతోంది. 

అదేవిధంగా, సంపన్ విధానం 2023 సెప్టెంబర్ వరకు సుమారుగా 44 కోట్ల రూపాయలు ఆదా చేసింది. దీనికి తోడు, ప్రభుత్వానికి ప్రతి ఏటా 40 కోట్ల రూపాయల మేర వార్షిక పునరావృత ఆదా అవుతుంది.

*****


(Release ID: 1973223) Visitor Counter : 66


Read this release in: English , Urdu , Hindi , Tamil