ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ (ఎన్ .ఇ.జి.డి)చే రాష్ట్ర సామర్థ్యాల నిర్మాణ వర్క్షాప్ ఏర్పాటు.

Posted On: 19 OCT 2023 4:46PM by PIB Hyderabad

డిజిటల్ పరివర్తనకు సంబంధించి కృత్రిమమేధపై కేరళలో 2023 అక్టోబర్ 19–20 తేదీలలో వర్క్షాప్ నిర్వస్తున్నారు.ఈ  వర్క్షాప్ లో 13 రాష్ట్రాల వివిధ విభాగాలకు చెందిన 42 మంది అధికారులు  పాల్గొంటున్నారు. ఇందులో స్టేట్ డిజిటల్ ఆరోగ్య మిషన్, వ్యవసాయ విభాగం, రైతు సంక్షేమం, పశుగణాభివృద్ధి, రాష్ట్ర వస్తు సేవల పన్ను, గ్రామీణాభివృద్ధి, డైరీ డవలప్మెంట్, పోలీస్డిపార్టమెంట్ కు  సంబంధించిన వారు  పాల్గొంటున్నారు.

వివిధ రాష్ట్ర విభాగాల కింద పనిచేస్తున్న ఐటి టీమ్లు , ఆయా రాష్ట్రాలలో అమలు చేస్తున్న వవిధ సాంకేతిక కార్యకలాపాలను నిరంతరాయంగా అమలు చేసేందుకు , ఆ మేరకు వారి సన్నద్ధతను పెంచేందుకు ఈ రెండు రోజుల వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సామర్ధ్యాల నిర్మాణ వర్క్షాప్ ను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్, దాని విజ్ఞాన విభాగాల సమన్వయంతో నిర్వహిస్తోంది.

ఈ వర్క్షాప్ ప్రధాన ఉద్దేశం, సేవలను అందించే విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం, నూతన డిజిటల్ పరిజ్ఞానం విషయంలో విధానాలు వ్యూహాలను రూపొందించడం వంటివి ఉన్నాయి. ఈ వర్క్షాప్ లో ఎలక్ట్రానిక్స్, ఐటి డిపార్టమెంట్, కార్యదర్శి డాక్టర్ రతన్. యు.కేల్కర్ ,కె.ఎస్.ఐ.టి.ఎం డైరక్టర్ నిమా అరోరా తోపాటు ఎన్.ఇ.జి.డి , వాధ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , పాలసీ (డబ్ల్యు.ఐ.టి.పి) అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ వర్క్షాప్ రాష్ట్రంలో మెరుగైన ,సమర్ధమైన పాలన అందించేందుకు సాంకేతికతను వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుందని కార్యదర్శి అన్నారు. సంస్థ డైరక్టర్ మాట్లాడుతూ, ఈ వర్క్షాప్ అధికారుల రోజువారి పనిలో గణనీయమైన పరివర్తన తీసుకువస్తుందని అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలలో సరైన పరిష్కారాల సాధనకు , ఆయా విభాగాలలో వాటి అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ వర్క్షాప్లో భాగంగా వివిధ అంశాలకు సంబంధించి పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ విభాగాల నిపుణులను పిలిపించి అధికారులతో మాట్లాడించడం జరుగుతోంది. దీనిద్వారా ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి, సాంకేతికతను రోజువారి కార్యకలాపాలలో సమర్ధంగా వినియోగించడానికి తీసుకోవలసిన చర్యలను ఇందులో చర్చించడం జరుగుతోంది. ఇందుకు ఉపయోగపడే ఉపకరణాలను , భవిష్యత్ దార్శనికత, వినూత్న ఆలోచనలు, వివిధ ప్రాజెక్టుల గురించి ఇందులో చర్చించడం జరుగుతోంది.  2023 ఆగస్టులో ఈ తరహా వర్క్షాప్లను నిర్వహించడం ప్రారంభించారు. దీనిని ప్రభుత్వ– పరిశ్రమ కాన్సార్టియం భాగస్వామ్యంతో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రజాసేవలను మరింత మెరుగ్గా అందించడానికి సాంకేతికతను ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. ఇది పరిపాలనను బలోపేతం చేయడానికిమెరుగైన సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరిస్తుంది. ముందు ముందు కేరళలో నిర్వహించే వర్క్ షాప్లను ప్రభుత్వ కార్యకలాపాలలో డాటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకుక్లౌడ్ కంప్యూటింగ్కు సంబంధించి ఏర్పాటు చేయనున్నారు.

 

***


(Release ID: 1969734) Visitor Counter : 73


Read this release in: English , Urdu , Hindi , Kannada