వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023-24 ప్రధానమైన ఖరీఫ్ పంటల ఉత్పత్తి మొదటి ముందస్తు అంచనాలు

Posted On: 27 OCT 2023 8:34PM by PIB Hyderabad

వ్యవసాయం,  రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023-24లో ప్రధాన ఖరీఫ్ పంటల ఉత్పత్తికి సంబంధించిన మొదటి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. పంట ఉత్పత్తి అంచనా రాష్ట్రాలు అందించిన డేటాపై ఆధారపడి ఉంటుంది. తరువాత వివిధ ప్రత్యామ్నాయ వనరుల నుండి సమాచారాన్ని ఉపయోగించి ధృవీకరిస్తారు. ఈ వనరులలో క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ (సిడబ్ల్యూడబ్ల్యూజీ), రిమోట్ సెన్సింగ్ అంచనాలు, ఎకనామెట్రిక్ మోడలింగ్ ఆధారంగా అంచనాలు, రైతు సర్వేల నుండి సేకరించిన ఇన్‌పుట్‌లు, పంట అంచనాలో చారిత్రక పోకడలు ఉన్నాయి.

మొదటి ముందస్తు అంచనాల ప్రకారం, 2023-24లో ప్రధాన ఖరీఫ్ పంటల అంచనా ఉత్పత్తి క్రింది విధంగా ఉంది:

ఆహారధాన్యాలు –1485.69 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ)

  • బియ్యం –1063.13  లక్షల మెట్రిక్ టన్నులు
  • మొక్కజొన్న–224.82  లక్షల మెట్రిక్ టన్నులు
  • కంది –34.21  లక్షల మెట్రిక్ టన్నులు
  • పెసర – 14.05  లక్షల మెట్రిక్ టన్నులు
  • మినప – 15.05  లక్షల మెట్రిక్ టన్నులు

నూనెగింజలు –215.33 లక్షల మెట్రిక్ టన్నులు

  • వేరుశెనగ  –78.29  లక్షల మెట్రిక్ టన్నులు
  • సోయాబీన్ –115.28  లక్షల మెట్రిక్ టన్నులు

చెరుకు – 4347.93 లక్షల మెట్రిక్ టన్నులు

పత్తి –316.57 లక్షల బేళ్లు (ఒక్కొక్కటి 170 కిలోల చొప్పున)

జనప నార –91.91 లక్షల బేళ్లు (ఒక్కొక్కటి 180 కిలోల చొప్పున)     

ప్రధాన ఖరీఫ్ పంట అయిన వరి సాగు విస్తీర్ణం మునుపటి సంవత్సరం చివరి అంచనా కంటే సుమారు 2 లక్షల హెక్టార్లు, సగటు వరి విస్తీర్ణం కంటే 4.5 లక్షల హెక్టార్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. సగటు ఖరీఫ్ వరి ఉత్పత్తితో పోలిస్తే దీని ఉత్పత్తి కూడా దాదాపు లక్ష టన్నులు ఎక్కువగా ఉంటుందని అంచనా.

ఖరీఫ్ మొక్కజొన్న, జొన్న వంటి ఇతర తృణధాన్యాల పంటల విస్తీర్ణం కూడా మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ పంటల సగటు విస్తీర్ణంతో పోలిస్తే ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. ఖరీఫ్ మొక్కజొన్న ఉత్పత్తి 224.82 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేయబడింది, సగటు ఉత్పత్తి 213.51 లక్షల మెట్రిక్ టన్నులతో పోలిస్తే సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల పెరుగుదల నమోదైంది. 

2023-24 నాటికి, ఖరీఫ్ పోషక/ముతక తృణధాన్యాల ఉత్పత్తి 351.37 ఎల్ఎంటీగా అంచనా వేశారు. ఇది సగటు ముతక తృణధాన్యాల ఉత్పత్తి 350.91 ఎల్ఎంటీ కంటే కొద్దిగా ఎక్కువ. 2023-24లో శ్రీ అన్న ఉత్పత్తి 126.55 ఎల్ఎంటీగా అంచనా వేయడం జరిగింది. 

కంది ఉత్పత్తి 34.21 ఎల్ఎంటీగా అంచనా వేయబడింది, ఇది గత సంవత్సరం ఉత్పత్తికి దాదాపు సమానంగా ఉంటుంది. ఇంకా, మినప కింద విస్తీర్ణం 30.73 లక్షల హెక్టార్లుగా అంచనా వేయబడింది, ఇది గత సంవత్సరం 30.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో దాదాపు సమానంగా ఉంటుంది. అయితే, వాతావరణ పరిస్థితుల కారణంగా 2023-24లో మొత్తం ఖరీఫ్ పప్పుధాన్యాల ఉత్పత్తి గత సంవత్సరం కంటే తక్కువగా ఉంటుందని అంచనా. 2023-24లో మొత్తం ఖరీఫ్ పప్పుధాన్యాల ఉత్పత్తి 71.18 ఎల్ఎంటీ గా అంచనా.

చెరకు మొత్తం ఉత్పత్తి 4347.93 ఎల్ఎంటీగా అంచనా వేయడం జరిగింది, ఇది సగటు చెరకు ఉత్పత్తి 4222.55 ఎల్ఎంటీ కంటే ఎక్కువ. ఈ మొదటి ఉత్పత్తి అంచనా 2023-24 (ఖరీఫ్)లో గత 3 సంవత్సరాల సగటు దిగుబడిపై ఆధారపడి ఉండడం గమనార్హం. వాస్తవ పంట కోత ప్రయోగాల ఆధారంగా దిగుబడి అంచనాలను స్వీకరించిన తర్వాత మార్పులు ఉండవచ్చు. 

 

***


(Release ID: 1972414) Visitor Counter : 264


Read this release in: English , Urdu , Hindi