ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0ని అమలు చేస్తున్న వ్యయ విభాగం, దాని అనుబంధ కార్యాలయాలు,అనుబంధ కార్యాలయాలు


హౌస్ కీపింగ్/పారిశుధ్య సిబ్బంది కోసం సఫాయి మిత్ర సురక్ష శిబిరాన్ని నిర్వహించిన వ్యయ విభాగం

Posted On: 19 OCT 2023 4:39PM by PIB Hyderabad

పెండింగ్ సమస్యల పరిష్కారం,పరిశుభ్రత కోసం స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0ని వ్యయ విభాగం, దాని అనుబంధ కార్యాలయాలు,అనుబంధ  కార్యాలయాలు అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించి, కార్యాలయాలకు వస్తున్న ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 అమలు జరుగుతోంది. 

స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 కార్యక్రమం నిర్వహణ కోసం 2023 సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు విభాగం సన్నాహక కార్యక్రమాలు నిర్వహించింది. స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 లక్ష్యాలు సాధించడానికి కార్యక్రమాలు అమలు చేయాల్సిన విభాగాలను గుర్తించారు.పెండింగ్ లో ఉన్న  ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు ,ఫిర్యాదులపై అందిన అప్పీళ్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సూచనలు తదితర అంశాలను సన్నాహక కార్యక్రమంలో గుర్తించారు. తొలగించాల్సిన ఫైళ్లను కూడా అధికారులు గుర్తించారు. 2023 అక్టోబర్ 31 వరకు  స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 అమలు జరుగుతుంది. లక్ష్యాల మేరకు కార్యక్రమాన్ని అమలు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. పెండింగ్ అంశాల పరిష్కారంతో పాటు వ్యయ విభాగం పలు కార్యక్రమాలు అమలు చేసింది. ఒకసారి వాడి పారవేసి ప్లాస్టిక్ వస్తువుల వాడకం, స్వచ్ఛతపై అధికారులు, సిబ్బందితో వ్యయ విభాగం కార్యదర్శి  2023 సెప్టెంబర్ 29న ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రత పాటిస్తామని, పర్యావరణాన్ని రక్షిస్తామని, సుస్థిర అభివృద్ధికి కృషి చేస్తామని అధికారులు/ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్న కార్యాలయాల సిబ్బంది ప్రతిజ్ఞ తీసుకున్నారు. 

సన్నాహక సమయంలో విభాగం సీనియర్ అధికారులు నార్త్ బ్లాక్ లో ఉన్న విభాగం కార్యాలయాలు, భవనాలను పరిశీలించి పరిశుభ్రత ప్రాధాన్యతను వివరించారు. 

ప్రత్యేక కార్యక్రమం 3.0లో భాగంగా 2023 అక్టోబర్ 5న హౌస్ కీపింగ్/పారిశుధ్య సిబ్బంది కోసం వ్యయ విభాగం సఫాయి మిత్ర సురక్ష శిబిరాన్ని నిర్వహించింది. ప్రత్యేక వైద్య శిబిరంలో దాదాపు 100 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు, సిబ్బందిని ప్రత్యేక కార్యదర్శి సన్మానించారు. 

ప్రత్యేక కార్యక్రమం 3.0 లో భాగంగా వ్యయ విభాగం కార్యాలయం లోపల, వెలుపల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించింది. విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. విభాగం అనుబంధ కార్యాలయాలు కూడా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాయి. 

 

***


(Release ID: 1969730) Visitor Counter : 67


Read this release in: English , Urdu , Hindi