శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

రక్షణ రంగంలో భారత్ నేడు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుందని తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


"గతంలోలా కాకుండా మన సాయుధ దళాలు ఇప్పుడు డ్రోన్లు, హెలిబోర్న్ ఆపరేషన్లు మరియు యూఏవిలతో సహా అత్యంత అధునాతన ఆయుధాలను కలిగి ఉన్నాయి అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉన్నాయి": డాక్టర్ జితేంద్ర సింగ్

సైనిక కార్యకలాపాలపై అంతరాయం కలిగించే సాంకేతికతల ప్రభావం పెరుగుతూనే ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు; సైనిక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఈ సాంకేతికతలను ఉపయోగించడం చాలా అవసరం అని తెలిపారు

యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (యూఎస్‌ఐ) నిర్వహించిన ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్‌లో ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 22 OCT 2023 5:43PM by PIB Hyderabad

రక్షణ రంగంలో భారత్ నేడు  అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుందని కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

గతంలో మాదిరిగా కాకుండా మన సాయుధ దళాలు డ్రోన్‌లు, హెలిబోర్న్ ఆపరేషన్‌లు మరియు యూఏవిలతో సహా అధునాతన ఆయుధాలను కలిగి ఉన్నాయని మరియు క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

న్యూ ఢిల్లీలో యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (యుఎస్‌ఐ) నిర్వహించిన ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్‌లో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు.

 

2.jpg


రక్షణ రంగాన్ని మార్చే అవకాశం ఉన్న కొత్త సాంకేతికతలను స్వీకరించడంలో భారతదేశం అగ్రగామి దేశాలతో సమానంగా ఉందని మంత్రి అన్నారు. ఇది దేశ జాతీయ భద్రతను పెంపొందించడమే కాకుండా రక్షణ రంగంలో ప్రపంచ సాంకేతిక నాయకుడిగా భారతదేశాన్ని నిలబెట్టిందన్నారు.

“మన బలగాలు కాలం చెల్లిన ఆయుధాలను ఉపయోగిస్తున్న కాలం పోయింది. క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న ప్రపంచంలోని ఏడు ఉన్నత దేశాలలో మనం కూడా ఉన్నాము, ”అని ఆయన అన్నారు. “ ఇదే ఆలోచనతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మార్చిలో నేషనల్ క్వాంటం మిషన్‌ను ప్రారంభించారు.” అని చెప్పారు.

1.jpg



సైన్స్ & టెక్నాలజీ మంత్రి మాట్లాడుతూ..పూణేలోని ఐఐఎస్‌ఈఆర్‌లో ఏర్పాటైన 'ఐ-హబ్ క్వాంటమ్', క్వాంటమ్ టెక్నాలజీస్ ప్రాంతంలో పని చేస్తోంది మరియు అటామ్ ఇంటర్‌ఫెరోమెట్రీ-ఆధారిత సెన్సింగ్ మరియు నావిగేషన్ పరికరాలను అభివృద్ధి చేస్తోంది; ఐఐటీ  మద్రాస్‌లోని టీఐహెచ్‌ అంటే ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ రక్షణ సిబ్బంది కోసం సురక్షితమైన మొబైల్ ఫోన్‌ను అభివృద్ధి చేయడంపై పని చేస్తోంది; ఐఐటీ రూర్కీలోని టీఐహెచ్‌ ఐడీఆర్ డూట్ ఎంకె-1కి మద్దతునిచ్చే ఐహబ్ దివ్య సంపర్క్, కౌంటర్ టెర్రరిస్ట్/కౌంటర్ తిరుగుబాటు మరియు  కార్యకలాపాల సమయంలో భారత సాయుధ దళాలకు సహాయం చేయడానికి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ నానో డ్రోన్ అభివృద్ధి చేస్తోంది; ఐ-హబ్ క్వాంటమ్ పూణేలోని ఐఐఎస్‌ఈఆర్‌లో ఏర్పాటు చేయబడిన క్వాంటం టెక్నాలజీస్ విభాగంలో అటామ్ ఇంటర్‌ఫెరోమెట్రీ-ఆధారిత సెన్సింగ్ మరియు నావిగేషన్ పరికరాలను అభివృద్ధి చేస్తోంది; ఐఐటీ మండిలోని టిఐహెచ్‌ నావల్ కంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎన్‌సిఎంఎస్‌)ను అభివృద్ధి చేస్తున్న హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ (హెచ్‌సిఐ) ఫౌండేషన్, ఐఐఎస్‌సి బెంగళూరులోని టిఐహెచ్ ఆటోమేషన్ సిస్టమ్‌ల ఖచ్చితమైన నియంత్రణ
కోసం ఇంటిగ్రేటెడ్ రోబోటిక్ జాయింట్ యాక్యుయేటర్‌లను అభివృద్ధి చేస్తోంది అని వివరించారు.

 

image.png


డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ మనకు సవాళ్లను విసిరే సాంకేతికతలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి మరియు సైనిక కార్యకలాపాలపై వాటి ప్రభావం పెరుగుతూనే ఉంటుంది అందువల్ల ఆధునిక యుగంలో సైనిక ఆధిక్యత మరియు జాతీయ భద్రతను కొనసాగించడానికి ఈ సాంకేతికతలను స్వీకరించడం మరియు ఉపయోగించడం చాలా అవసరం అని గుర్తు చేశారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్ధవంతమైన నాయకత్వంలో సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్స్ పరంగా భారతదేశానికి ఇదే అత్యుత్తమ సమయం అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్‌1 మరియు కోవిడ్ వ్యాక్సిన్‌ల విజయగాథలు భారతదేశ ముఖచిత్రం మార్పునకు దోహదపడ్డాయని చెప్పారు.

 

image.png


డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్ విజయవంతమైన తర్వాత ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాయకుడిగా ఎదిగారని చెప్పారు. జీ20 సమ్మిట్ సందర్భంగా ప్రకటించిన గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్, 2070 నాటికి నికర జీరోగా మార్చే భారతదేశ ఎండిజి లక్ష్యాలను సాధించడంలో గొప్పగా సహాయపడుతుందని చెప్పారు.

ఆఫ్రికన్ యూనియన్ జీ20లోకి ప్రవేశించడాన్ని ప్రశంసించిన మంత్రి “ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశానికి నాయకత్వం అందించడానికి ప్రపంచం సిద్ధంగా ఉందని, జీ20ని జీ21గా మార్చిన  న్యూఢిల్లీ సమ్మిట్ చరిత్రలో నిలిచిపోయింది. ." అని పేర్కొన్నారు.

" ఆయన ఒక దేశంగా భారతదేశ  పాత్రను స్థాపించారు అది నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంది" అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

***



(Release ID: 1970002) Visitor Counter : 56