ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వ‌చ్ఛ‌త‌ను సంస్థాగ‌తీక‌రించ‌డానికి, ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో అప‌రిష్కృత అంశాల‌ను త‌గ్గించేందుకు ప్ర‌త్యేక ప్ర‌చారం 3.0- అక్టోబ‌ర్ 09-23, 2023 కాలంలో చేప‌ట్టిన చ‌ర్య‌లు

Posted On: 27 OCT 2023 4:33PM by PIB Hyderabad

ఎల‌క్ట్రానిక్స్ & ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఎంఇఐటివై) మంత్రిత్వ శాఖ 09-20 అక్టోబ‌ర్ 2023 కాలంలో ప్ర‌త్యేక ప్ర‌చారం 3.0ను నిర్వ‌హ‌ణ‌ను కొన‌సాగించింది. ఈ ఉద్య‌మంలో సిసిఎ, ఐసిఇఆర్‌టి, ఎస్‌టిక్యూసి, ఎన్ఐసి, యుఐడిఎఐ, ఎన్ఐఇఎల్ఐటి, ఎస్‌టిపిఐ, ఇఆర్ఎన్ఇటి ఇండియా, ఎన్ఐఎక్స్ఐ, ఎన్ఐసిఎస్ఐ, సి-డిఎసి, మై-గ‌వ్, ఎన్ఇజిడి, డిఐసి వంటి స్వ‌యంప్ర‌తిప‌త్తిగ‌ల‌/ అనుబంధ కార్యాల‌యాల‌తో స‌హా ఎంఇఐటివై అధికారులు అంద‌రూ ఉత్సాహంతో, శ్ర‌ద్ధ‌తో ఇందులో పాల్గొన‌డాన్ని కొన‌సాగిస్తూ, దిగువ పేర్కొన్న కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించారు -
1) పారిశుద్ధ్య డ్రైవ్‌ను  సిజిఒ స‌ముదాయంలో గ‌ల ఎన్ఐసి (కేంద్ర కార్యాల‌యం)లో చేప‌ట్టారు. ఇండియ‌న్ ఎయిర్‌వేస్ (ఐఎన్ఎ), స‌బ్‌వే, హ‌జ‌ర‌త్ నిజాముద్దీన్ ద‌ర్గా, నిజ‌ముద్దీన్ రైల్వే స్టేష‌న్‌, మినీ మార్కెట్‌, సిజిఒ స‌ముదాయం, జెఎల్ఎన్ స్టేడియం, అజ‌య్ అహుజా పార్క్‌లో శుభ్రం చేసేందుకు ప్ర‌త్యేక ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. వివిధ ప్రాంతాల‌లో చెత్త‌బుట్ట‌ల‌ను పెట్టారు. 
2) ఒక దేశం, ఒక మిష‌న్‌, చెత్త ర‌హిత‌, కాలుష్య ర‌హితం అన్న నినాదంతో సి-డిఎసి ప‌ని చేసింది. ఈ సంద‌ర్భంగా, 12.10.2023న సి-డిఎసి స‌భ్యులంద‌రికీ మొరాదాబాద్‌కు చెందిన అతిథి వ‌క్త డాక్ట‌ర్ అనామికా త్రిపాఠీ ఇ-వ్య‌ర్ధాల‌పై ఉప‌న్య‌సించారు. 
3) సి-డిఎసి పూణె పాష‌న్ హిల్స్ భారీ మొక్క‌లు నాటే ప‌నిని చేప‌ట్టింది. 
4) సి-డిఎసి పూణె సింహ‌గ‌ఢ్ కోట‌ను నిర్వ‌హించింది. ఈ ప్ర‌చారంలో 46మందికి పైగా వ్య‌క్తులు పాల్గొన్నారు. 
5) 26.10.2023న పూణెలోన అధికారులు రాజీవ్ గాంధీ జూలో సాధార‌ణ పారిశుద్ధ్య డ్రైవ్‌ను చేప‌ట్టారు. 
6)మొహాలీ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద హ‌ర్ ప‌త్రి సాఫ్ సుత్రి ప్ర‌చారాన్ని సి-డిఎసి చేప‌ట్టింది. 
7) శ్ర‌మ‌దానం, పారిశుధ్ధ్య కార్య‌క‌లాపాల‌ను 11.10.2023న డిడియు మార్గ్‌, ఆధార్ రెసిడెన్షియ‌ల్ కాంప్లెక్స్ వ‌ద్ద యుఐడిఎఐ చేప‌ట్టింది. 
8) న్యూఢిల్లీలోని ఎన్‌డిఎంసి స్కూల్‌, కాన్వెంట్ జీస‌స్ మేరీ స్కూల్‌, కాళీ మందిర్‌, బంగ్లా సాహిబ్ రోడ్‌, క‌న్నాట్ ప్లేస్ వ‌ద్ద యుఐడిఎఐ పారిశుద్ధ్య డ్రైవ్‌ను చేప‌ట్టింది. 
9)  ఏకకాల వినియోగ ప్లాస్టిక్‌ను, చెత్త‌విసిరివేయ‌డాన్ని నిరోధించాల్సిన అవ‌స‌రం గురించి ప్రేక్ష‌కులలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు యుఐడిఎఐలో 19.10.2023న ఎంఇఐటివై అధికారులు స్వ‌చ్ఛ‌త పై నుక్క‌డ్ నాట‌కాల‌ను, జాన‌ప‌ద నృత్యాల‌ను ప్ర‌ద‌ర్శించారు. 
10) హైద‌రాబాద్‌లోని సి-ఎంఇటి, త్రిస్సూర్ సి-ఎంఇటి వ‌ద్ద అధికారులు శ్ర‌మ‌దానంలో పాలుపంచుకున్నారు. 
11) సిఎస్‌సి సిబ్బంది కోసం 12.10.2023న ప‌రిశుభ్ర‌త & ఇ- వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ‌పై వ‌ర్క్‌షాప్‌ను నిర్వ‌హించారు. 
12) త‌న సంస్థ‌ల‌న్నింటితో స‌హా ఎంఇఐటివై 09-10-2023 నుంచి 20-10-2023వ‌ర‌కు మొత్తం 571 ఫిర్యాదుల‌లో 303 ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించారు. వీటి ప‌రిష్కారానికి ఈ సంస్థ‌లు తీసుకున్న స‌గ‌టు కాలం 13 రోజులు. 

 

***
 


(Release ID: 1972276) Visitor Counter : 45


Read this release in: English , Urdu , Hindi