హోం మంత్రిత్వ శాఖ

కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ఉత్సాహంగా సాగుతున్న ప్రత్యేక ప్రచారం 3.0


అనుబంధ, క్షేత్ర కార్యాలయాలతో కలిసి అక్టోబర్ 25 వరకు 7,811 పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టిన ఎంహెచ్‌ఏ

మంత్రిత్వ శాఖ గుర్తించిన 3,676 ప్రజా ఫిర్యాదులు 100% విజయవంతంగా పరిష్కారం

అక్టోబర్ మొదటి మూడు వారాల్లో రూ.4.64 కోట్ల ఆదాయం ఆర్జనతో పాటు 1,27,767 చదరపు అడుగుల కార్యాలయ స్థలానికి విముక్తి

ఇప్పటివరకు 81,284 భౌతిక దస్త్రాలు సమీక్ష, 53,519 అనవసర దస్త్రాలు తొలగింపు

Posted On: 27 OCT 2023 4:57PM by PIB Hyderabad

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ), తన అనుబంధ/క్షేత్ర కార్యాలయాల్లో ప్రత్యేక ప్రచారం 3.0ని నిర్వహిస్తోంది. కార్యాలయాల్లో ఖాళీ స్థలాల నిర్వహణ, మంచి పని వాతావరణం కల్పించడానికి ఈ ప్రచారంలో ప్రాధాన్యత ఇస్తోంది.

ఈ ప్రచారంలో ఎంహెచ్‌ఏ కార్యాలయాల అధికారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 25 అక్టోబర్ 2023 వరకు, తన అనుబంధ, క్షేత్ర కార్యాలయాలతో కలిసి 7,811 పరిశుభ్రత కార్యక్రమాలను ఎంహెచ్‌ఏ నిర్వహించింది. గుర్తించిన మొత్తం 3,676 ప్రజా ఫిర్యాదులను విజయవంతంగా పరిష్కరించింది.

అక్టోబర్ మొదటి మూడు వారాల్లో రూ.4.64 కోట్ల ఆదాయం ఆర్జించడంతో పాటు మొత్తం 1,27,767 చదరపు అడుగుల పని ప్రాంతాన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది. ఈ ప్రచారం కింద, అంతర్గత మంత్రిత్వ శాఖ పోర్టల్ ద్వారా రోజువారీ పురోగతి నివేదికను పర్యవేక్షిస్తున్నారు.

భౌతిక, ఎలక్ట్రానిక్ దస్త్రాలను క్రమబద్ధీకరించే పనిని కూడా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇప్పటివరకు 81,284 భౌతిక దస్త్రాలను సమీక్షించింది, 53,519 అనవసర దస్త్రాలను తొలగించింది. దీని వల్ల కార్యాలయాల్లో చాలా పని స్థలం ఖాళీ అయింది.

ప్రత్యేక ప్రచారం 3.0 కింద తాను చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపు తేవడానికి, ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి సామాజిక మాధ్యమాలను మంత్రిత్వ శాఖ వినియోగించుకుంటోంది. సీఏపీఎఫ్‌లు, యూటీ ప్రభుత్వాలు, ఇతర అనుబంధ కార్యాలయాల ద్వారా 1,600కు పైగా ట్వీట్‌లను 'ఎక్స్‌', ఇతర సామాజిక మాధ్యమ వేదికల్లో పోస్ట్ చేశారు.

ప్రత్యేక ప్రచారం 3.0లో మంత్రిత్వ శాఖ చేపట్టిన కొన్ని కార్యకలాపాలు ఇవి:

 

10 BN CRPF.jpeg

గుర్తించిన లక్ష్యాలను సాధించడానికి, ప్రత్యేక ప్రచారాన్ని 3.0 భారీ స్థాయిలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని హోం మంత్రిత్వ శాఖ వినియోగించుకుంటోంది.

***



(Release ID: 1972273) Visitor Counter : 55


Read this release in: English , Urdu , Hindi , Assamese