ఆర్థిక మంత్రిత్వ శాఖ
మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత వస్తువుల నిరోధక ప్రత్యేక ప్రచారకార్యక్రమం 3.0 కింద, రూ 294 కోట్ల రూపాయల విలువచేసే 328 కిలోల మాదకద్రవ్యాలు, 80.2 లక్షల విదేశీ సిగరెట్లను ధ్వంసం చేసిన ఢల్లీి కస్టమ్స్ విభాగం.
Posted On:
25 OCT 2023 3:24PM by PIB Hyderabad
ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 కింద, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కింద గల, కేంద్ర పరోక్షపన్నుల కేంద్ర బోర్డు, కస్టమ్స్ (సిబిఐసి) ఢల్లీి జోన్ 284 కోట్ల రూపాయల విలువచేసే,328 కేజీల మాదక ద్రవ్యాలు,
9.85 కోట్ల రూపాయల విలువ చేసే 80.2 లక్షల విదేశీ సిగరెట్లను అత్యంత కట్టుదిట్టమైన రీతిలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన రెవిన్యూ విభాగం కార్యదర్శి సమక్షంలో న్యూఢల్లీిలో ఈరోజు ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా సిబిఐసి ఛైర్మన్, సిబిఐసి కార్యకలాపాల అమలు విభాగం సభ్యుడు కూడా హాజరయ్యారు.
ఈ అక్రమ సరుకును ధ్వంసం చేయడానికి ముందు, రెవిన్యూ సెక్రటరీ, సిబిఐసి ఛైర్మన్, సిబిఐసి సభ్యుడు (నిర్వహణ, అమలు), ఆర్థికమంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు వీటిని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రెవిన్యూ కార్యదర్శి శ్రీ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, స్వాధీనం చేసుకున్న అక్రమ సరుకును ధ్వంసం చేయడమనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని దీనిని కస్టమ్స్‌విభాగం, ఈ ప్రత్యేక ప్రచారం లేని సమయంలోనూ చేపడుతుంటుందని చెప్పారు. అయితే ఈ ప్రత్యేక కార్యక్రమం ఈ అక్రమ , నిషేధిత వస్తువుల ధ్వంసానికి మరింత ఊపునిస్తుందన్నారు.
అక్రమ సరుకును ధ్వంసం చేయడం, రావణ దహనం వీటికి పోలిక తెస్తూ , దసరా సందర్బంగా రావణుడి బొమ్మను దహనం చేస్తారని, అన్నారు. ఈరోజు అక్రమ ,నిషేధిత సరుకును ధ్వంసం చేయడమంటే, అది చెడుపై మంచి సాదించిన విజయంగా శ్రీ మల్హోత్రా అభిర్ణించారు. మాదక ద్రవ్యాల అక్రమరవాణాను నిరోధించేందుకు తమ విభాగం పట్టుదలతో తమ కృషి కొనసాగించి యువత వీటి బారినపడకుండా రక్షించుకుంటుందని ఆయన అన్నారు.
ఈరోజు ధ్వంసం చేసిన మాదకద్రవ్యాలలో 29 కేజీల హెరాయిన్, 6 కేజీల కొకైన్, 7 కేజీల ఆంఫీటామైన్, 286 కేజీల ఖాట్ ఆకులు ( కాథా ఎడ్యులిస్) ఉన్నాయి. ఇందులో మెజారిటీ హెరాయిన్‌ను డిపార్టమెంట్ 2005నుంచి 2009 `10 మధ్య కాలంలో స్వాధీనం చేసుకున్నది. మరి కొంత మొత్తం 2022`23లోస్వాధీనం చేసుకున్నది. మిగిలిన నార్కోటిక్ డ్రగ్స్‌ను 2022`23 లో స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విదేశీ సిగరెట్లలో ఈ రోజు ధ్వంసం చేసిన వాటిలో ఎక్కువ భాగం 2018లో స్వాధీనం చేసుకున్నది. మరి కొంత 2023లో స్వాధీనం చేసుకున్నది. ఈసిగరెట్లు భారతదేశంలోకి అక్రమంగా, సిగరెట్లు, ఇతర పొగాక ఉత్పత్తుల చట్టం(సిఒటిపిఎ) 2003 కు విరుద్ధంగా దిగుమతి చేసుకుంటుండడంతో ప్రభుత్వం వీటిని స్వాధీనం చేసుకుంది. ఇలా స్వాధీనం చేసుకున్న విదేశీ సిగరెట్లపై దేశీయ నిబంధనల ప్రకారం ఉండవలసిన హెచ్చరికలు, ఆరోగ్య సూచికల చిత్రం లేదు. ఎన్.డి.పి.ఎస్ పదార్ధాలు, అనుమతి లేని విదేశీ సిగరెట్లను ప్రమాదకర, ఇతర వ్యర్థౄలు (ఎంఅండ్ టిఎం) నిబంధనలు 2016 ప్రకారం మెస్సర్స్ బయోటిక్ వేస్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడఖ్ ఢిల్లీ వారి వద్ద ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధ్వంసం చేయడం జరుగుతుంది. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ ఈ సంస్థకు ఇందుకు అనుమతి ఇచ్చింది. నార్కోటిక్ పదార్ధాలు, సిగరెట్లు, ఇతర బయో డిగ్రేడబుల్ వ్యర్థాలను బయో మెడికల్ వ్యర్థాలను ఇది ధ్వంసం చేస్తుంది.
సిబిఐసి సంస్థ ప్రత్యేక ప్రచార కార్యక్రమం కింద తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఇది పెండింగ్ అంశాల (ఎస్సిడిపిఎం) పరిష్కారానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టింది. అక్టోబర్ 2023 మూడవ వారంలో 1000 కోట్ల రూపాయల విలువగల 365 కేజీల
నార్కోటిక్ పదార్థాలను, 1.35 కోట్ల విలువగల విదేశీ సిగరెట్ల నిల్వలను ధ్వంసం చేసింది. ఈ సిగరెట్ల విలువ 13 కోట్ల రూపాయలవరకు ఉంటుందని అంచనా. సిబిఐసి విభాగం 8,308 ఫిజికల్ ఫైళ్లు పరిష్కరించింది. అలాగే 9,304 కేజీల తుక్కును తొలగించడం ద్వారా 46,565 చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేయించగలిగింది. ప్రస్తుతం కస్టమ్స్ ప్రవెంటివ్ జోన్,ఢిల్లీ వారు నార్కోటిక్ డ్రగ్స్, విదేశీ అక్రమ సిగరెట్లను ధ్వరంసం చేయడం, పరిశుభ్రతా ప్రచారంలో భాగంగా వీటిని ధ్వంసం చేయడంగా చెప్పుకోవచ్చు.
అంతర్జాతీయ కమ్యూనిటీలో బాధ్యతాయుత సభ్యదేశంగా ఇండియా, మాదక ద్రవ్యాలపై పోరాటంలో కీలక పాత్ర వహిస్తున్నది. మాదక ద్రవ్యాల నియంత్రణపై అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాల విషయంలో ఐక్యరాజ్య సమితి ఒప్పందంలో ఇండియా కూడా భాగస్వామి. ఇలాంటి ఒప్పందాల అమలుకు భారత పార్లమెంటు నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోథెరపిక్సబ్ స్టాన్సెస్ చట్టం (ఎన్.డి.పిఎస్ ) చట్టం 1985ను తీసుకువచ్చింది. భారత కస్టమ్స్ విభాగం, కస్టమ్స్ సుంకాన్ని వసూలు చేసే ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించడమేకాక, మాదకద్రవ్యాలు,ఇతర నిషేధఙత వస్తువులు అక్రమంగా దేశంలోకి రాకుండా కట్టుదిట్టంగా నిరోధించే చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వివిధ సోర్సులనుంచి సేకరిస్తున్నది. భూమార్గం, జల, వాయు మార్గాలలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ చట్టం 1985 కింద చర్యలు తీసకుంటున్నది..
***
(Release ID: 1972426)
Visitor Counter : 101