విద్యుత్తు మంత్రిత్వ శాఖ
రిస్క్ మేనేజ్‌మెంట్‌లో గోల్డెన్ పీకాక్ అవార్డును సొంతం చేసుకున్న ఆర్ఈసి లిమిటెడ్
Posted On:
19 OCT 2023 5:24PM by PIB Hyderabad
రిస్క్ మేనేజ్‌మెంట్‌లో అసాధారణమైన పనితీరుకు గుర్తింపుగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడి) అందించే గౌరవం... గోల్డెన్ పీకాక్ అవార్డు, విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఈసి లిమిటెడ్ కు లభించింది. ఈ గోల్డెన్ పీకాక్ అవార్డు ప్రభావవంతమైన రిస్క్ అసెస్‌మెంట్ స్ట్రాటజీలను అమలు చేయడంలో ఆర్ఈసి నిరంతర నిబద్ధతకు అద్దం పడుతుంది. సంస్థ స్థిరమైన వృద్ధికి, పోటీ వ్యాపార వ్యవస్థలో స్థితిస్థాపకతను సూచిస్తుంది.
విద్యుత్ రంగంలో తన కార్యకలాపాలలో శ్రేష్ఠత, ఆవిష్కరణలకు ఆర్ఈసి కి ఉండే నిబద్ధతను ఈ గౌరవం స్పష్టం చేస్తుంది.
1991లో భారతదేశంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడి) స్థాపించిన గోల్డెన్ పీకాక్ అవార్డ్స్ కార్పొరేట్ ఎక్సలెన్స్ కోసం అంతర్జాతీయంగా ప్రశంసలు పొంది ఒక ప్రమాణంగా ఆవిర్భవించింది. ఆర్ఈసి లిమిటెడ్‌ను భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య నేతృత్వంలోని జ్యూరీ ప్యానెల్ ఎంపిక చేసింది.
ఆర్ఈసి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శ్రీ వీకే సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ దల్జీత్ సింగ్ ఖత్రీ అక్టోబర్ 17న లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్ఈసి తరపున అవార్డును అందుకున్నారు.
ఆర్ఈసి లిమిటెడ్ గురించి...
ఆర్ఈసి లిమిటెడ్ అనేది భారతదేశం అంతటా పవర్ సెక్టార్ ఫైనాన్సింగ్, డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించే ఎన్బిఎఫ్సి. 1969లో స్థాపించబడిన ఆర్ఈసి లిమిటెడ్ యాభై సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసింది. ఇది రాష్ట్ర విద్యుత్ బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్ర విద్యుత్ వినియోగాలు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు, గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలు, ప్రైవేట్ రంగ వినియోగాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్, రెన్యూవబుల్ ఎనర్జీతో సహా వివిధ రకాల ప్రాజెక్ట్‌ల కోసం దీని వ్యాపార కార్యకలాపాలు పూర్తి పవర్ సెక్టార్ వాల్యూ చైన్‌లో ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్‌లను కలిగి ఉంటాయి; ఆర్ఈసి నిధులు భారతదేశంలోని ప్రతి నాల్గవ బల్బును ప్రకాశింపజేస్తాయి. ఆర్ఈసి ఇటీవల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ సెక్టార్‌కు రుణసహాయం అందించే సంస్థగా కూడా తన కార్యకలాపాలను విస్తరించింది.
***
(Release ID: 1969724)
Visitor Counter : 76